Prime Minister Justin Trudeau
-
పార్లమెంట్ సాక్షిగా మహిళపై ప్రధాని దుశ్చర్య!
ఒట్టావో: పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీకి చెందిన మహిళా నేతపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. పార్లమెంటులోనే మహిళా నాయకురాలిని ఆయన నెట్టివేశారని, ఆమెపై చేయి చేసుకున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాని ట్రూట్ తన ఛాతీపై మోచేతితో వెనక్కి నెట్టివేశాడని, అత్యంత హేయనీయమని బాధిత మహిళా నేత రుథ్ ఎల్లెన్ బ్రోస్సే ఆరోపించారు. మహిళా నాయకురాలి ఛాతీని తాకడం, మోచేతితో నెట్టివేసి ఇంత దారుణంగా ప్రవర్తించడంలో ఆయన ఉద్దేశమేంటని ఆమె ప్రశ్నించారు. ప్రధాని ట్రూడ్ చర్యతో మొదట ఆశ్చర్యపోయిన ఆమె ఆ వెంటనే ఘటన నుంచి తేరుకుని పార్లమెంట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రధాని దురుసు ప్రవర్తన కారణంగా తాను ఓటు హక్కును వినియోగించుకోలేక పోయానని ఎల్లెన్ వివరించారు. హౌస్ ఆఫ్ కామన్స్ సీసీ ఫుటేజీ పరిశీలించి చూడగా, ప్రధాని ప్రతిపక్ష నేతలపై దాడికి దిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాలను పక్కనపెడితే ట్రూడ్.. గతంలో బాక్సర్ గా, బార్ లో బౌన్సర్ గానూ చేశారు. చాంబర్ లో స్ట్రాంగ్ లీడర్లను వెనక్కి తగ్గేలా చేయడంలో భాగంగా ట్రూడ్ ఈ చర్యలకు దిగారని తీవ్రంగా మండిపడుతున్నారు. తాను తీసుకొచ్చిన సవరణలపై ఓటింగ్ ప్రవేశపెట్టామని, అయితే ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని క్షమాపణ కోరుతున్నానని ట్రూడ్ వివరణ ఇచ్చుకున్నారు. -
బాక్సర్ అవతారమెత్తిన ప్రధాని!
న్యూయార్క్: కొందరు రాజకీయ నాయకులకు మరికొన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంటుంది. అయితే ఓ దేశ ప్రధాని మాత్రం బాక్సింగ్ రింగ్ లోకి దిగి ప్రత్యర్థులపైకి పంచ్ లు విసరటం మొదలెట్టారు. అలాగని ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారని భావిస్తే తప్పులో కాలువేసినట్టే. ఆటవిడుపు కోసం ప్రధాని బాక్సింగ్ బరిలోకి దిగారు. ఆ ప్రధాని మరెవరో కాదు కెనడా పీఎం జస్టిన్ ట్రూడ్. గురువారం నాడు బాక్సింగ్ రింగ్ లో అడుగుపెట్టి తన పంచ్ పవర్ రుచిచూపిస్తున్నారు. న్యూయార్క్ పర్యటన నేపథ్యంలో ట్రూడ్ బాక్సర్ అవతారమెత్తారు. న్యూయార్క్ లోని గ్లియాన్సన్ జిమ్ లో ఆయన ప్రతక్షమైనప్పటి ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రాజకీయ రంగం నుంచి బాక్సింగ్ రింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడా ఏంటని కొందరు ఆశ్చర్యపోగా, బాక్సర్ అవతారంలో పీఎం బాగున్నాడంటూ మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. జిమ్ లో ఉన్న బాక్సింగ్ రింగ్ లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రెడ్ స్లివ్ లెస్ ధరించిన ఆయన ఎడమచేతి భుజంపై ఓ టాటుతో కనిపించారు. అక్కడి వారికి ప్రధాని బాక్సింగ్ పాఠాలు బోధించారు. గత ఎన్నికల్లో ఆయన ప్రచార కార్యక్రమం సమయంలో ప్రొఫెషనల్ బాక్సర్, హెవీవెయిట్ మాజీ చాంపియన్ యురీ ఫోర్ మెన్ తో కలిసి ప్రాక్టిస్ చేస్తూ చాలా సమయాన్ని వృథా చేశారని ఆరోపణలున్నాయి. బాక్సింగ్ లో అనుభవంతో పాటు హై స్కూల్లో బోధించిన ఎక్స్ పీరియన్స్ కూడా ట్రూడ్ సొంతం.