breaking news
Pro Kabaddi 2025
-
పీకేఎల్-2025 విజేతగా దబంగ్ ఢిల్లీ
ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఛాంపియన్‌గా దబంగ్ ఢిల్లీ నిలిచింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో పుణేరి పల్టన్‌ను 30-28 తేడాతో విజయం సాధించిన దబంగ్ ఢిల్లీ.. రెండో సారి పీకేఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ కంటే దబంగ్ 2 పాయింట్లు అధికంగా సాధించింది.सुपर SE BHI ऊपर TACKLE! ⭐👏🏻#PKL12 Final 👉 Dabang Delhi K.C. 🆚 Puneri Paltan | LIVE NOW ➡ https://t.co/GqoflbVhyp pic.twitter.com/mA2twB1vDV— Star Sports (@StarSportsIndia) October 31, 2025నీరజ్ నర్వాల్ తొమ్మిది రైడ్ పాయింట్లతో దబంగ్ ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు అజింక్య పవార్ కూడా 6 పాయింట్లు సాధించాడు. ఇక సీనియర్ డిఫెండర్ ఫజెల్ అట్రాచలి ఆఖరిలో అద్బుతమైన టాకిల్‌తో తన జట్టును విజేతగా నిలిపాడు.మరోవైపు పుణేరి రైడర్ ఆదిత్య షిండే పోరాటం వృథా అయిపోయింది. ఆఖరిలో ఆదిత్య సూపర్ రైడ్‌తో పుణేరి విజయంపై ఆశలు రెకెత్తించాడు. కానీ తర్వాత రైడ్‌లో ఆదిత్య షిండే టాకిల్ కావడంతో పుణేరి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: భారత హాకీ దిగ్గజం కన్నుమూత -
డూ ఆర్ డై రైడ్.. కట్ చేస్తే! తెలుగు టైటాన్స్ రైడర్ సంచలనం
ప్రో కబడ్డీ లీగ్-2025లో తెలుగు టైటాన్స్ స్టార్ ఆల్‌రౌండర్ భరత్ హుడా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఢిల్లీ వేదికగా పుణేరి పల్టన్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో కూడా తన రైడింగ్ స్కిల్‌తో అదరగొట్టాడు. ఓ డూ ఆర్ డై రైడ్‌లో హుడా అద్భుతం చేశాడు.ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్‌లో వరుసగా రెండు రైడ్స్‌లో పాయింట్లు రాకపోవడంతో టైటాన్స్ డూ ఆర్ డై రైడ్‌ను ఎదుర్కొవాల్సి వచ్చింది. అవతలి ఎండ్‌లో ముగ్గురు పుణేరి ప్లేయర్లు ఉన్నారు. ఈ సమయంలో డూర్ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన భరత్ హుడా.. ముగ్గురిని కూడా టచ్ చేసి తన ఎండ్‌కు వచ్చేశాడు. దీంతో పుణేరి పల్టన్ ఆలౌటైంది. ఒకే దెబ్బకు టైటాన్స్‌కు ఐదు పాయింట్లు వచ్చాయి. సూపర్ టాకిల్ అవకాశమున్నప్పటికి చాకచాక్యంగా భరత్ డిఫెండర్ల నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో భరత్ 23 రైడ్ పాయింట్లు సాధించాడు.టైటాన్స్ ఓటమి..కాగా క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-2లో 50-45 తేడాతో టైటాన్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి టైటాన్స్ ఇంటిముఖం పట్టింది. భరత్ హుడా అద్భుత పోరాటం వృథాగా మిగిలిపోయింది. ఇక శుక్రవారం జరగనున్న ఫైనల్ పోరులో దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ తలపడనున్నాయి. View this post on Instagram A post shared by Star Sports Telugu (@starsportstelugu) -
అతడొక అద్భుతం.. తెలుగు టైటాన్స్‌కు దొరికిన ఆణిముత్యం
ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. తొలి పీకేఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు టైటాన్స్ అత్యంత చేరువలో ఉంది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్-3లో మూడుసార్లు ఛాంపియన్ అయిన పట్నా పైరేట్స్‌పై 46-39 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఘన విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్-2కు తెలుగు టైటాన్స్ అర్హత సాధించింది. బుధవారం జరగనున్న క్వాలిఫయర్-2లో పుణేరి పల్టన్‌ను ఓడించి తుది పోరుకు క్వాలిఫై అవ్వాలన్న పట్టుదలతో టైటాన్స్ ఉంది.దుమ్ములేపుతున్న భరత్కాగా తెలుగు టైటాన్స్ తమ తొలి టైటిల్‌కు చేరువ కావడంలో ఆల్‌రౌండర్ భరత్ హుడాది కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్లో భరత్ తన అద్బుతమైన ప్రదర్శనలతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. గతంలో యూపీ యోధాకు ప్రాతినిథ్యం వహించిన భరత్ హుడాను.. ఈ ఏడాది వేలంలో రూ. 81 లక్షలకు టైటాన్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో అతడు మూడవ అత్యంత ఖరీదైన ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. అయితే టైటాన్స్ మెనెజ్‌మెంట్ తన పెట్టుకున్న నమ్మకాన్ని భరత్ వమ్ము చేయలేదు. భరత్ హూడా.. కెప్టెన్ విజయ్ మాలిక్‌తో కలిసి జట్టు రైడింగ్ విభాగాన్ని నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. ఎలిమినేటర్-3 మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌పై కూడా భరత్ సత్తాచాటాడు. 23 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు బెంగళూరు బుల్స్‌పై గెలుపొందిన మినీ క్వాలిఫయర్ మ్యాచ్‌లో అతడు 12 పాయింట్లతో రాణించాడు. మొత్తంగా అత్యధిక రైడ్ పాయింట్ల సాధించిన జాబితాలో భరత్ హుడా(207) నాలుగో స్ధానంలో కొనసాగుతున్నాడు. దీంతో అతడిపై టైటాన్స్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడు టైటాన్స్‌కు దొరికిన అణిముత్యమని కొనియాడుతున్నారు. మరోవైపు కెప్టెన్ విజయ్ మాలిక్(156) కూడా సత్తాచాటుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ -
పాట్నాను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్..
ప్రో కబడ్డీ లీగ్-2025లో తెలుగు టైటాన్స్ తమ జోరును కొనసాగిస్తోంది. మంగళవారం ఢిల్లీ వేదికగా పాట్నా పైరేట్స్‌తో జరిగిన ఎలిమినేటర్-3 మ్యాచ్‌లో 46-39 తేడాతో టైటాన్స్ విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్-2కు తెలుగు టైటాన్స్ అర్హత సాధించింది.టైటాన్స్ ఆల్‌రౌండర్ భరత్ హుడా మరోసారి తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ కీలక మ్యాచ్‌లో భరత్ ఏకంగా 23 పాయింట్లు సాధించాడు. అందులో 17 టచ్ పాయింట్లు, 6 బోనస్ పాయింట్లు ఉన్నాయి. కెప్టెన్ విజయ్ మాలిక్ మాత్రం కేవలం 5 పాయింట్లు తీసుకొచ్చాడు. పాట్నా రైడర్స్‌లో అయాన్ మినహా మిగితా అందవరూ విఫలమయ్యారు. బుధవారం జరగనున్న క్వాలిఫయర్-2లో పుణేరి పల్టన్‌తో టైటాన్స్ తలపడనుంది.చదవండి: PKL 2025: పాట్నాను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్.. క్వాలిఫయర్-2కు అర్హత -
ప్రో కబడ్డీలో సంచలనం.. ఒకే రైడ్‌లో 7 పాయింట్లు! వీడియో వైరల్
ప్రోకబడ్డీ లీగ్-2025లో సంచలనం నమోదైంది. సోమవారం రాత్రి ఢిల్లీ వేదికగా పట్నా పైరేట్స్‌తో జరిగిన ఎలిమినేటర్2లో బెంగళూరు బుల్స్ స్టార్ రైడర్ శుభం బిటాకే అద్బుతం చేశాడు. ఒకే రైడ్‌లో ఏడు పాయింట్లు సాధించి అందరిని షాక్‌కు గురిచేశాడు.ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి పాట్నా పైరేట్స్ బెంగళూరు బుల్స్ పై 27-13 ఆధిక్యంలో నిలిచింది. దీంతో బెంగళూరుకు ఘోర ఓటమి తప్పదని అంతా భావించారు. కానీ శుభమ్ ఒక్క సంచలన రైడ్‌తో బెంగళూరును తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చాడు.పాట్నా డిఫెండర్లను చాకచాక్యంగా బురిడీ కొట్టించిన శుభమ్.. ఆరు టచ్ పాయింట్లు, ఒక్క బొనస్ పాయింట్ సాధించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కానీ ఆఖరిలో రైడర్లు, డిఫెండర్లు చిన్న చిన్న తప్పిదాలు చేయడంతో బెంగళూరు 46-37 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చరిత్ర సృష్టించిన శుభమ్..