కనిపించని ‘ముద్ర’
11,587 మందికే ఆర్థిక సాయం
రుణాలు ఇచ్చేందుకు వెనకాడుతున్న బ్యాంకర్లు
నేడు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం
నల్లగొండ: దిగువ, మధ్య తరగతి వ్యాపారులు, సేవ లు, సంబంధిత సంస్థలు, వివిధ రంగాల్లో రాణిస్తు న్న వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్ర భుత్వ గతేడాది ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ ఆశించిన రీతి లో అమలుకావడం లే దు. ఎలాంటి జమాన తు లేకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరాల్సిన పథకం పలుకుబడి ఉన్నవారికి అందుతుంది. 2015-16 ఆర్థికసంవత్సరానికి గాను ఒక్కో బ్రాంచి కనీసం పది మందికి ముద్ర పథకం కింద ఆర్థికంగా చేయూత నివ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత మళ్లీ మార్పులు చేసి బ్యాంకు పరిమితులకు లోబడి ఎంతమందికైనా రుణాలు ఇవ్వొచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 రకాల బ్యాంకుల్లో పథకం అమలవుతోంది. వీటి పరిధిలో 360 బ్రాంచి కార్యాలయాలు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి.
దీంట్లో 28 రకాల బ్యాంకు ల్లో మాత్రమే ముద్ర పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ బ్యాంకులు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 11,587 మందికే రుణాలు మంజూరు చేశా యి. బీమా పథకాలది అదే తీరు. జిల్లా జనాభా 34 ల క్షలు ఉండగా దాంట్లో కనీసం 15 లక్షల మందిని బీ మా పథకాల్లో చేర్చాలని నిర్ణయించారు. కానీ జీవన్ జ్యోతి బీమా యోజనలో 1.47 లక్షలు, సురక్ష బీమా యోజనలో 4.02 లక్షల మందిని మాత్రమే చేరారు.
నేడు పథకాలపై సమీక్ష...
కలెక్టరేట్లో గురువారం బ్యాంకర్ల సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కలెక్టర్, జిల్లా ప్రజాప్రతినిధులు, బ్యాంకర్లు, వివిధ శాఖల అధి కారులు హాజరుకానున్నారు.