president police medals
-
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ప్రకటించిన కేంద్రం.. ఏపీకి విశిష్ట సేవా అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. ఏపీకి రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. తెలంగాణకు రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 13 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కాగా, జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. అనేక రాష్ట్రాల పోటీ మధ్యలో ఏపీ శకటం ప్రబల తీర్థం పరేడ్‌కు ఎంపికైంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొత్తం 17 శకటాలు ఎంపికయ్యాయి. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. చదవండి: రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్ -
ఏపీ పోలీసులకు పతకాల పంట
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి చెందిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ పి.వెంకట్రామిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర హోం శాఖ ఆయనకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ప్రకటించింది. ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. ఏపీకి చెందిన ఏఏసీ మండ్ల హరికుమార్కు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీఎంజీ), జేసీ ముర్రే సూర్యతేజకు ఫస్ట్ బార్ టు పీఎంజీ, జేసీ పువ్వుల సతీష్‌కు పీఎంజీ ప్రకటించింది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాంతారావు (ఎస్ఎస్జీ ఐఎస్‌డబ్ల్యూ, విజయవాడ), ఎస్ఐ వి.నారాయణమూర్తి (ఎస్ఐబీ, విజయవాడ)లకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. -
మహేశ్ భగవత్, దేవేందర్ సింగ్‌లకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణలో అత్యుత్తమ సేవలు అందించిన 14 మంది రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోంశాఖ పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్ర అడిషనల్ డీజీపీ హోదాలో రాచకొండ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న దేవేందర్ సింగ్ చుంగిలను రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌కు ఎంపిక చేసింది. మరో 12 మంది పోలీసు అధికారులకు మెరిటోరియస్ సర్వీస్ పతకాలను ప్రకటించింది. పోలీసు బలగాల్లో మంచి పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందికి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ సేవా పతకాలను ప్రకటిస్తుంది. మెరిటోరియల్ మెడల్స్ పొందినది వీరే.. మెరిటోరియల్ మెడల్స్‌కు ఎంపికైనవారిలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నేర పరిశోధన విభాగం అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఏఆర్ శ్రీనివాస్, సీఐడీ అదనపు ఎస్పీ పాలేరు సత్యనారాయణ, ఎస్ఐబీలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ పైళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఏసీపీ సాయిని శ్రీనివాసరావు, ఖమ్మం ఏసీబీ డీఎస్పీ సూరాడ వెంకటరమణమూర్తి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ చెరుకు వాసుదేవరెడ్డి, పోలీస్ అకాడమీలో డీఎస్పీగా ఉన్న గంగిశెట్టి గురు రాఘవేంద్ర, రామగుండం సీఎస్బీ ఎస్సై చిప్ప రాజమౌళి, రాచకొండ ఎస్బీ ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాస్, కామారెడ్డి హెడ్‌క్వార్టర్స్ ఏఆర్ ఎస్సై జంగన్నగారి నీలంరెడ్డి, మామునూర్ బెటాలియన్ ఏఆర్ ఎస్సై సలేంద్ర సుధాకర్, కరీంనగర్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఉండింటి శ్రీనివాస్ ఉన్నారు. మిగతా యూనిఫాం విభాగాల్లో.. • అగ్నిమాపక శాఖ (ఫైర్ సర్వీస్)లో ఉత్తమ సేవలకు సంబంధించి తెలంగాణకు చెందిన ఇద్దరు మెడల్స్‌కు ఎంపికయ్యారు. లీడింగ్ ఫైర్మన్లు ఎర్రగుంట వెంకటేశ్వరరావు, ఫరీద్ షేక్‌లకు ఫైర్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. • హోంగార్డులు చల్లా అశోక్‌రెడ్డి, చంద్ర సురేశ్, అబ్దుల్ షుకూర్బేగ్లకు హోంగార్డ్స్, సివిల్ డిఫెన్స్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. • జైళ్లశాఖకు సంబంధించి హెడ్ వార్డర్ వలదాసు జోసెఫ్, చీఫ్ హెడ్ వార్డర్ జె.వీరాస్వామిలకు కరెక్షనల్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. 34 ఏళ్ల సర్వీసులో 30 రివార్డులు చౌటుప్పల్: కేంద్ర మెరిటోరియస్ పోలీస్ మెడల్‌కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాస్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి.. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై వరకు 34 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాట్రగడ్డ శ్రీనివాస్ ఇప్పటివరకు 30 రివార్డులు పొందారు. తాజాగా ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక మెడల్‌కు ఎంపికవడం సంతోషంగా ఉందని శ్రీనివాస్ పేర్కొన్నారు. మహేశ్ భగవత్‌కు మూడోసారి.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌కు ప్రతిష్టాత్మక పోలీస్ మెడల్స్ దక్కడం ఇది మూడోసారి. 2004లో ప్రెసిడెంట్ పోలీసు మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీపీఎంజీ), 2011లో పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పురస్కారాలను అందుకున్న ఆయన.. తాజాగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ముగ్గురు రైల్వే పోలీసులకు మెడల్స్ విధుల్లో మంచి ప్రతిభ కనబర్చిన దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళానికి చెందిన ముగ్గురు సిబ్బంది పోలీస్ మెడల్స్‌కు ఎంపికయ్యారు. ఇందులో మహబూబ్‌నగర్‌లో ఆర్పీఎఫ్ ఎస్సైగా పనిచేస్తున్న సైదా తహసీన్, మౌలాలి రైల్వే రక్షణ దళం శిక్షణ కేంద్రంలో ఏఎస్సై నాటకం సుబ్బారావు, ఇదే శిక్షణ కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి విజయ సారథి ఉన్నారు. చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం -
అడిషనల్ డీజీపీ శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ మెడల్
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురి పోలీసు అధికారులకు రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు. విశిష్ట సేవా పతకాల విభాగంలో తెలంగాణ నుంచి అడిషనల్ డీజీపీ (పర్సనల్) బి.శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ మెడల్ లభించింది. శనివారం ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. 4 విభాగాల్లో మెడల్స్ దక్కగా.. రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం, పోలీస్ శౌర్య పతకం విభాగాల్లో మెడల్స్ దక్కలేదు. కాగా, ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కొట్ర సుధాకర్లకు రాష్ట్రపతి పతకం దక్కింది. సేవా పతకాలు.. తెలంగాణ నుంచి 12 మంది అధికారులకు ప్రతిభావంతమైన సేవా పతకాలు దక్కాయి. అకున్ సబర్వాల్ (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్), టీఎస్ఎస్పీ రెండో బెటాలియన్ (ఐఆర్ యాప్లగూడ, ఆదిలాబాద్) కమాండెంట్ ఆర్.వేణుగోపాల్, హైదరా బాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇక్బాల్ సిద్దిఖీ, బీచుపల్లి పదో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ పి.సత్యనారాయణ, నిజామా బాద్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ డి.ప్రతాప్, ఖమ్మం టౌన్ ఏసీపీ ఘంటా వెంకటరావు, నల్లగొండ డీఎస్పీ సామ జయరాం, 8వ బెటాలియన్ (కొండాపూర్) ఆర్ఐ రవీంద్రనాథ్, హన్మకొండ ఏఎస్సై సుధాకర్, హైదరాబాద్ పోలీస్ అకాడమీ ఏఎస్సై ఎం.నాగలక్ష్మి, గండిపేట్ ఏఎస్సై ఆర్.అంతిరెడ్డి, పుప్పాలగూడ పోస్ట్ సీనియర్ కమాండో డి.రమేశ్‌బాబులకు సేవ పతకాలు లభించాయి. ఎన్పీఏ నుంచి..: నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ ఎస్ఐ (బ్యాండ్) బి.