రెండు గంటల్లో 5 కోట్ల వసూళ్లు!
రెండు గంటల్లో 5 కోట్ల వసూళ్లు!
Published Fri, Nov 11 2016 11:28 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం జీహెచ్ఎంసీకి బాగా కలిసొచ్చింది. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీలు, పంచాయతీల లాంటి స్థానిక సంస్థల్లో బకాయి ఉన్న ఆస్తిపన్ను సహా ఏ రకమైన ఫీజులనైనా శుక్రవారం వరకు పాత నోట్లతో చెల్లించవచ్చని ప్రకటన రావడంతో దశ తిరిగింది. ఒక్క జీహెచ్ఎంసీకే.. రెండు గంటల్లో ఐదు కోట్ల రూపాయల పన్నులు వసూలయ్యాయి.
ఇప్పటివరకు ఆస్తిపన్ను కట్టాల్సిన వాళ్లు ఆ అంశాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోకపోయినా.. చేతిలో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడం అంత సులభం కాకపోవడంతో కనీసం ఈ అవసరానికైనా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మొత్తం పన్ను బకాయిలను కట్టేస్తున్నారు. దాంతో జీహెచ్ఎంసీకి ఒక్కసారిగా నిధులు వెల్లువెత్తాయి. మొదటి రెండు గంటల్లోనే వివిధ మార్గాల ద్వారా మొత్తం 5 కోట్ల రూపాయల మేర పన్నులు కట్టారు. సాయంత్రం అయ్యేసరికి ఈ మొత్తం ఇంకెంత పెరుగుతుందో చూడాల్సి ఉంది.
Advertisement