అయితే ఈ మ్యాచ్‌లో సూపర్ రైడ్‌తో మెరిసిన శుభమ్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రోకబడ్డీ లీగ్ చరిత్రలో ఒకే రైడ్‌లో అత్యధిక వ్యక్తిగత పాయింట్లు సాధించిన ఆటగాడిగా బిటాకే నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు పర్దీప్ నర్వాల్ పేరిట ఉండేది. పీకేఎల్-2017లో పర్దీప్ ఒకే రైడ్‌లో 6 వ్యక్తిగత పాయింట్లు తీసుకొచ్చాడు. వాస్తవానికి ఆ రైడ్‌లో పర్దీప్.. 8 పాయింట్లు సాధించాడు. కానీ అందులో 6 వ్యక్తిగత పాయింట్లు కాగా.. మరో రెండు ఆలౌట్ పాయింట్లు ఉన్నాయి. చదవండి: PKL 2025: తెలుగు టైటాన్స్‌కు చావో రేవో మ్యాచ్.. ఓడితే పరిస్థితి ఏంటి? View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
తెలుగు టైటాన్స్‌కు చావో రేవో మ్యాచ్.. ఓడితే పరిస్థితి ఏంటి?
ప్రోకబడ్డీ లీగ్-2025లో వరుస విజయాలతో దూసుకు పోతున్న తెలుగు టైటాన్స్ కీలక పోరుకు సిద్దమైంది. మంగళవారం(అక్టోబర్ 28) ఢిల్లీ వేదికగా ఎలిమినేటర్-3లో పాట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ విజయం సాధిస్తే బుధవారం జరిగే క్వాలిఫయర్-2లో పుణేరి పల్టాన్‌ను ఢీకొట్టనుంది.ఒకవేళ ఈ చావో రేవో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి పాలైతే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. కావరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్‌కు పాట్నాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పైరేట్స్ జట్టులో అయాన్ లోచాబ్, మణీందర్ సింగ్ వంటి అద్బుతమైన రైడర్లు ఉన్నారు. వీరిద్దరూ చెలరేగితే టైటాన్స్‌కు కష్టాలు తప్పవు. ప్రస్తుత సీజన్లో అత్యధిక రైడ్ పాయింట్ల సాధించిన జాబితాలో అయాన్ (294) అగ్రస్దానంలో ఉన్నాడు. అదేవిధంగా పాట్నా డిఫెండర్ నవదీప్ నుంచి కూడా టైటాన్స్ రైడర్స్‌కు కష్టాలు ఎదురుకానున్నాయి. నవదీప్ 68 టాకిల్ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నారు. వీరిముగ్గురి జోరుకు కళ్లెం వేస్తే తెలుగు టైటాన్స్ విజయం నల్లేరు మీద నడక కానుంది. అయితే పీకేఎల్-12 వ సీజన్లో పాట్నా కంటే టైటాన్స్‌కే మెరుగైన రికార్డు ఉంది. తెలుగు టైటాన్స్ ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడి పదింట విజయం సాధించగా.. పాట్నా 18 మ్యాచ్‌లు ఆడి కేవలం ఎనిమిదింట మాత్రమే విజయం సాధించింది. కానీ ఆరంభంలో తడబడిన పాట్నా.. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లే ఇన్స్‌కు ఆర్హత సాధించడం గమనార్హం.కాగా తెలుగు టైటాన్స్‌కు కెప్టెన్ విజయ్ మాలిక్, భరత్ హుడా అద్బుతమైన ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. సోమవారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మినీ క్వాలిఫయర్‌లో కూడా వీరిద్దరూ సత్తాచాటారు. తెలుగు టైటాన్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ స్టార్టింగ్ 7తెలుగు టైటాన్స్: చేతన్ సాహు, సాగర్, అజిత్ పవార్, విజయ్ మాలిక్ (కెప్టెన్), భరత్ హుడా, శుభమ్ షిండే, అంకిత్.పాట్నా పైరేట్స్: అంకిత్ కుమార్, దీపక్, బాలాజీ డి, అయాన్ లోహ్చాబ్, మిలన్ దహియా, నవదీప్ అంకిత్ జగ్లాన్ (కెప్టెన్).చదవండి: దబంగ్ ఢిల్లీ ఫైనల్‌కు -
భరత్ ఒంటరి పోరాటం.. హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు
ప్రోకబడ్డీ లీగ్-2025 సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు టైటాన్స్‌కు హరియాణా స్టీలర్స్ ఊహించని షాకిచ్చింది. బుధవారం రాత్రి ఢిల్లీ వేదికగా హరియాణా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34–45తో తెలుగు టైటాన్స్ పరాజయం పాలైంది.టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్ భరత్ (16) ఒక్కడే పోరాడాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 15 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను టాకిల్ చేసి మరో పాయింట్ అందించాడు. సహచరుల్లో డిఫెండర్ అంకిత్ (5) మెరుగ్గా ఆడారు. వీరిద్దరూ మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.స్టీలర్స్ విజయంలో రెయిడర్లు వినయ్ (11), శివమ్ పతారే (8) కీలకపాత్ర పోషించారు. రెయిడింగ్‌లో చురుగ్గా వ్యవహరించిన ఇద్దరు అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టారు. డిఫెండర్లలో రాహుల్ 4, నీరజ్, హర్దీప్, కెప్టెన్ జైదీప్ తలా 3 పాయింట్లు సాధించారు.కాగా తెలుగు టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇక గురువారం జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్ జెయింట్స్; యూపీ యోధాస్‌తో యు ముంబా; పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్ తలపడతాయి.చదవండి: సెమీఫైనల్లో స్థానం కోసం... -
తెలుగు టైటాన్స్ గెలుపు జోరు..
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 40–35 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది. ఈ సీజన్లో టైటాన్స్ జట్టుకిది ఓవరాల్‌గా ఏడో విజయం కాగా... వరుసగా నాలుగో గెలుపు.టైటాన్స్ తరఫున భరత్ హుడా 14 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెపె్టన్ విజయ్ మలిక్ తొమ్మిది పాయింట్లతో మెరిశాడు. డిఫెండర్ శుబ్‌మన్ షిండే ఐదు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్‌పుత్ 16 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఏడింటిలో గెలిచి, ఐదింటిలో ఓడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33–29తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ; యూపీ యోధాస్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.చదవండి: ICC Womens World Cup 2025: పాక్‌పై భారత్ గెలుపు.. మహిళలూ మురిపించారు -
జైపూర్ పింక్ పాంథర్స్ 'సిక్సర్'
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ ఆరో విజయం నమోదు చేసుకుంది. హరియాణా స్టీలర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 37–36 పాయింట్ల తేడాతో గెలిచింది. జైపూర్ తరఫున సాహిల్ 7, అలీ 6 పాయింట్లు సాధించారు.స్టీలర్స్ తరఫున వినయ్ 11 పాయింట్లతో పోరాడినా సరిపోలేదు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో స్టీలర్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ 16 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. అయితే ఆలౌట్ పాయింట్లు, ఎక్స్ట్రా పాయింట్లలో ముందంజ వేసిన పింక్ పాంథర్స్ విజయం సాధించింది. తాజా సీజన్లో 10 మ్యాచ్‌లాడిన జైపూర్ పింక్ పాంథర్స్ 6 విజయాలు, 4 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. హర్యానా స్టీలర్స్ 10 మ్యాచ్‌లో 6 గెలిచి నాలుగింట ఓడి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 42–24 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. యు ముంబా తరఫున సందీప్ కుమార్ 12 పాయింట్లతో విజృంభించగా... తలైవాస్ తరఫున అత్యధికంగా రోహిత్ గోపాల్ 7 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్... గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా తలపడతాయి.చదవండి: AB de Villiers: ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు -
ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి..
