గిల్ క్యాచ్ అందుకుంటున్న గార్గ్(ఫోటో సోర్స్; ట్విట్టర్)
అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 163 పరుగుల స్కోరు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఇంకా ఎక్కువ స్కోరు చేస్తుందనే అనుకున్నాం. ఆ జట్టుకు దొరికిన ఆరంభం బాగుండటంతో కేకేఆర్ 180 పరుగులు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ కేకేఆర్ భారీ చేయకుండా అడ్డుకట్ట వేయడంలో ఆరెంజ్ ఆర్మీ ఫీల్డింగ్ సక్సెస్ అయ్యింది.. ప్రధానంగా యువ క్రికెటర్ ప్రియాం గార్గ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టి సన్‌రైజర్స్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ బౌలింగ్ ప్రతిభ కంటే ప్రియాం గార్గ్ ఫీల్డింగే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రషీద్ ఖాన్ వేసిన 12 ఓవర్ నాల్గో బంతిని లాంగాఫ్ మీదుగా షాట్ ఆడాడు గిల్. అది గిల్‌తో పాటు అంతా ఫోర్ అనుకున్నారు. ఎలా వచ్చాడో కానీ చివరి నిమిషంలో దాన్ని క్యాచ్ అందుకుని భళా అనిపించాడు గార్గ్. (నరైన్‌కు గ్రీన్‌సిగ్నల్.. కానీ)
డీప్‌లో ఉన్న గార్గ్ ఆ బంతి వస్తున్న గమనాన్ని నిశితంగా పరిశిలిస్తూ పరుగెత్తూకుంటూ వచ్చాడు. ఆ బంతి ఇక ల్యాండ్ కావడమే తరువాయి అనుకునే సమయంలో డైవ్ కొట్టి క్యాచ్ తీసుకున్నాడు. ఫుల్ స్వింగ్‌లో ఎడమవైపుకు డైవ్ కొట్టి అందర్నీ మరిపించేశాడు. అది మ్యాచ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ కాగా, ఆపై వెంటనే గార్గ్ మళ్లీ ‘మాయ’ చేశాడు. విజయ్ శంకర్‌వేసిన 12 ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ షాట్ ఆడాడు నితీష్ రాణా. ఆ బంతి రాణా ఊహించిన పేస్ రాలేదు. దాంతో టైమింగ్ మిస్సయ్యింది. ఇంకేముంది బంతి మిడ్ వికెట్‌లో పైకి లేచింది. ఆ సమయంలో మిడ్ వికెట్‌లో ఎవరూ లేరు. డీప్‌లో ఉన్న గార్గ్ పరుగు పరుగున వచ్చి దాన్ని క్యాచ్‌గా ఒడిసి పట్టుకున్నాడు. ప్రియాంగార్గ్ పట్టిన రెండు క్యాచ్‌ల్లో ఒకటి అసాధారణమైన డైవ్ అయితే, రెండోది బంతిపైకి దూసుకొచ్చి క్యాచ్ అందుకోవడం. ఆ రెండింటిని గార్గ్ క్యాచ్‌లుగా అందుకుంటాడని చివరివరకూ ఎవరికీ అంచనాలు లేకపోయినా తాను చురకైన ఫీల్డర్‌ననే విషయం మరోసారి నిరూపించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment