previlege committee
-
కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం
సాక్షి, అమరావతి: ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. తదుపరి సమావేశానికి వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అచ్చెన్నాయుడుకు అవకాశం ఇచ్చింది. అనంతరం కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేనని అచ్చెన్నాయుడు సమాచారం అందించారు. వచ్చే నెల 14వ తేదీన హాజరు కావాల్సిందిగా అచ్చెన్నాయుడుకు నోటీసులిస్తున్నట్లు చైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి తెలిపారు. కూన రవిని వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణించింది. కూన రవిది ధిక్కారంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలను పాటించకుండా కూన రవి తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడ్డారని మండిపడింది. కూన రవిపై చర్యలు తీసుకునే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీలో నిర్ణయం తీసుకోనాలని సభ ముందు ఉంచుతామని తెలిపింది. -
ముగిసిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రతి సభ్యుడి హక్కులు కాపాడాని నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ సభా హక్కుల కమిటీ భేటీ అయింది. అనంతరం కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై ఇవాళ విచారణ చేపట్టినట్లు తెలిపారు. వారి వివరణ కోసం పది రోజుల సమయం ఇస్తున్నామని పేర్కొన్నారు. స్పీకర్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్యే జోగి రమేష్, శ్రీకాంత్‌రెడ్డి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుపై సభలో చేసిన తీర్మానం ఆధారంగా రిఫర్ చేశారని కాకాణి తెలిపారు. ఈ అంశంపై చర్చించి వివరణ కోరామని, కమిటీ ముందుకు నాలుగు అంశాలు మాత్రమే వచ్చాయని, వాటిపై విచారణ జరిపామని తెలిపారు. ఈ భేటీలో కమిటీ సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, మల్లాది విష్ణు, చినఅప్పలనాయుడు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై కమిటీ విచారణ చేపట్టింది. టీడీపీ ఫిర్యాదులు విచారించలేదన్నది అవాస్తవమని, కమిటీ సమావేశంలో టీడీపీ సభ్యుడు కూడా ఉన్నారన్నారు. ఆ సభ్యులు కూడా తమ నిర్ణయంతో ఏకీభవించారన్నారు. టీడీపీ సభ్యులు కూడా ఫిర్యాదులు చేసిందని తమ దృష్టికి తెచ్చారని, స్పీకర్ ఎప్పుడు రిఫర్ చేస్తే అప్పుడు విచారిస్తామని పేర్కొన్నారు. -
సభాహక్కుల కమిటీకి ‘స్పీకరు ప్రెస్‌మీట్’
అమరావతి: జాతీయ మహిళా సదస్సుపై స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రెస్‌మీట్‌ను వక్రీకరించిన మీడియాపై చర్యలకు సిఫార్సు కోసం ఈ అంశాన్ని సభా హక్కుల కమిటీకి పంపుతామని సభాపతి ప్రకటించారు. పవిత్రసంగమంలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు ఏర్పాట్లపై ప్రెస్మీట్లో స్పీకరు అనని మాటలను అన్నట్లుగా ‘సాక్షి’ మీడియా దుష్ప్రచారం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే అనిత గురువారం అసెంబ్లీలో ఆరోపించారు. పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజిలో ప్రధాన భూమిక పోషించిన మంత్రి నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విపక్షం చేసిన డిమాండుపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అనిత పాత విషయాన్ని సభలో తెరపైకి తెచ్చారు. ఏది పడితే అది రాయడం ద్వారా సాక్షి గతంలో తనను కూడా అవమానించిందని ఆమె ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా సభాధ్యక్షుడిని కూడా అవమానించిన విషయాన్ని సభ్యులందరికీ చూపించేందుకు సభలో వీడియో ప్రదర్శించగా దానికి చూడకుండా ప్రతిపక్షం పారిపోయిందని ఆమె విమర్శించారు. అందువల్ల ఈ విషయంపై సిఫార్సు చేసేందుకు వీలుగా ఈ అంశాన్ని çసభాహక్కుల కమిటీకి సిఫార్సు చేయాలని ఆమె స్పీకరుకు నోటీసు ఇచ్చినట్లు సభలో ప్రకటించారు. అనిత ఇచ్చిన నోటీసు అందిందని, దీనిని సభా హక్కుల కమిటీకి పంపుతామని స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. -
హోదా.. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష: పిన్నెల్లి
-
హోదా.. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష: పిన్నెల్లి
ప్రత్యేక హోదా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని వైఎస్ఆర్సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత తమపై ఉందని, అయితే అసెంబ్లీలో తమ గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఎంతవరమైనా పోరాడతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజి కమిటీ ఎదుట శుక్రవారం హాజరైన ఆయన.. తన వివరణ ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము హాజరు కాలేకపోతున్నామని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని), చెవిరెడ్డి భాస్కరరెడ్డి లేఖలు రాశారు. ఇప్పటికే 9 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విచారణ కమిటీ ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ గత అసెంబ్లీ సమావేశాలలో వైఎస్ఆర్సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీనిపై అసెంబ్లీలో ఆందోళనకు దిగినందుకు విపక్ష ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.