గోపాల్‌కు విశిష్ట సేవా పతకాల విభాగంలో మెడల్ లభించింది ఎన్ఐఏ నుంచి: ప్రతిభావంతమైన సేవా పతకాల (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) విభాగంలో హైదరాబాద్ ఎన్ఐఏ అసిస్టెంట్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి, హైదరాబాద్ ఎన్ఐఏలో డీఎస్పీగా పనిచేస్తున్న దొంపాక శ్రీనివాసరావుకు పతకం లభించింది. భారతీయ రైల్వే నుంచి: హైదరాబాద్‌లో రైల్వేలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తూంకుంట చంద్రశేఖర్‌రెడ్డి, కర్నాటి చక్రవర్తి, సబ్ఇన్స్పెక్టర్ దోమాల బాలసుబ్రమణ్యానికి ప్రతిభావంతమైన సేవా పతకం లభించింది. ఫైర్ సర్వీస్ మెడల్స్.. దేశవ్యాప్తంగా 104 మంది అగ్నిమాపక సర్వీసు అధికారులకు పతకాలు ప్రకటించగా తెలంగాణ నుంచి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజ్ కుమార్ జనగామ, ఫైర్‌మన్ భాస్కర్‌రావు కమతాలకు ఫైర్ సర్వీస్ మెడల్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. -
విజిలెన్స్ డీజీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ పతకం
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కొట్ర సుధాకర్లకు రాష్ట్రపతి పతకం (ప్రెసిడెంట్ మెడల్) దక్కింది. విశిష్ట సేవలు అందించినందుకుగాను వీరిద్దరు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ (పీపీఎం)కు, ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు రాష్ట్రానికి చెందిన మరో 15 మంది పోలీస్ మెడల్స్(పీఎం)కు ఎంపికయ్యారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల్లో సేవలందించిన వారికి నాలుగు రకాల మెడల్స్‌ను ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం (పీపీఎంజీ–ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ)కి నలుగురు, పోలీస్ శౌర్య పతకం (పీఎంజీ)కి 286 మంది, రాష్ట్రపతి పోలీస్ పతకం (పీపీఎం)కి 93, పోలీస్ పతకం (పీఎం)కు 657 మంది పోలీసులు ఎంపికయ్యారు. పోలీసు మెడల్‌కు ఎంపికైన వారు వీరే.. అలాగే, ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు రాష్ట్రానికి చెందిన 15 మంది పోలీస్ మెడల్ (పీఎం)కు ఎంపికయ్యారు. వారిలో విజయవాడ అదనపు ఎస్పీ అమలపూడి జోషి, మంగళగిరి ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ చింతలపూడి వీఏ రామకృష్ణ, విజయవాడ సీఐడీ డీఎస్పీ ఎం.భాస్కరరావు, విశాఖ గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ విజయకుమార్, విజయవాడ రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జాన్‌మోజెస్ చిరంజీవి, నెల్లూరు ఏఆర్ ఎస్సై నన్న గౌరి శంకరుడు, అనకాపల్లి ఏఎస్సై విక్టోరియా రాణి, చిత్తూరు ఏఎస్సై కేఎన్ కేశవన్, అనంతపురం ఏఆర్ ఎస్సై ఎస్.రామచంద్రయ్య, ఒంగోలు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, విజయవాడ ఎస్ఐబీ హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, విజయనగరం ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణరాజు, కర్నూలు పోలీస్ కానిస్టేబుల్ రామన్న, విశాఖ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, విశాఖపట్నం ఏసీబీ ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ ఎంవీ సత్యనారాయణరాజులు ఉన్నారు. మరోవైపు.. తెలంగాణా అడిషనల్ డీజీపీ (పర్సనల్) బి.శివధర్‌రెడ్డికి కూడా రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం లభించింది. 12 మంది పోలీసు అధికారులకు ప్రతిభావంతమైన సేవా మెడల్స్ లభించాయి. ఏపీకి జీవన్ రక్షా పాదక్ అవార్డులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ఆమోదం మేరకు ఇచ్చే జీవన్ రక్షా పాదక్ సిరీస్ అవార్డులనూ కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సర్వోత్తమ్ జీవన్ రక్షాపాదక్, ఉత్తమ్ జీవన్ రక్షాపాదక్, జీవన్రక్షా పాదక్ విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. ఉత్తమ్ జీవన్ రక్షా పాదక్ విభాగంలో ఏపీ నుంచి మీసాల ఆనంద్‌కు, జీవన్ రక్షా పాదక్ విభాగంలోనూ ఏపీ నుంచి రాజేష్, ముఖేష్కుమార్లకు అవార్డు దక్కింది. అలాగే, అగ్నిమాపక విభాగంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ చింతాడ కృపావరం, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బి.