promotion DSP
-
ఎవరీ భరత్?: ఏడాదిగా విధులకు డుమ్మా.. అయినా డీఎస్పీగా ప్రమోషన్
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ పోలీసుశాఖలో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఓ పోలీసు అధికారి ఏడాదికి పైగా కనిపించడం లేదు. వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించి చివరికి వరంగల్ డీఐజీకి అటాచ్డ్‌లో ఉన్న సదరు అధికారి ఏమయ్యాడనేది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇన్స్పెక్టర్లుగా ఉన్న 1996 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐలకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ)లుగా పదోన్నతి పొందనున్నారు. సుమారు రెండేళ్ల కిందట 1995 బ్యాచ్‌కు సంబంధించిన పదోన్నతుల జాబితా వెలువడే సమయంలో 1996 బ్యాచ్‌కు చెందిన కొందరు కోర్టుకు వెళ్లడం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మందికి బ్రేక్ పడింది. ఇందులో మల్టీజోన్–1 చెందిన వారు 38 మంది ఉన్నారు. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత ఆ జాబితా (1995 బ్యాచ్) క్లియర్ కాగా.. ప్రభుత్వం చొరవతో 1996 బ్యాచ్‌కు చెందిన వారికి కూడ డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఇటీవల లైన్ క్లియరైంది. ఇందులో మల్టీజోన్–1లోని 38 జాబితాను కూడా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ జాబితాలోని ఒకరు సర్వీసు నుంచి తొలగించబడగా, ఇద్దరు మృతిచెందారు. మిగిలిన 35 మందిలో భరత్‌కుమార్ ఏడాదిగా విధులకు హాజరు కావడం లేదని పదోన్నతుల జాబితాలోని రిమార్క్స్‌లో ఐజీ పేర్కొన్నారు. బి.భద్రయ్యగా ఉన్న ఆయన భరత్‌కుమార్‌గా పేరు మార్చుకున్నారు. రెండేళ్ల కిందటి వరకు ఇంటెలిజెన్స్‌లో పని చేసిన భరత్.. పదోన్నతుల జాబితా వెల్లడి నాటికి ‘ఏడాదికి పైగా విధులకు గైర్హాజర్’గా పేర్కొనడంపై పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ఎస్ఐగా, సీఐగా పని చేసిన సమయంలో కూడా కొన్ని అంశాల్లో వివాదస్పదం అయ్యాడు. రియల్ ఎస్టేట్ రంగంలో కాలుపెట్టిన ఆయన డీఎస్పీ పదోన్నతుల జాబితా వెలువడే సమయానికి ఎక్కడికెళ్లాడు? ఏం చేస్తున్నాడు? అన్నది చర్చగా మారింది. విధులకు హాజరుకాకుండా.. ఉన్నతాధికారులకు కనిపించకుండా పోయిన ఈ ‘నాలుగోసింహం’ విషయం హాట్‌టాఫిక్‌గా మారింది. -
ఇక్కడ డీఎస్పీలు.. అక్కడ ఇంకా సీఐలే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖలో డీఎస్పీల పదోన్నతుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.1995 ఎస్సైల బ్యాచ్‌లో చేరిన వరంగల్ రేంజి వారంతా నిబంధనల ప్రకారం..ఇప్పటికి డీఎస్పీలుగా ఉండాలి. కానీ, వారు నేటికీ సీఐలుగానే కొనసాగుతున్నారు. మరోవైపు వారితోపాటే విధుల్లో చేరిన హైదరాబాద్ రేంజ్ పరిధి ఎస్సైలు మాత్రం ప్రస్తుతం డీఎస్పీలయ్యారు. పదోన్నతుల విషయంలో వరంగల్ రేంజ్ ఎస్సైలకు ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఇదే సమస్య ఎదురవుతోంది.