private diary
-
వెనక్కెనక్కి..
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ డెయిరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రైవేటు డెయిరీలు పాల ఉత్పత్తి దారులను ఆకర్షించే చర్యలను తీసుకోవడంతోపాటు పాల ధరలను ఎప్పటికప్పుడు మార్కెట్‌కు అనుగుణంగా పెంచుతున్నారు. ఈ విషయాలలో ఏపీ డెయిరీ చాలా వెనుకబడి ఉంది. పతి సందర్భంలో ప్రైవేటు డెయిరీల తర్వాతే ధరను పెంచుతోంది. క్షేత్రస్థాయిలో రైతులతో చర్చించి పాలసేకరణను ప్రోత్సహించే అధికారులే కరువయ్యారు. గత ఏడాది వరకు జిల్లా వ్యాప్తంగా ఏపీ డెయిరీ రోజుకు 60వేల లీటర్ల వరకు పాలను సేకరించింది. ప్రస్తుతం 14వేల లీటర్లకు పడిపోయింది. జిల్లాలోని ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో ఏపీ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రాలు ఉండగా తొండూరు, వేంపల్లి, సింహాద్రిపురం, లింగాల, సుండుపల్లి, ఒంటిమిట్ట, రైల్వే కోడూరు తదితర ప్రాంతాల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఎంసీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం చాలా కేంద్రాల నుంచి పాల సేకరణ సక్రమంగా జరగడం లేదు. వేల లీటర్ల పాలను సేకరించే బీఎంసీలు కూడా నేడు వందల లీటర్లకు చేరాయి. ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు ఎప్పటికప్పుడు గ్రామాలకు వచ్చి పాల ఉత్పత్తిదారులతోపాటు రైతులతో చర్చించి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో ఏపీ డెయిరీ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మహిళా సంఘాలకు శిక్షణా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తుండేవారు. ప్రస్తుతం ఇలాంటివి లేకపోవడంతో ఏపీ డెయిరీకి గ్రామాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. మరో వైపు పాల ధరల్లో కూడా పూర్తిగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఏపీ డెయిరీ అధికారులు రాష్ట్రంలోని ప్రాంతాలను బట్టి ధరలను చెల్లిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం జిల్లాలో ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు వెన్నశాతాన్ని బట్టి లీటర్ పాలను రూ.49లతో కొనుగోలు చేస్తుండగా ఏపీ డెయిరీ మాత్రం రూ.45 మాత్రమే చెల్లిస్తోంది. వాస్తవానికి రూ.49 కూడా తమకు గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఏపీ డెయిరీ మాత్రం నిద్రమత్తు నుంచి ఇంకా తేరుకోవడంలేదు. జిల్లాలో సుమారు 40 ప్రైవేటు డెయిరీలు ఉండగా మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. -
పాడిరైతుకు టోపీ
తదితర ప్రైవేటు డెయిరీలకు పాలు పోస్తున్నారు. విజయ డెయిరీ జిల్లా వ్యాప్తంగా 150 సహకార సంఘాల పరిధిలో 420 పైగా ఉన్న కేంద్రాల ద్వారా పాలసేకరణ చేస్తోంది. వీటితో పాటు మరో 500 ప్రైవేటు కేంద్రాల ద్వారా పాలసేకరణ జరుగుతోంది. పాడి రైతుల ద్వారా జిల్లాలో ప్రతి రోజూ 1.50 లక్షల లీటర్ల వరకు పాలు సేకరిస్తున్నారు. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, గతేడాది పాలసేకరణలో తలెత్తిన ఇబ్బందుల పరంపరలో చాలామంది పాడిరైతులు గేదెల్ని అమ్మేశారు. పెరిగిన ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా పాలకు మద్దతు ధర దక్కకపోవడంతో పాటు పాలసేకరణ హాలీడేలు ప్రకటించడంతో అనేక మంది రైతులు ఈ ఏడాది గేదెల పెంపకంపై నిరాసక్తత చూపారు. కాని ఈ ఏడాది ఊహించని విధంగా పాలకు డిమాండ్ ఏర్పడింది. కనీసం జిల్లా అవసరాలకు కూడా సరిపడా పాలు లభ్యం కాలేదు. ప్రైవేటు డెయిరీలు ఉత్పత్తిదారులకు మొండిచెయ్యి చూపించినా ఏజెంట్లకు మాత్రం భారీగా తాయిలాలు ఎరవేసి పాల సేకరణ పెద్దగా పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాని విజయ డెయిరీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో సేకరణ పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పాడి రైతులకిచ్చే పాల ధరను పెంచి తమ అవసరాలకు అనుగుణంగా పాల సేకరణ చేయాల్సిన విజయ డెయిరీ ప్రైవేటు డెయిరీలతో కుమ్మక్కై ఉత్పత్తిదారులకిచ్చే ధరను మాత్రం పెంచడం లేదు. ప్రైవేటు డెయిరీలు మాత్రం తమ మార్కెట్ దెబ్బతినకుండా కాపాడుకుంటుండగా, విజయ డెయిరీకి మాత్రం మార్కెట్లో ఇబ్బంది తప్పలేదు. విజయ డెయిరీకి చెందిన పాలసేకరణ ఏజెంట్లు, సహకార సంఘాల అధ్యక్షులు ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నా డెయిరీ పాలకవర్గం పట్టించుకున్న పరిస్థితులు కనిపించలేదు. రోజుకు రూ.4.50 లక్షలు కోల్పోతున్న రైతులు జిల్లాలోని విజయ డెయిరీ తీరు కారణంగా రైతులు రోజుకు సగటున రూ.4.50 లక్షలు నష్టపోతున్నారు. పొరుగున ఉన్న ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని విజయ డెయిరీ ఈ నెల 11వ తేదీ నుంచే పాడి రైతులకిచ్చే ధరను గణనీయంగా పెంచింది. లీటరు రూ.46 నుంచి ఒక్కసారిగా రూ.49కి పెంచింది. ఆ జిల్లాల్లో ప్రైవేటు డెయిరీలు కూడా ధరను పెంచాయి. జిల్లాలో మాత్రం ప్రస్తుతం లీటరు రూ.46 మాత్రమే చెల్లిస్తున్నారు. జిల్లాలో కూడా విజయ డెయిరీ పాల సేకరణ ధరను పెంచి ఉంచి ప్రైవేట్ డెయిరీలు కూడా పెంచేవి. తద్వారా రైతులకు లీటరుకు మూడు రూపాయల వంతున ప్రయోజనం దక్కేది. కొనుగోలుదారులకు పెరిగిన ధర జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు డెయిరీలన్నీ తాము అమ్మే పాల ధరను లీటరు రూ.2 పెంచాయి. విజయ డెయిరీ కూడా నేడో.. రేపే ధరను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో ప్రజలకు అమ్మే పాలపై ధరను పెంచిన డెయిరీలు మాత్రం ఉత్పత్తిదారులకు పెంచేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. పాలసేకరణ ధరను పెంచాలి ప్రస్తుతం కరువొచ్చింది. పశువులకు మేత, నీళ్లు దొరకడం కట్టంగా మారింది. దీనికి తోడు దాణా ధరలు కూడా బాగా పెరిగాయి. పాలకు మాత్రం ధర పెరగలేదు. గేదలు పోషించడం కష్టంగా మారింది. డెయిరీలో ధర పెంచకపోతే నష్టాలు తప్పవు. నాగిరెడ్డి, పాడి రైతు రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం ఇటీవలే రైతులకిచ్చే పాల ధరను రూ.2 పెంచాం. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో మళ్లీ ఇప్పుడే పెంచాలంటే ఇబ్బందిగా ఉంది. వీలైనంత వరకు రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు కృషి చేస్తున్నాం. పెరిగిన ఖర్చుల దృష్ట్యా ప్రజలకు తాము విక్రయించే పాలధరను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకమండలిలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తాం. కృష్ణమోహన్, జీఎం, విజయ డెయిరీ -
పాలూ ప్రియమే