వీరభద్రరావులకు ఫైర్ సర్వీస్ మెడల్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. డీజీపీ అభినందనలు విధి నిర్వహణలో గొప్ప సేవలు అందించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసులకు కేంద్ర పతకాలు రావడంపట్ల ఆయన వారిని అభినందించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లకు శనివారం ఆయన ఫ్యాక్స్ మెస్సేజ్ ఇచ్చారు. వీరు సాధించిన పతకాలు రాష్ట్రానికి, పోలీసు శాఖకు గర్వకారణమన్నారు. రాజేంద్రనాథ్ విశిష్ట సేవలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తన 25 సంవత్సరాల సర్వీసులో అనేక సంచలనాత్మక కేసులను సమర్ధవంతంగా డీల్ చేశారు. ప్రధానంగా విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో చిన్నారి వైష్టవి దారుణ హత్యలో నిందితులను మూడ్రోజుల్లోనే పట్టుకున్నారు. అలాగే.. - విజయవాడ వన్‌టౌన్‌లో ఎప్పుడూ లేని విధంగా అప్పట్లో మతకలహాలు చోటు చేసుకోవడంతో అందులోని నిందితులను వెంటనే పట్టుకున్నారు. సంఘ విద్రోహులకు నగర బహిష్కరణ విధించారు. - తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖుల విగ్రహాల ధ్వంసం కేసు.. నెల్లూరు జిల్లాలోని కేథలిక్ సిరియన్ బ్యాంకు దోపిడీ కేసు, డెకాయిట్ల ఆగడాలను నిలువరించడంలో విశేష ప్రతిభ కనబరిచారు. - ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా వ్యవహరిస్తూ కీలకమైన కేసుల విచారణలో ముఖ్య భూమిక వహిస్తున్నారు. రాజధాని నిర్మాణం, ఇతర అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణ ఇందులో ముఖ్యమైనవి. -
రాష్ట్ర అధికారులకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్
నలుగురు అధికారులకు ప్రెసిడెంట్ విశిష్ట సేవాపతకాలు మరో 12 మంది అధికారులు, సిబ్బందికి మెరిటోరియస్ పతకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పని చేస్తున్న ఉన్నతాధికారులు, సిబ్బందికి అత్యున్నత పోలీస్ సేవా పతకాలు లభించాయి. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, మెరిటోరియస్ మెడల్స్ విభాగంలో 16 మంది అధికారులు పతకాలు పొందినట్టు కేంద్ర హోంశాఖ మంగళవారం జాబితా విడుదల చేసింది. ఈ పతకాలను ఆగస్టు 15న అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బహూకరిస్తుంది. రాష్ట్రపతి పోలీసు పతకాలు రాచకొండ జాయింట్ కమిషనర్ శశిధర్‌రెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వర్రావు హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరెక్టర్ కృష్ణ, సీబీఐ ఏఎస్ఐ సత్యనారాయణ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్: ∙వెలివాల సత్యనారాయణ, సౌత్‌జోన్ డీసీపీ, హైదరాబాద్ ∙సురేందర్‌రెడ్డి, డీఎస్పీ, ఇంటెలిజెన్స్ విభాగం ∙పల్లె రామచందర్, ఎస్ఐ, సీఐడీ, హైదరాబాద్ ∙కే తిరుపాజి, ఎస్ఐ, మహబూబ్‌నగర్ ∙భూక్యా బాలా, ఏఎస్ఐ, కరీంనగర్ ∙సి.శంకర్, ఏఎస్ఐ, పీటీసీ, కరీంనగర్ ∙జవ్వాజి వెంకటశేషగిరి రావు, ఏఎస్ఐ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్ ∙షేక్ జలీల్ అహ్మద్, ఏఎస్ఐ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ ∙కే సత్యనారాయణ, ఏఎస్ఐ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ ∙కమ్మెట ప్రభాకర్, హెడ్‌కానిస్టేబుల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ ∙కాశెట్టి కిషన్, హెడ్ కానిస్టేబుల్, కరీంనగర్ ∙మహమ్మద్ మహమూద్, ఏఎస్ఐ, అంబర్పేట్ పీఎస్, హైదరాబాద్ -
ప్రతిభావంతులకు పోలీస్ పతకాలు
ఢిల్లీ: అత్యున్నత ప్రతిభ కనబర్చిన పోలీసులకు పతకాలు ప్రకటించారు. ఆ వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. ఇండియన్ పోలీస్ మెడల్స్: అనీల్‌కుమార్(డీఐజీ ), మధుసూదన్‌రెడ్డి(డీఐజీ ), నాగిరెడ్డి(డీఐజీ ) దేవెందర్సింగ్చౌహాన్(డీఐజీ ) సంజయ్‌కుమార్‌జైన్(జాయింట్ సీపీ) సోమశేఖర్‌రెడ్డి(సీఐడీ డైరెక్టర్), ప్రదీప్‌రెడ్డి( అడిషనల్ ఎస్పీ) రవిప్రకాశ్(అడిషనల్ ఎస్పీ) బొల్ల శ్రీనివాసులు (అడిషనల్ ఎస్పీ) ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్: తుషార్ త్రిపాఠి(అడిషనల్ డీజీ పీ), బీఎల్ మీనా(డీజీ ) రెడ్డి రవీందర్‌రెడ్డి( అడిషనల్ ఎస్పీ) మరికొంత మంది పోలీసులకు కూడా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ఇవ్వనున్నారు.