ఇక్కడ ఎంతకాలం పనిచేసినా తమ బ్యాచ్మేట్లకు సెల్యూట్లు కొట్టడం అలవాటుగా మారిపోతోందని పలువురు సీఐలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కలిసొచ్చిన కొత్త కమిషనరేట్లు... హైదరాబాద్ రేంజ్లో 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ కమిషనరేట్ ఒక్కటే ఉండేది. తర్వాత సైబరాబాద్, రాచకొండ ఆవిర్భవించాయి. పోలీసుస్టేషన్లు, పోస్టులు పెరిగాయి. ఫలితంగా ఇక్కడ విధులు నిర్వహించే ఎస్సైలకు పదోన్నతుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా దక్కాయి. పైగా సీఐ, డీఎస్పీల పదోన్నతుల విషయంలో కానిస్టేబుల్ నుంచి వచ్చిన వారికి 30 శాతం, ఎస్సైగా చేరిన వారికి 70 శాతం వెయిటేజీ ఇస్తారు. హైదరాబాద్ రేంజ్లో ఇలాంటివి ఎక్కడా పాటించలేదు. వరంగల్ రేంజ్లో పోలీస్స్టేషన్ల విస్తరణ అంతగా లేదు. దీంతో కొత్త పోస్టులకు అవకాశం లేకుండాపోయింది. పైగా ఇక్కడ ఉన్నతాధికారులు పదోన్నతుల విషయంలో కానిస్టేబుల్, ఎస్సై వెయిటేజీని పక్కాగా అమలుచేస్తున్నారు. ఫలితంగా పదోన్నతుల విషయంలో వీరికి ప్రతీసారి మొండిచేయే ఎదురవుతోంది. పాతికేళ్లయినా సీఐలుగానే.. 1995 ఎస్సై బ్యాచ్‌ల వారు 2016 నుంచి 2019లో దశలవారీగా పదోన్నతులు పొంది డీఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 360 మందికిపైగా ఉండగా, హైదరాబాద్‌లో ఉన్న దాదాపు 310మందికి పైగా సీఐలు డీఎస్పీలు అయ్యారు. కానీ, వరంగల్ రేంజ్లో ఉన్న 54 మందికి మాత్రం నేటికీ పదోన్నతి దక్కలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. 1991 ఎస్సైల బ్యాచ్‌కు చెందిన వారికి వరంగల్ రేంజిలోనూ ఇలాగే జరిగితే సీఎం కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకుని అప్పటికప్పుడు 145 సూపర్‌న్యూమర్ పోస్టులు సృష్టించి వారికి డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు. అంతేకాదు, 1996 ఎస్సై బ్యాచ్‌కు చెంది హైదరాబాద్ రేంజ్లో ఉన్న 64 మందికి డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనితో 1995 ఎస్సై బ్యాచ్‌ల బ్యాచ్‌కు చెందిన వరంగల్ రేంజ్ సీఐలంతా సీఎంను కలసి మొరపెట్టుకున్నారు. సీఎం సూచన ల మేరకు డీజీపీ ఆఫీసు వీరికి పదోన్నతులు కల్పించే ఫైల్‌ను తయారు చేసి ఫిబ్రవరిలో సీఎంవోకు పంపింది. కరోనా కారణంగా దానికి గ్రహణం పట్టుకుంది. 25 ఏళ్లలో ఒకే ఒక్క పదోన్న తి పొందిన తాము మానసిక వేదనతో ఉన్నామని పలువురు సీఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకంటే జూనియర్లకు పదోన్నతులు సిద్ధమవుతుంటే.. తమకు మాత్రం రేపు మాపు అంటూ నిలుపుదల చేయడం సరికాదంటున్నారు. సీనియా రిటీలో తమ కంటే ముందున్న హైదరాబాద్ రేంజ్ బ్యాచ్మేట్లు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు పొందినా.. తాము సీఐలుగానే మిగిలిపోతామన్న ఆందోళన వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు. -
సర్కిళ్ల ప్రదక్షిణలు
అన్ని విధాలా అనుకూలమైన చోటుకు బదిలీ చేరుుంచుకోవడానికి పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరైనా చూస్తే ఎమనుకుంటారోనని ఓ వైపు సంశరుుస్తూనే.. మరో వైపు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలను కాకా పడుతున్నారు. మరికొందరైతే వారు అడిగినంత డబ్బు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధమంటూ సంకేతాలు పంపుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : సీఐల బదిలీలకు తెరలేచింది. డీఎస్పీ పదోన్నతుల ప్రక్రియ ముగియడంతో త్వరలో సీఐల బదిలీలు జరగనున్నాయి. దీంతో కోరుకున్న సర్కిల్‌ను దక్కించుకునేందుకు సీఐలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండ ఉంటే ఆశించిన సర్కిల్ చేజిక్కుతుందని ఆ దిశగా గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లాలో పోస్టింగుల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి పరిటాల సునీతను ప్రసన్నం చేసుకునే పనిలో అధిక శాతం సీఐలు నిమగ్నమయ్యారు. కొద్ది రోజులుగా అనంతపురంలోని అరవిందనగర్‌లో ఉన్న మంత్రి ఇంటి చుట్టూ కొందరు సీఐలు ప్రదక్షిణలు చేస్తున్నారు. యూనిఫాంతో వచ్చి మరీ మంత్రిని కలుస్తున్నారు. తాము ఆశిస్తున్న సర్కిల్ విషయాన్ని విన్నవిస్తున్నారు. లూఫ్లైన్ గండంలోని వారే అధికం ఈ విడత బదిలీల్లో ఎస్ఐ నుంచి సీఐల పదోన్నతుల సమయంలో లూఫ్లైన్లో పనిచేయకుండా సర్కిల్‌లలో కొనసాగుతున్న వారు తిరిగి సర్కిల్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీపీఎం(ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్) ప్రకారం ఓ సీఐ రెండేళ్ల పాటు లూఫ్లైన్లో పని చేయాలి. కానీ కొంత మంది రాజకీయ సిఫార్సుల అండతో అప్రాధాన్యత పోస్టులలో విధులు నిర్వహించకుండానేసర్కిల్లలో కొనసాగుతున్నారు. ఇలాంటి వారిని ఈదఫా బదిలీల్లో లూఫ్‌లైన్‌కు వేయాలని రాయలసీమ ఐజీ భావిస్తున్నారు. లూఫ్లైన్లో పనిచేసి, ఆపై సర్కిళ్లకు రాకుండా అప్రాధాన్యత పోస్టుల్లోనే కొనసాగే సమర్థులైన సీఐలకు ఈసారి సర్కిల్ కట్టబెట్టాలని కూడా ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాయలసీమలో లూఫ్లైన్లో పనిచేయకుండా విధులు నిర్వహిస్తున్న సీఐలు 55 మంది ఉన్నారు. వీరిలో అనంతపురంలో 17మంది ఉన్నారు. వీరిలో చాలామంది కోరుకున్న సర్కిల్‌ను దక్కించుకునేందుకు మంత్రి సునీత ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరితో పాటు కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తూ అనంతపురంలోని సర్కిళ్లను ఆశిస్తున్న సీఐలు కూడా మంత్రి అండదండల కోసం ‘అనంత’ బాటపడుతున్నారు. దీంతో మంత్రి నివాసం ఎదుట సీఐల హడావుడి బాగా కనిపిస్తోంది. మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రావడంతో ఆయన్ను కలవడానికి ఎవరంతకు వారు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇతనిపాటు చీఫ్‌విప్ కాల్వశ్రీనివాసులు ఇంటి వద్ద కూడా సీఐల హడావుడి కన్పిస్తోంది. ప్రస్తుతం సర్కిళ్లలో పనిచేస్తున్న సీఐలు కూడా లూఫ్‌లైన్‌కు వెళ్లకుండా సర్కిళ్లలో కొనసాగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సీఐలు సర్కిల్‌ను బట్టి 7-15 లక్షల రూపాయల వరకూ అధికార పార్టీ నేతలకు ముట్టజెపుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని ముఖ్యమైన సర్కిళ్లకు ఏ సీఐ రాబోతున్నారో ఇప్పటికే పోలీసు శాఖలో లీకైంది. ఫలానా సర్కిల్‌కు ఫలానా సీఐ వస్తున్నాడని ఎస్ఐలు, సీఐలు జోరుగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా బదిలీ నేపథ్యంలో ఒక్కో సీఐ నుంచి మూడు ఆప్షన్లను ఉన్నతాధికారులు తీసుకున్నారు. జిల్లాలో అధికార పార్టీ నేతల ఇళ్ల వద్ద సీఐల సందడి చూస్తుంటే ఆప్షన్లు కాగితంపై మినహా సర్కిల్ వరకూ రావని కొందరు సీఐలు బాహాటంగానే చెబుతున్నారు. ఈ విడత బదిలీల్లో రెండు సామాజిక వర్గాలకు చెందిన సీఐలకే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. బలహీన వర్గాలకు చెందిన సీఐలు మళ్లీ లూఫ్లైన్లోనే పని చేయకతప్పదని కొందరు సీఐలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.