protecting
-
సైనికున్ని రక్షించేందుకు.. తూటాలకు ఎదురునిలిచి..
ఢిల్లీ: విధినిర్వహణలో ప్రాణాలను అర్పించింది ఓ సైనిక జాగిలం. సైనికుని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను పనంగా పెట్టింది. ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి వీర మరణం పొందింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు-సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కెంట్ అనే సైనిక జాగిలం ప్రాణాలను కోల్పోయినట్లు ఆర్మీ తెలిపింది. 'ఆపరేషన్ సుజలిగల'లో భాగంగా జమ్మూ రాజౌరీ జిల్లాలోని నార్లా ప్రాంతంలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపడుతోంది. వారికి తోడుగా 21వ ఆర్మీ డాగ్ యూనిట్‌కు చెందిన ఆరేళ్ల కెంట్ అనే కుక్కను తీసుకువెళ్లారు. సైనికులందరూ కెంట్‌ను అనుసరిస్తున్నారు. ఉగ్రవాదుల జాడను పసిగట్టిన కెంట్.. సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. #WATCH | Indian Army dog Kent, a six-year-old female labrador of the 21 Army Dog Unit laid down her life while shielding its handler during the ongoing Rajouri encounter operation in J&K. Kent was leading a column of soldiers on the trail of fleeing terrorists. It came down under… pic.twitter.com/ZQADe50sWK — ANI (@ANI) September 13, 2023 కాల్పుల్లో ఉగ్రవాదులు ఓ సైనికున్ని చుట్టుముట్టారు. అతన్ని రక్షించడం కోసం కెంట్ ఉగ్రవాదులకు ఎదురునిలిచింది. ఈ క్రమంలో తూటాలు తగిలి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది, ఒక ఆర్మీ జవాన్ మరణించారని వెల్లడించారు. Army dog Kent laid down her life while shielding its handler during operation in Rajouri, J&K Kent was leading column of soldiers on the trail of fleeing terrorists. It came down under heavy hostile fire Till now, 1 terrorist killed Thank you Kent for serving nation. Om Shanti pic.twitter.com/BeeVjktB8K — Anshul Saxena (@AskAnshul) September 12, 2023 ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
జంగిల్ రాణి..పద్మిని మాఝీ: అడవిని చేరాలంటే ఆమెను దాటాలి
చేత గొడ్డలి కళ్లల్లో తీక్షణత ‘అడవికి నేను కాపలా’ అనే ప్రకటన. 65 ఏళ్ల పద్మిని మాఝీ ఒరిస్సాలో తన పల్లె చుట్టూ ఉన్న 100 హెక్టార్ల అడవిలో పుల్ల కూడా పోకుండా ఒక్క కొమ్మా తెగి పడకుండా కాపలా కాస్తోంది. కలప మాఫియా ఆమె దెబ్బకు తోక ముడిచింది. అందుకే ఆమెను ఆ ప్రాంతంలో జంగిల్ రాణి అని పిలుస్తుంటారు. ఉదయం ఆరూ ఆరున్నరకంతా పద్మిని మాఝీ ఇంటి పనులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత ఆమె తన అసలైన ఇంటికి బయలుదేరుతుంది. అంటే దాపున ఉన్న అడవికి. అదే ఆమె రోజంతా గడిపే ఇల్లు. ఒరిస్సాలోని నౌపడా జిల్లాలో బిర్సింగ్పూర్ అని చిన్న పల్లె ఆమెది. ఆ పల్లెకు ఆనుకునే చిన్న కొండ. దాని చుట్టుపక్కల విస్తారమైన అడవి. అందులో చాలా విలువైన కలప చెట్లు, మందు మొక్కలు, అడవి పళ్లు అన్నీ దొరుకుతాయి. ‘మేము అడవి మీద ఆధారపడి బతుకుతాము. అడవిని నరికి, అడవిలో ఉండే జంతువులను చంపి కాదు’.. అంటుంది పద్మిని. కిరాసాగర్ మాఝీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ముప్పై