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో తెలుగు టైటాన్స్‌కు బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో బెంగళూరు 34–32 పాయింట్ల తేడాతో టైటాన్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ముగిసే దశలో అనూహ్యంగా ఆధిక్యాన్ని కోల్పోయిన తెలుగు టైటాన్స్ చివరకు 2 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్లు భరత్, కెపె్టన్ విజయ్ మలిక్ అదరగొట్టారు. 19 సార్లు కూతకెళ్లిన భరత్ 13 పాయింట్లు తెచ్చిపెట్టాడు. 18 సార్లు రెయిడింగ్ చేసిన విజయ్ 9 పాయింట్లు సాధించాడు. బెంగళూరు తరఫున అలీరెజా మిర్జాయిన్ (11) రాణించాడు. కీలక తరుణంలో పాయింట్లు చేసి జట్టును గెలిపించాడు. మిగతా వారిలో డిఫెండర్లు యోగేశ్ 3, దీపక్ శంకర్ 2, రెయిడర్ ఆకాశ్ షిండే 2 పాయింట్లు సాధించారు. ఈ సీజన్లో 6 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టుకిది మూడో పరాజయం.అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 40–37తో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ తరఫున రెయిడర్లు శివమ్ పతారే (12), వినయ్ (8), డిఫెండర్లు జైదీప్ (6), సాహిల్ నర్వాల్ (4), రాహుల్ (3) రాణించారు.గుజరాత్ జట్టులో రెయిడర్ రాకేశ్ (14) చక్కని పోరాటం చేశాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 14 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. మిగతావారిలో నితిన్ పన్వార్ 3, లక్కీ శర్మ, శుభమ్ కుమార్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి.చదవండి: Asia Cup 2025: శ్రమించి గెలిచిన శ్రీలంక -
తెలుగు టైటాన్స్‌కు రెండో విజయం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ లో తెలుగు టైటాన్స్ రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ 44–34 తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. టైటాన్స్ జట్టులో భరత్ 12, విజయ్ 11 పాయింట్లు సాధించారు. రెయిడర్ చేతన్ సాహు, డిఫెండర్ అంకిత్ చెరో 5 పాయింట్లు చేశారు. బెంగాల్ తరఫున కెప్టెన్ దేవాంక్ ఒంటరి పోరాటం చేసి 13 పాయింట్లు సాధించాడు. డిఫెండర్లలో నితీశ్ (6), ఆశిష్ (5) మెరుగ్గా ఆడారు. అనంతరం పోటాపోటీగా జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన జైపూర్ పింక్ పాంథర్స్ 35–36తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. దబంగ్ కెప్టెన్ అశు మలిక్ 21 పాయింట్లు సాధించాడు. జైపూర్ తరఫున రెయిడర్లు నితిన్ (14), సాహిత్ (10) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణాతో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
పైరేట్స్‌కు యోధాస్ షాక్
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో యూపీ యోధాస్ జోరు పెంచుతోంది. ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 34–31తో మూడుసార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్‌ను కంగుతినిపించింది. ఆట ఆరంభంలో పైరేట్స్ పైచేయి కనబరిచింది. మొదటి పది నిమిషాలైతే చకచకా పాయింట్లు రాబట్టిన పట్నా 7–6తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత యూపీ యోధాస్ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో పట్నా వెనుకబడింది. రెయిడర్లలో గగన్ గౌడ 7 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో భవాని రాజ్‌పుత్, శివమ్ చెరో 5 పాయింట్లు చేశారు. డిఫెండర్లలో కెప్టెన్ సుమిత్, అశు సింగ్ తలా 5 పాయింట్లు సాధించారు. పట్నా పైరేట్స్ జట్టులో