కొడవలూరు, న్యూస్‌లైన్: ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు పాల ధర అదనపు భారమవుతోంది. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ప్రైవేటు డెయిరీలు ధరను పెంచేయగా ప్రభుత్వ రంగ సంస్థ విజయా డెయిరీ 17వ తేదీన అధికారికంగా ప్రకటించనుంది. మొత్తంగా అన్ని డెయిరీలు కలిపి 20వ తేదీ లోపు ధర పెంచాలని నిర్ణయించాయి. లీటర్‌కు రెండు రూపాయలు పెంచుతుండటంతో జిల్లా వాసులపై అదనంగా నెలకు రూ.42 లక్షల భారం పడనుంది. మధ్యతరగతి ప్రజలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. పాల ప్యాకెట్లను ఎక్కువగా మధ్య తరగతి వారే వినియోగిస్తున్నారని అంచనా. రోజుకు లీటరు పాలు వినియోగించే వారు ఇకపై నెలకు అదనంగా రూ.60 వెచ్చించాలి. కుంటి సాకులే పాల ధర పెంపునకు సేకరణ ధర, డీజిల్ ధరల పెరుగుదలను డెయిరీలు కారణం చూపుతున్నా అవి కుంటుసాకులేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొడ్ల డెయిరీ వారయితే ఈ కారణాలు చూపుతూ కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే రైతులకిచ్చే పాల ధర ఇటీవల కాలంలో పెంచిన దాఖలాలు లేవు. కొద్ది నెలల క్రితం మాత్రమే కాస్త పెంచారు. రైతుల వద్ద కొనే పాలలో పది శాతం వెన్న ఉంటే లీటరుకు రూ.46 చెల్లిస్తామని ప్రకటించారు. ధర నిర్ణయించే సమయంలో మాత్రం వెన్న శాతం ఆరు నుంచి ఏడు లోపే ఉన్నట్లు చూపి ధర తగ్గించేస్తున్నారు. సగటున ఒక్కో రైతుకు లీటర్‌కు రూ.34 మాత్రమే లభిస్తుంది. డీజల్ ధర పెరుగుదల నిజమే అయినప్పటికీ డెయిరీల వారు కేవలం పాల రవాణాకు మాత్రమే దానిని వినియోగిస్తారు. దీనినే ప్రధాన కారణంగా చూపి పాల ధరను ఒక్కసారిగా లీటరుకు రూ.రెండు పెంచడం దారుణమని వినియోగదారులు మండిపడుతున్నారు. -
మదర్‌డెయిరీ ఆదాయాన్ని రైతులకు పంచుతున్నాం
హయత్‌నగర్, న్యూస్‌లైన్: మదర్‌డెయిరీ ఆదాయంలో 80 శాతం నిధులను రైతుల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నామని, నష్టాల్లో ఉన్న డెయిరీని లాభాల బాటలోకి తీసుకొచ్చామని నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (నార్మాక్) చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం వనస్థలిపురంలోని స్వరుషి గార్డెన్స్‌లో జరిగిన సమాఖ్య 14వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రైవేటు డెయిరీల ప్రలోభాలకు లొంగకుండా సమాఖ్యలో చేరాలని అన్నారు. మార్కెటింగ్‌లో ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు ఎక్కువ కమీషన్లు ఇవ్వడంవల్ల పాల అమ్మకాలను తగిన స్థాయిలో పెంచలేకపోతున్నామని అన్నారు. అనేక ప్రైవేటు డెయిరీలు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడంవల్ల ప్రభుత్వం డెయిరీలకు సబ్సిడీ ఇవ్వలేకపోతుందని ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆల్డా చైర్మన్ బొందుగుల నర్సింహారెడ్డి మాట్లాడుతూ మదర్‌డెయిరీ పాల నాణ్యతలో శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అధికంగా ఆవుపాలు వస్తుండడంతో పాల నాణ్యత పడిపోతుందని అన్నారు. రైతులను అధికారులు చులకన భావంతో చూస్తున్నారని ఎన్నికల అధికారికి జవాబుదారీతనం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన డెరైక్టర్లు శ్రీనివాసరావు, భిక్షపతి, ప్రవీణ్‌కుమార్‌లను సన్మానించారు. అధికంగా పాలఉత్పత్తి సాధించిన రైతులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ సురేష్‌బాబు, అధికారులు యుగంధర్‌రెడ్డి, రమేష్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.