property tax dues
-
జీహెచ్ఎంసీకి పైసా పరేషాన్.. గండం గట్టెక్కేనా?
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీకి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నప్పటికీ, చెల్లింపులు మాత్రం గోరంతలు కూడా ఉండటం లేదు. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. తెలంగాణ ఏర్పాటు కాకముందు నుంచీ వివిధ ప్రభుత్వ భవనాల ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను, వాటిపై బకాయిలు దాదాపు రూ.6000 కోట్లు పేరుకుపోయాయి. వీటిల్లో పాత సచివాలయ భవనాలకు సంబంధించి దాదాపు రూ. 400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఆ సచివాలయం అంతర్ధానమై, కొత్త సచివాలయం త్వరలో ప్రారంభం కానున్నప్పటికీ జీహెచ్ఎంసీ బకాయిల చిట్టాలో మాత్రం అలాగే ఉంది. దాంతోపాటు వైద్యారోగ్య, విద్యాశాఖ, ఎక్సైజ్, ట్రాన్స్‌కో, జలమండలి తదితర ప్రభుత్వ విభాగాలకు చెందిన భవనాల నుంచి దశాబ్దానికిపైగా ఆస్తిపన్ను బకాయిలు పెనాల్టీలతో కలిపి కొండల్లా పేరుకుపోయాయి. బడ్జెట్లో పద్దు ఉన్నా.. ఆస్తిపన్ను బకాయిలు ఏటికేడు పెరిగిపోతున్నా, జీహెచ్ఎంసీ ఆయా ప్రభుత్వ విభాగాలకు చెల్లించాల్సిందిగా లేఖలు రాస్తున్నా నయాపైసా కూడా విదిల్చడం లేదు. వీటి చెల్లింపుల కోసం రాష్ట్ర బడ్జెట్లో ఓ పద్దు కూడా ఉంది. కానీ.. చెల్లింపులే ఉండటం లేదు. ఆరేడేళ్ల క్రితం ఏటా కనీసం రూ. 50 కోట్లయినా బడ్జెట్లో కేటాయించి విడుదల చేసేవారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇది కేవలం రూ.10 కోట్లు మించడం లేదు. తాజా రాష్ట్ర బడ్జెట్లోనూ రూ. 10 కోట్లే విదిల్చారు. జీహెచ్ఎంసీకి తప్పని తిప్పలు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చేపట్టిన, పురోగతిలో ఉన్న వివిధ ప్రాజెక్టులు కుంటుపడే ప్రమాదం పొంచి ఉంది. ఓవైపు సదరు ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు తగిన నిధులు కేటాయించకపోవడం, మరోవైపు జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంబంధిత ఉన్నతాధికారులు నిధుల లేమి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా.. లేదా..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ ఇప్పటికే శక్తికి మించిన అప్పులు చేయడంతో వాటి వడ్డీలు, ఇతరత్రా ఖర్చులు భరించలేక సిబ్బంది జీతాలకే పలు అగచాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకోకపోతే జీహెచ్ఎంసీ గడ్డు పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. ఓటీఎస్‌ను వినియోగించుకోని వైనం.. ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయిన వారు పెనాల్టీల భారాన్ని మోయలేకే చెల్లించడం లేదనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద ఆస్తిపన్ను పెనాల్టీలపై 90 శాతం రాయితీనిచ్చింది. ప్రభుత్వ భవనాలకు ఆ స్కీమ్‌ను సైతం వినియోగించుకోలేదు. దాన్ని వినియోగించుకొని చెల్లించినా, జీహెచ్ఎంసీకి భారీ ఆదాయం సమకూరేదని పరిశీలకులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో పెనాలీ్టలే అసలును మించి భారీ బకాయిల గుట్టలుగా మారాయి. ఎన్నెన్నో భవనాలు.. ఆస్తిపన్ను బకాయిలు భారీగా ఉన్న భవనాల్లో అసెంబ్లీ, రవీంద్రభారతి, హెచ్ఎండీఏ, ఆస్పత్రులు, విద్యాలయాలకు చెందినవే కాకుండా పెట్రోలు బంకులు, క్యాంటీన్ల వంటివి సైతం ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీకి రావాల్సింది జీహెచ్ఎంసీకి రావాల్సిన మొత్తం సచివాలయ పాతభవనం : రూ.400 కోట్లు వైద్యారోగ్యశాఖ భవనాలు : రూ.1190 కోట్లు ఎక్సైజ్ శాఖ భవనాలు: రూ. 900 కోట్లు విద్యాశాఖ భవనాలు: రూ.400 కోట్లు జలమండలి భవనాలు : రూ.70 కోట్లు -
ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక వ్యూహం
సాక్షి,గచ్చిబౌలి: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లలో శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ సింహ భాగంలో నిలుస్తోంది. వెస్ట్‌జోన్‌లో ముఖ్యంగా శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల నుంచి అధిక ఆదాయం వస్తోంది. జోన్ పరిధిలో రూ.509.76 కోట్ల ఆస్తి పన్ను వసూలు టార్గెట్ కాగా, ఇప్పటికే రూ.256.68 కోట్లు వసూలు చేశారు. రూ.253.08 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోజు వారీ టార్గెట్లు నిర్ధేశిస్తూ ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచారు. మొండి బకాయిదారులు, కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక వ్యూహంతో వసూళ్లు చేయాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దిశానిర్ధేశం చేస్తున్నారు. మొండా బకాయిదారులకు ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేశారు. 2,22,174 అసెస్మెంట్లు శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్ల పరిధిలో 2,22,174 అసెస్మెంట్లు ఉన్నాయి. యూసూఫ్‌గూడ సర్కిల్లో 32,131 అసెస్మెంట్లు, శేరిలింగంపల్లిలో 84,712 అసెస్మెంట్లు, చందానగర్‌లో 83,875 అసెస్మెంట్లు, పటాన్చెరు సర్కిల్ పరిధిలో ఉన్న 21,456 అసెస్మెంట్ల ద్వారా మొత్తం రూ.509.76 కోట్లు వసూలు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించారు. రెడ్ నోటీసులు జారీ జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో దాదాపు రూ.200 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశారు. 16688 అసెస్మెంట్లకు రెడ్ నోటీసులు జారీ చేయాల్సి ఉంది. యూసూఫ్‌గూడ 5380, శేరిలింగంపల్లి 1800, చందానగర్ 8251, పటాన్చెరు 1257 అసెస్మెంట్లకు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు దాదాపు పదివేల మందికి రెడ్ నోటీసులు జారీ చేశారు. బకాయిల వసూళ్లపై సిబ్బందికి అధికారులు సూచనలు, సలహాలు ఇస్తారు. ట్యాక్స్ కలెక్షన్‌కు వెళ్లినప్పుడు వడ్డీ రాయితీపై అవగాహన కలి్పస్తారు. ఇలా వసూలు ... ► మొదట డిమాండ్ నోటీసు అందజేత ► స్పందించకుంటే రెడ్ నోటీస్‌తో పాటు వారెంట్‌ను ఉప కమిషనర్లు జారీ చేస్తారు. ► వాణిజ్య సముదాయాలకు అక్యుపై నోటీస్ జారీ చేస్తారు. అయిన స్పందించకుంటే భవనం జప్తు చేస్తారు. ► గత ఫిబ్రవరి నుంచి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఎంటమాలజీ విభాగాల సిబ్బంది, అధికారులు ఆస్తి పన్ను వసూళ్లలో పాల్గొంటున్నారు. ► ఆయా డాకెట్లలో మొదట బిల్ కలెక్టర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఆస్తి పన్ను వసూలకు వెళ్తారు. ► అయిన స్పందించకుంటే డాకెట్లోని 9 మంది సభ్యుల బృందం వెళ్లి సంప్రదిస్తుంది. ► పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను రావాల్సిన చోటుకు ఉప కమిషనర్లు కూడా వెళ్తారు. ► మార్చి 31 లోపు ఆస్తి పన్ను చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కలి్పస్తారు. ► కోవిడ్ కారణంగా వర్కింగ్ హా స్టళ్లు మూసివేయడంతో ఆస్తి వసూలులో జాప్యం జరుగుతోంది. ► వెస్ట్‌జోన్ పరిధిలోని గచి్చ»ౌలి, కొండాపూర్, మాదాపూర్, గౌలిదొడ్డి, ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీల్లో వందలాది వర్కింగ్ హాస్టళ్లు ఉన్నాయి. వంద శాతం వసూలు చేస్తాం ఆస్తి పన్ను వసూలు వంద శాతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కోవిడ్ కారణంగా కొన్ని వ్యాపార సంస్థలు, హాస్టళ్లు మూతపడటంతో పన్ను వసూళ్లు కొంత మేరకు తగ్గాయి. వెస్ట్ జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో ఆస్తి వసూలుపై రోజు వారీ టార్గెట్లు ఇస్తున్నాం. మొండి బకాయిల వసూలుపై సమీక్షలు నిర్వహిస్తున్నాం. బకాయిల వసూలుపై ఎలాంటి వ్యూహంతో ముందుకెవెళ్లాలో అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నాం. మార్చి 31లోపు ఆస్తి పన్ను చెల్లించి వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: ఎన్.రవి కిరణ్, వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ -
ప్రముఖ సంస్థలకు జీహెచ్ఎంసీ రెడ్ నోటీసులు
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో జీహెచ్ఎంసీకి భారీగా పన్నులు వసూళ్లు కావడంతో ఇక మొండి బకాయిలపై అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా కోట్లలో బకాయిలు ఉన్న ప్రముఖ సంస్థలకు సోమవారం రెడ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో ప్రతిష్టాత్మక నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్), పార్క్ హయత్ హోటల్, సైఫాబాద్‌లోని ఏజీ కార్యాలయంతో పాటు టెలిఫోన్ భవన్ ఉన్నాయి. నిమ్స్ ఆస్పత్రి రూ.9 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సిందని జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) అధికారులు తెలిపారు. తక్షణం పన్ను చెల్లించకుంటే జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్ నంబర్ -2లోని పార్క్‌హయత్ హోటల్ ఈ ఏడాదికి గాను రూ.2.16 కోట్లు ఆస్తిపన్ను బకాయి ఉండడంతో రెడ్ నోటీసులు జారీ చేశారు. సైఫాబాద్‌లోని ఏజీ ఆఫీస్ రూ. 2.37 కోట్లు, టెలిఫోన్ భవన్ కూడా పెద్ద ఎత్తున బకాయిపడినట్లు అధికారులు తెలిపారు. -
రెండు గంటల్లో 5 కోట్ల వసూళ్లు!
-
రెండు గంటల్లో 5 కోట్ల వసూళ్లు!
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం జీహెచ్ఎంసీకి బాగా కలిసొచ్చింది. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీలు, పంచాయతీల లాంటి స్థానిక సంస్థల్లో బకాయి ఉన్న ఆస్తిపన్ను సహా ఏ రకమైన ఫీజులనైనా శుక్రవారం వరకు పాత నోట్లతో చెల్లించవచ్చని ప్రకటన రావడంతో దశ తిరిగింది. ఒక్క జీహెచ్ఎంసీకే.. రెండు గంటల్లో ఐదు కోట్ల రూపాయల పన్నులు వసూలయ్యాయి. ఇప్పటివరకు ఆస్తిపన్ను కట్టాల్సిన వాళ్లు ఆ అంశాన్ని పెద్ద సీరియస్‌గా పట్టించుకోకపోయినా.. చేతిలో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడం అంత సులభం కాకపోవడంతో కనీసం ఈ అవసరానికైనా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మొత్తం పన్ను బకాయిలను కట్టేస్తున్నారు. దాంతో జీహెచ్ఎంసీకి ఒక్కసారిగా నిధులు వెల్లువెత్తాయి. మొదటి రెండు గంటల్లోనే వివిధ మార్గాల ద్వారా మొత్తం 5 కోట్ల రూపాయల మేర పన్నులు కట్టారు. సాయంత్రం అయ్యేసరికి ఈ మొత్తం ఇంకెంత పెరుగుతుందో చూడాల్సి ఉంది.