ప్రియా... నీ మీదే ఆశగా
పృథ్వీప్రసాద్, ముంతాజ్, దివ్యప్రతిభ ముఖ్య తారలుగా ప్రసాద్‌బాబు, మధుబాబు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రియా... నీ మీదే ఆశగా’. కిషన్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి జయంత్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్. విద్యాసాగర్‌రావు సీడీ ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. అతిథులుగా పాల్గొన్న వి. సముద్ర, ఘంటాడి కృష్ణ, ఆజాద్ తదితరులు పాటలు, సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.
దర్శకుడిగా ఇది తొలి చిత్రమని, పాటలు బాగా కుదిరాయని కిషన్‌రాజ్ తెలిపారు. పాటలన్నీ ఒకదానికి ఒకటి పోలిక లేకుండా ఉంటాయని జయంత్ చెప్పారు. ‘‘లవ్, యాక్షన్, కామెడీ సమాహారంతో రూపొందించిన చిత్రం ఇది. ఏడు పాటలూ బాగుంటాయి. గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’’ అని నిర్మాతలు చెప్పారు.