President of Pakistan
-
పాక్ అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ 13వ అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ (69) ప్రమాణం చేశారు. ఆదివారం ఐవాన్–ఇ–సద్ర్ (అధ్యక్ష భవనం)లో జరిగిన కార్యక్రమంలో అల్వీతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షకీబ్ నిసార్ ప్రమాణం చేయించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జనరల్ క్వమర్ జావెద్ బజ్వాతో పాటు పౌర, సైనిక అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అల్వీ.. వృత్తిరీత్యా డెంటిస్ట్. ఇమ్రాన్ ఖాన్కు సన్నిహితుడు కూడా. 2006 నుంచి 2013 వరకు పీటీఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. -
చర్చల నుంచి భారత్ పారిపోతోంది: పాక్
ఇస్లామాబాద్: పఠాన్కోట్ ఉగ్రవాద దాడిపై సంయుక్త దర్యాప్తునకు పాక్ ముందుకొచ్చినప్పటికీ... భారతదేశం మాత్రం చర్చల నుంచి పారిపోతోందని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆరోపించారు. పాకిస్థాన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన బుధవారం ప్రసంగించారు. భారత్తో చర్చలను తిరిగి ఆరంభించేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పఠాన్కోట్ దాడిపై సంయుక్త దర్యాప్తునకు ముందుకొచ్చినప్పటికీ భారత్ మాత్రం విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను నిలిపివేసిందని పేర్కొన్నారు. ఉప ఖండంలో ఉద్రిక్తతకు ప్రధాన కారణం కశ్మీర్ సమస్యేనని తాము నమ్ముతున్నామని.. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు, ఐరాస తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించనిదే సమస్యలు పరిష్కారం కాబోవని వ్యాఖ్యానించారు.