రెయిడర్లు అయాన్ (9) మణిందర్ సింగ్ (7) రాణించారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పుణేరి పల్టన్ 41–19తో గుజరాత్ జెయంట్స్‌పై అలవోక విజయం సాధించింది. రెయిడింగ్ లో ఆదిత్య షిండే (6), పంకజ్ (5), డిఫెండర్లలో అభినేశ్ (6), గౌరవ్ ఖత్రి (4) అద్భుతంగా ఆడారు. ఆల్‌రౌండర్లు అస్లామ్ (5), గుర్దీప్ (4)లు కూడా మెరుగ్గా రాణించడంతో పుణేరి జట్టు క్రమం తప్పకుండా పాయింట్లు సాధించింది. గుజరాత్ తరఫున రెయిడర్ రాకేశ్ (6) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
తమిళ్ తలైవాస్‌కు షాక్
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా ఆఖర్లో పుంజుకొని తమిళ్ తలైవాస్‌కు షాక్ ఇచ్చింది. మాజీ చాంపియన్ యు ముంబా 36–33 పాయింట్ల తేడాతో తలైవాస్‌ను ఓడించి ఈ లీగ్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యు ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ 9, ఆల్‌రౌండర్ అనిల్ 8 పాయింట్లు సాధించారు. డిఫెండర్లలో లోకేశ్, రింకూ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. తమిళ్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 18 సార్లు కూతకెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో కెపె్టన్ పవన్ సెహ్రావత్ 7, డిఫెండర్లు నితీశ్ కుమార్, హిమాన్షు చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్‌కు బెంగాల్ వారియర్స్ చేతిలో చుక్కెదురైంది. కెపె్టన్ దేవాంక్ (21) రెయిడింగ్‌లో చెలరేగడంతో 2019 చాంపియన్ బెంగాల్ 54–44తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. వారియర్స్ జట్టులో దేవాంక్తో పాటు మరో రెయిడర్ మన్‌ప్రీత్ (13) అదరగొట్టాడు. స్టీలర్స్ జట్టులో రెయిడర్లు శివమ్ పటారే (17), వినయ్ (13) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధాస్, పుణేరి పల్టన్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. -
తీరు మారని తెలుగు టైటాన్స్.. వరుసగా రెండో ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ పోరులో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిన టైటాన్స్... తాజాగా యూపీ యోధాస్ చేతిలో కూడా పరాజయం పాలైంది. శనివారం తెలుగు టైటాన్స్ 35–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పట్టికలో ఏడోస్థానానికి పరిమితమైన టైటాన్స్... ఈ సీజన్ ఆరంభంలో విశాఖ తీరంలో జరుగుతున్న మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం అందలేదు. చేతన్ సాహు 4, భరత్ 3 పాయింట్లు సాధించారు. విజయ్ ఈ సీజన్లో తొలి సూపర్–10 ఖాతాలో వేసుకున్నాడు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 14 పాయింట్లతో విజృంభించగా... కెప్టెన్ సుమిత్ సాంగ్వాన్ (8 పాయింట్లు), గుమాన్ సింగ్ (7 పాయింట్లు) అతడికి అండగా నిలిచారు. యూ ముంబా, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ నిరీ్ణత సమయంలో 29–29 పాయింట్లతో ‘టై’కాగా... ఆ తర్వాత నిర్వహించిన సూపర్ రెయిడ్స్‌లో యూ ముంబా 6–5 పాయింట్ల తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంలో యూ ముంబా జట్టు తరఫున రోహిత్ రాఘవ్ 7, అజిత్ చౌహాన్ 6 పాయింట్లు సాధించారు. గుజరాత్ టైటాన్స్ తరఫున హిమాన్షు సింగ్ 7 పాయింట్లు, రాకేశ్ 5 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యూ ముంబా (రాత్రి 8 గంటలకు), బెంగాల్ వారియర్స్‌తో హర్యానా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.చదవండి: KCL 2025: టీ20ల్లో ప్రపంచ రికార్డు.. రెండు ఓవర్లలో 71 పరుగులు! వీడియో -
ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌ను ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ (ఫొటోలు )
-
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఐపీఎల్ తర్వాత ప్రేక్షకాదరణలో రెండో స్థానంలో నిలిచిన ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దబంగ్ ఢిల్లీ స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ (Naveen Kumar) తొలిసారి పీకేఎల్ వేలానికి వచ్చాడు. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలుకాగా దబంగ్ ఢిల్లీ (Dabang Delhi) 8వ సీజన్లో విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ తరఫున ఆరు సీజన్లు ఆడిన నవీన్ 1102 రెయిడింగ్ పాయింట్లు సాధించాడు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వదిలేసుకోవడంతో మిగతా ఫ్రాంచైజీలు అతనిపై కన్నేశాయి.ఇలా విడుదల, అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను 12 ఫ్రాంచైజీలు ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 83 మందిని రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకున్నాయి. నాలుగు కేటగిరీలుమొత్తం నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలుంది. ఎ, బి, సి, డిగా విభజించిన రిటెయినర్లలో ఎ ఆటగాడికి రూ. 30 లక్షలు, బి ప్లేయర్‌కు రూ. 20 లక్షలు, సి, డి ఆటగాళ్లకు వరుసగా రూ. 13 లక్షలు, రూ. 9 లక్షలు చెల్లించాల్సివుంటుంది.ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ట పరిమితి రూ. 5 కోట్లకు లోబడే రిటెయిన్ మొత్తాన్ని తీసివేయగా మిగిలిన మొత్తంతో ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముంబైలో ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు కబడ్డీ ఆటగాళ్ల వేలం పాట జరుగనుంది.ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ప్లేయర్లుబెంగాల్ వారియర్స్: విశ్వాస్, యశ్ మలిక్, మన్జీత్, దీప్ కుమార్, సుశీల్ కాంబ్రేకర్. బెంగళూరు బుల్స్: చంద్ర నాయక్, లక్కీ కుమార్, మన్జీత్, పంకజ్. దబంగ్ ఢిల్లీ: సందీప్, మోహిత్. గుజరాత్ జెయింట్స్: హిమాన్షు సింగ్, హిమాన్షు, ప్రతీక్ దహియా, రాకేశ్. హరియాణా స్టీలర్స్: రాహుల్ సెప్తాల్, వినయ్, శివమ్ అనీల్, జైదీప్, జయసూర్య, విశాల్ తటే, సాహిల్ మనికందన్, వికాస్ రామదాస్ జాదవ్. జైపూర్ పింక్‌పాంథర్స్: రెజా మిర్బాఘెరి, అభిషేక్, రోనక్ సింగ్, నితిన్ కుమార్, సోంబిర్, రితిక్ శర్మ. పట్నా పైరేట్స్: హమిద్ మిర్జాయి నదిర్, త్యాగరాజన్ యువరాజ్, సుధాకర్, అయాన్, నవ్‌దీప్, దీపక్, సాహిల్ పాటిల్. పుణేరి పల్టన్: అభినేశ్, గౌరవ్ ఖత్రి, పంకజ్ మోహితే, అస్లామ్ ముస్తఫా, మోహిత్ గోయత్, దాదాసొ శివాజీ పూజారి, ఆదిత్య తుషార్ షిండే. తమిళ్ తలైవాస్: మొయిన్ షఫాగి, హిమాన్షు, సాగర్, నితేశ్ కుమార్, నరేందర్, రోనక్, విశాల్ చహల్, ఆశిష్, అనూజ్ గవాడే, ధీరజ్ రవీంద్ర బైల్మరే. తెలుగు టైటాన్స్: శంకర్ భీమ్రాజ్, అజిత్ పాండురంగ పవార్, అంకిత్, ప్రఫుల్ జవారే, సాగర్ చేతన్ సాహు, నితిన్, రోహిత్. యు ముంబా: సునీల్ కుమార్, రోహిత్, అమిర్ మొహమ్మద్, సతీశ్ కన్నన్, ముకిలన్ షణ్ముగమ్, అజిత్ చౌహాన్, దీపక్ కుండు, లోకేశ్ గోస్లియా, సన్నీ.యూపీ యోధాస్: సుమిత్, భవానీ రాజ్‌పుత్, సాహుల్ కుమార్, సురేందర్ గిల్, అషు సింగ్, హితేశ్ గగన గౌడ, శివమ్ చౌదరి, జయేశ్ వికాస్ మహాజన్, గంగారామ్, సచిన్, కేశవ్ కుమార్.చదవండి: Football Tournament: ఉత్కంఠ పోరులో భారత్ విజయం..


