Priyam Garg
-
గార్గ్ తప్పిదం.. దిక్కుతోచని స్థితిలో వార్నర్ ఔట్!
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వైఫల్యం సక్సెస్‌గా కొనసాగుతోంది. అయితే కెప్టెన్ డేవిడ్ వార్నర్ సీజన్లో మెల్లిగా ఆడుతున్నాడన్న విమర్శలు ఉన్నా బ్యాటర్‌గా జట్టు తరపున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఎవరు ఆడకపోయినా తాను ఒంటరిపోరాటం చేశాడు. అయితే తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం వార్నర్‌ను దురదృష్టం వెంటాడింది. మరో ఓపెనర్ ప్రియమ్ గార్గ్ తప్పిదం వల్ల వార్నర్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. పైగా అది నోబాల్ కావడం విశేషం. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండో బంతిని ప్రియమ్ గార్గ్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే క్రీజులో ఉన్న గార్గ్ బయటకు రావడంతో వార్నర్ సింగిల్‌కు కాల్ ఇచ్చాడేమో అని పరిగెత్తుకొచ్చాడు. కానీ రషీద్ బంతి అందుకోవడం గార్గ్ వెనక్కి వెళ్లిపోయాడు. అప్పటికే వార్నర్ పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. వార్నర్ తిరిగి వచ్చేలోపే రషీద్ వేగంగా వచ్చి వికెట్లను గిరాటేశాడు. దీంతో వార్నర్ నిరాశగా పెవిలియ్ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పాంటింగ్, గంగూలీ లాంటి ఇద్దరు దిగ్గజ కెప్టెన్ల ఆధ్వర్యంలో ఈ సీజన్లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఘోరంగా విఫలమవుతుంది. అంచనాలు అందుకోలేక చతికిలపడుతున్న ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరిని పంపాలి.. బౌలింగ్ కూర్పుపై ఒక స్పష్టతకు రాలేకపోతుంది. అంతంత బ్యాటింగ్ మాత్రమే కలిగిన ఢిల్లీ అహ్మదాబాద్ పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమేంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. Delhi capitals is mentally not ready to play tonight game Mohammad Shami Bamboozled Dc top order#GTvsDC#IPL2023#IPL#DavidWarnerpic.twitter.com/5dwOjkvc5r — Aman Raina (@ImRaina45) May 2, 2023 చదవండి: బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌కు చుక్కలే! -
IPL 2022: ఈసారి ట్రోఫీ గెలుస్తాం: సన్‌రైజర్స్ యువ ఆటగాడు
IPL 2022: Sunrisers Hyderabad: ఐపీఎల్-2022 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే నటరాజన్, విష్ణు వినోద్, సౌరభ్ దూబే, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, ప్రియమ్ గార్గ్ తదితర ఆటగాళ్లు జట్టుతో చేరారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్తో అనుబంధం గురించి క్రికెటర్లు మాట్లాడిన వీడియోలను ట్విటర్లో షేర్ చేసింది ఫ్రాంఛైజీ. ఈ సందర్భంగా 21 ఏళ్ల ప్రియమ్ గార్గ్ మాట్లాడుతూ.. జట్టులోకి తిరిగిరావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘గతంలో రెండేళ్లపాటు ఈ జట్టులో ఉన్నాను. మళ్లీ ఇప్పుడు ఇలా! కొత్త సీజన్.. కొత్త ఆటగాళ్లంతా ఒక్కచోట చేరారు. ఈసారి మేము ట్రోఫీ గెలుస్తామనే భావిస్తున్నా’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ఇప్పటివరకు సన్‌రైజర్స్‌కు మద్దతుగా నిలిచిన అభిమానులు ఇక ముందు కూడా ఇలాగే సపోర్టు చేయాలని విజ్ఞప్తి చేశాడు. మీ అండ మాకెంతో ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్ ప్రియమ్ గార్గ్ సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా ఎస్ఆర్హెచ్ ప్రియమ్‌ను 20 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్లో