prorogue assembly
-
'అసెంబ్లీ ప్రొరోగ్ అంశాన్ని వివాదం చేయడం సరికాదు'
హైదరాబాద్: అసెంబ్లీ ప్రోరోగ్ అంశాన్ని వివాదం చేయడం సరికాదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలిపారు. తెలంగాణ మంత్రులు ప్రోరోగ్ చేయవద్దని గవర్నర్‌ను కలవడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రోరోగ్ వివాదం చేయవద్దని తెలంగాణ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశానికి బదులు కేబినెట్ సమావేశం పెట్టాలని సీఎం కిరణ్ ను డిమాండ్ చేసి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు సోమవారం తెలిపిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశం కావడానికి ఇప్పటికిప్పుడు కొంపలు మునిగే ఆర్డినెన్స్ లు ఏమీ లేవని ఆయన అన్నారు. -
'అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రోరోగ్ ఫైల్ తన కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. కాగా, తాను ఆ ఫైల్‌ను ఇంతవరకూ చూడలేదన్నారు. ప్రోరోగ్ అంశంపై శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీని ప్రోరోగ్ పరచాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీ సమావేశం కావడానికి ఇప్పటికిప్పుడు కొంపలు మునిగే ఆర్డినెన్స్ లు ఏమీ లేవన్నారు. వచ్చే నెల 20 లోగా అసెంబ్లీ ఖచ్చితంగా భేటీ అవుతుందని తెలిపారు. రాయల తెలంగాణ కోసం తనకెలాంటి ఫోన్ కాల్స్ రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్నిఆర్డినెన్స్ లు జారీ చేయాలంటే అసెంబ్లీని ప్రోరోగ్ పరచాలంటూ సీఎం కార్యాలయం స్పీకర్ కు ఓ లేఖ పంపిన విషయం తెలిసిందే.