రాష్ట్ర పోలీస్ శాఖలో పని చేస్తున్న ఉన్నతాధికారులు, సిబ్బందికి అత్యున్నత పోలీస్ సేవా పతకాలు లభించాయి
నలుగురు అధికారులకు ప్రెసిడెంట్ విశిష్ట సేవాపతకాలు
మరో 12 మంది అధికారులు, సిబ్బందికి మెరిటోరియస్ పతకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పని చేస్తున్న ఉన్నతాధికారులు, సిబ్బందికి అత్యున్నత పోలీస్ సేవా పతకాలు లభించాయి. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, మెరిటోరియస్ మెడల్స్ విభాగంలో 16 మంది అధికారులు పతకాలు పొందినట్టు కేంద్ర హోంశాఖ మంగళవారం జాబితా విడుదల చేసింది. ఈ పతకాలను ఆగస్టు 15న అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బహూకరిస్తుంది.
రాష్ట్రపతి పోలీసు పతకాలు
రాచకొండ జాయింట్ కమిషనర్ శశిధర్‌రెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వర్‌రావు
హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరెక్టర్ కృష్ణ, సీబీఐ ఏఎస్‌ఐ సత్యనారాయణ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్: ∙వెలివాల సత్యనారాయణ, సౌత్‌జోన్ డీసీపీ, హైదరాబాద్ ∙సురేందర్‌రెడ్డి, డీఎస్పీ, ఇంటెలిజెన్స్ విభాగం ∙పల్లె రామచందర్, ఎస్‌ఐ, సీఐడీ, హైదరాబాద్ ∙కే తిరుపాజి, ఎస్‌ఐ, మహబూబ్‌నగర్ ∙భూక్యా బాలా, ఏఎస్‌ఐ, కరీంనగర్ ∙సి.శంకర్, ఏఎస్‌ఐ, పీటీసీ, కరీంనగర్ ∙జవ్వాజి వెంకటశేషగిరి రావు, ఏఎస్‌ఐ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్ ∙షేక్ జలీల్ అహ్మద్, ఏఎస్‌ఐ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ ∙కే సత్యనారాయణ, ఏఎస్‌ఐ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ ∙కమ్మెట ప్రభాకర్, హెడ్‌కానిస్టేబుల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హైదరాబాద్ ∙కాశెట్టి కిషన్, హెడ్ కానిస్టేబుల్, కరీంనగర్ ∙మహమ్మద్ మహమూద్, ఏఎస్‌ఐ, అంబర్‌పేట్ పీఎస్, హైదరాబాద్