భాగంగా మార్చి 29న రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో హైదరాబాద్ తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఇక గత సీజన్లో హైదరాబాద్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే: కేన్ విలియమ్సన్(14 కోట్లు- కెప్టెన్), అబ్దుల్ సమద్(4 కోట్లు) ,ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు), నికోలస్ పూరన్(10.75 కోట్లు), వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు), రొమారియో షెపర్డ్(7.7 కోట్లు), అభిషేక్ శర్మ(6.5 కోట్లు), భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు), మార్కో జన్సెన్(4.2 కోట్లు), టి నటరాజన్(4 కోట్లు), కార్తీక్ త్యాగి(4 కోట్లు), ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు), సీన్ అబాట్(2.4 కోట్లు), గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు), శ్రేయస్ గోపాల్(75 లక్షలు), విష్ణు వినోద్(50 లక్షలు), ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు), జె సుచిత్(20 లక్షలు), ప్రియమ్ గార్గ్(20 లక్షలు), ఆర్ సమర్థ్(20 లక్షలు), శశాంక్ సింగ్(20 లక్షలు), సౌరభ్ దూబే(20 లక్షలు). చదవండి: Kapil Dev: కొత్తతరం క్రికెటర్లలో అతడి ఆట అంటే నాకిష్టం.. ఎందుకంటే: కపిల్ దేవ్ Listen to our young colt @priyamg03149099 talk about what his third year with us means to him, and his expectations from this season. 🗣️🧡#TATAIPL #OrangeArmy #ReadyToRise pic.twitter.com/r4drmDxRQf — SunRisers Hyderabad (@SunRisers) March 13, 2022 Listen in to what @ABDULSAMAD___1 had to say on his arrival at the #Risers camp 🗣🧡#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/ShoX99B74P — SunRisers Hyderabad (@SunRisers) March 14, 2022 “It’s always been a privilege playing for #SRH” 🗣 And it’s a privilege to have you back with us, @IamAbhiSharma4 🧡#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/N4Om0BTeSJ — SunRisers Hyderabad (@SunRisers) March 14, 2022 -
లారా మెచ్చిన యంగ్ క్రికెటర్ అతనే!
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా ఇప్పుడు ఉన్న ఇండియన్ యంగ్ క్రికెటర్లలలో తనకు ఎవరు ఇష్టమో ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఐదుగురు యంగ్ క్రికెటర్ల పేర్లు ప్రస్తావిస్తూ వారంటే తనకు ఎందుకు అంత ఇష్టమో పేర్కొన్నారు. లారాకు ఇష్టమైన క్రికెటర్లలో సంజూ సామ్సన్ ముందు వరుసలో ఉన్నాడు. తనకు ఇష్టమైన ప్లేయర్ల గురించి అడగగా ఆయన మొదట సంజూ పేరునే ప్రస్తావించారు. ఐపీఎల్ 2020లో రాజస్తాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న సంజూ రెండు మ్యాచ్‌ల్లో 16 సిక్స్‌లు కొట్టి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే ఆ తరువాత మ్యాచ్‌ల్లో దానిని కొనసాగించలేకపోయాడు. లారా, సంజూ గురించి మాట్లాడుతూ, ‘నాకు సంజూ సామర్థ్యం అంటే చాలా ఇష్టం. అతనికి మంచి టైమింగ్, సామర్థ్యం ఉంది. అతను ఉన్నత స్థాయికి చేరుతాడు’ అని అన్నారు. ఇక లారాకు ఇష్టమైన మరో క్రికెటర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్. ఈయన ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడి 461 పరుగులు చేశాడు. సరాసరి 41.90 పరుగులు. ‘ఒక వేళ టీంలో బెస్ట్ ప్లేయర్లు ఓపెనర్లుగా లేనప్పుడు సూర్యకుమార్‌ను నెంబర్ 3గా దించాలి. ఓపెనర్లు ఆడటంలో విఫలమైన ఇతను నిలకడగా ఆడి టీంని గెలిపించే అవకాశాలు ఉన్నాయి’ అని లారా పేర్కొన్నారు. ఇక తనకిష్టమంటూ లారా చెప్పిన మరో పేరు దేవ్‌దత్ పడిక్కల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున ఆడుతున్న దేవ్‌దత్ ఈ సీజన్లో ఆర్సీబీ జట్టులో ఎక్కువ రన్స్ చేశాడు. ఇక ఇతని గురించి లారా మాట్లాడుతూ, ‘దేవ్‌దత్‌కు చాలా సామర్థ్యం ఉంది. అయితే అతను కొన్ని విషయాలను మార్చుకోవాలి. నేను అతను కేవలం టీ20, ఐపీఎల్లో మాత్రమే ఆడాలని కోరుకోవడం లేదు. అతను టెస్ట్‌లలో కూడా ఆడాలి. దానికి కొన్ని టెక్నిక్లను తెలుసుకోవాలి’ అని అన్నారు. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా తనకు ఇష్టమైన ఆటగాళ్లలో ఉన్నాడంటూ లారా చెప్పారు. ‘అతను కచ్ఛితంగా ఒక మంచి ఆటగాడు. అతని గురించి ఇంతకి మించి ఏం చెప్పగలను’ అని లారా పేర్కొన్నాడు. ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఆటగాడు, అండర్ -19 మాజీ కెప్టెన్ ప్రియమ్ గార్గ్ కూడా లారా దృష్టని ఆకర్షించాడు. ‘నాకు తెలిసి ప్రియమ్ గార్గ్‌కు చాలా సామర్థ్యం ఉంది’ అని అన్నారు. ఇక సన్‌రైజర్స్ జట్టులోని మరో ఆటగాడు, జమ్ము- కశ్మీర్ ఆల్ రౌండర్ అబ్దుల్ సమద్ కూడా బాగా ఆడుతున్నాడు అంటూ లారా కితాబిచ్చాడు. చదవండి: ధోనీలా ఆడడం లేదు: బ్రియన్ లారా -
గార్గ్ ‘మాయ’లో గిల్, రాణా
అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 163 పరుగుల స్కోరు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఇంకా ఎక్కువ స్కోరు చేస్తుందనే అనుకున్నాం. ఆ జట్టుకు దొరికిన ఆరంభం బాగుండటంతో కేకేఆర్ 180 పరుగులు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ కేకేఆర్ భారీ చేయకుండా అడ్డుకట్ట వేయడంలో ఆరెంజ్ ఆర్మీ ఫీల్డింగ్ సక్సెస్ అయ్యింది.. ప్రధానంగా యువ క్రికెటర్ ప్రియాం గార్గ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టి సన్‌రైజర్స్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ బౌలింగ్ ప్రతిభ కంటే ప్రియాం గార్గ్ ఫీల్డింగే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రషీద్ ఖాన్ వేసిన 12 ఓవర్ నాల్గో బంతిని లాంగాఫ్ మీదుగా షాట్ ఆడాడు గిల్. అది గిల్‌తో పాటు అంతా ఫోర్ అనుకున్నారు. ఎలా వచ్చాడో కానీ చివరి నిమిషంలో దాన్ని క్యాచ్ అందుకుని భళా అనిపించాడు గార్గ్. (నరైన్‌కు గ్రీన్‌సిగ్నల్.. కానీ) డీప్‌లో ఉన్న గార్గ్ ఆ బంతి వస్తున్న గమనాన్ని నిశితంగా పరిశిలిస్తూ పరుగెత్తూకుంటూ వచ్చాడు. ఆ బంతి ఇక ల్యాండ్ కావడమే తరువాయి అనుకునే సమయంలో డైవ్ కొట్టి క్యాచ్ తీసుకున్నాడు. ఫుల్ స్వింగ్‌లో ఎడమవైపుకు డైవ్ కొట్టి అందర్నీ మరిపించేశాడు. అది మ్యాచ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ కాగా, ఆపై వెంటనే గార్గ్ మళ్లీ ‘మాయ’ చేశాడు. విజయ్ శంకర్వేసిన 12 ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ షాట్ ఆడాడు నితీష్ రాణా. ఆ బంతి రాణా ఊహించిన పేస్ రాలేదు. దాంతో టైమింగ్ మిస్సయ్యింది. ఇంకేముంది బంతి మిడ్ వికెట్లో పైకి లేచింది. ఆ సమయంలో మిడ్ వికెట్లో ఎవరూ లేరు. డీప్‌లో ఉన్న గార్గ్ పరుగు పరుగున వచ్చి దాన్ని క్యాచ్‌గా ఒడిసి పట్టుకున్నాడు. ప్రియాంగార్గ్ పట్టిన రెండు క్యాచ్‌ల్లో ఒకటి అసాధారణమైన డైవ్ అయితే, రెండోది బంతిపైకి దూసుకొచ్చి క్యాచ్ అందుకోవడం. ఆ రెండింటిని గార్గ్ క్యాచ్‌లుగా అందుకుంటాడని చివరివరకూ ఎవరికీ అంచనాలు లేకపోయినా తాను చురకైన ఫీల్డర్ననే విషయం మరోసారి నిరూపించుకున్నాడు.