ఏళ్ల క్రితం ఆ అడవి పక్క ఊరికి కోడలిగా వచ్చింది పద్మిని. అడవికి వెళ్లి వంట చెరుకు, తేనె, దుంపలు... ఇవన్నీ తెచ్చుకుని బతకడం తొందరగా నేర్చుకుంది. ‘కాని అడవిలో ఆ రోజుల్లో కలప దొంగలు విచ్చలవిడిగా తిరిగేవారు. వేటగాళ్లు ఉండేవారు. వారి వల్ల అడవి నాశనమవుతోందని నాకు అర్థమైంది. అడవి పచ్చగా ఉంటే మేము పచ్చగా ఉంటాము. అడవి ఉంటేనే వానలు పడతాయని మా నాన్న నా చిన్నప్పుడు చెప్పేవాడు. అందుకే అడవిని కాపాడాలనుకున్నా’ అంటుందామె. తనకు తానుగా వేసుకున్న ఈ డ్యూటీని పాతికేళ్లు గడిచినా ఆమె వదల్లేదు. రోజూ ఉదయం ఆరున్నరకంతా భుజాన గొడ్డలి వేసుకొని అడవిలోకి బయలుదేరుతుందామె. పుట్టి బుద్ధెరిగాక ఆమె చెప్పులు వేసుకోలేదు. ఇన్నాళ్లుగా ఆమె అడవిలో ఉత్త పాదాలతోనే తిరుగుతుంది. అడవిలోని ప్రతి అడుగు తెలిసినవారే ఉత్త పాదాలతో తిరగ్గలరు. అడవిని ఆమె ఐదారు భాగాలుగా చేసుకుంది. ఒకోరోజు ఒకో భాగంలో తిరుగుతుంది. దారిలో తనకు కనపడిన ఎండుపుల్లల్ని ఒకచోటకు చేరుస్తుంది. అడ్డంగా ఉన్న కొమ్మలను, తీగలను కొట్టి దారి చేస్తుంది. నిన్న ఉన్న అడవే ఇవాళా ఉందా అని చెక్ చేస్తుంది. ఇక పరాయి వ్యక్తి ఎవరైనా కనిపించాడో గొడ్డలి చేతికందుకుంటుంది. ‘మొదట వాణ్ణి భయపెడతాను. నన్ను చూడగానే చాలామంది పారిపోతారు. అడ్డం తిరిగితే పెద్దగా అరిచి సాయం వచ్చేలా చేస్తాను. ఊరి వాళ్లు ఎవరో ఒకరు అడవిలో తిరుగుతూనే ఉంటారు. వారొచ్చి పట్టుకుంటారు. ఊర్లోకి తీసుకెళ్లి వాణ్ణి కట్టేస్తాం. వాడు క్షమాపణలు చెప్పి మళ్లీ అడవి ముఖం చూడను అని ప్రమాణం చేస్తే వదిలేస్తాం. అడవిలో రోజూ నేను తిరుగుతానని ఎదురు పడతానని కలప దొంగలకు, వేటగాళ్లకు తెలిసిపోయింది. అందుకే రావడం మానేశారు. మా అడవి మాకు మిగిలింది’ అంటుంది పద్మిని. ఇన్నేళ్లుగా ఆమె ఒక పైసా ఎవరి నుంచి ఆశించకుండా, ఏ జీతం తీసుకోకుండా ఈ పని చేస్తున్నందు వల్ల ఊళ్లో పద్మిని అంటే చాలా గౌరవం. ఆమెను జంగిల్ రాణి అని పిలుస్తారు. ఫారెస్ట్ రేంజర్లు, గార్డులు ఆమె కనిపిస్తే గౌరవంగా మాట్లాడతారు. ‘నాకు జీతం ఎందుకు? ఇది ప్రతి మనిషి బాధ్యత’ అంటుంది మాఝీ. ఈ అడవి పచ్చగా ఉండటం వల్ల వీకెండ్స్‌లో విహారానికి వచ్చేవారి సంఖ్య ఎక్కువ. వారి ఆనందానికి కారణం ఒక బక్కపలుచని ఆదివాసి మహిళ అని వారికి తెలియకపోవచ్చు. ఇలాంటి తెలియని మహానుభావుల వల్లే మన దేశంలో ప్రకృతి ఈ మాత్రమైనా మిగిలి ఉంది. ఇలాంటి స్పూర్తిదాయక కథలు ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. పద్మిని మాఝీతో పాటు ఆమెలాంటి మహిళా మణులందరికీ ముందుగానే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!! నన్ను చూడగానే చాలామంది పారిపోతారు. అడ్డం తిరిగితే పెద్దగా అరిచి ఊరివాళ్లు సాయం వచ్చేలా చేస్తాను. ఊర్లోకి తీసుకెళ్లి వాణ్ణి కట్టేస్తాం. వాడు క్షమాపణలు చెప్పి మళ్లీ అడవి ముఖం చూడను అని ప్రమాణం చేస్తే వదిలేస్తాం. -
17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..
టర్కీలో ఘోరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయి శిథిలాల నగరంగా మారింది. ఎటు చూసినా మనసును కలిచి వేసే దృశ్యాలే. తల్లులను పోగొట్టుకున్న చిన్నారులు ఒకవైపు పిల్లలను పోగొట్టుకుని గర్భశోకంతో ఆక్రందనలు చేస్తున్న తల్లిదండ్రులు మరోవైపు. అక్కడి కన్నీటి రోదనలు ప్రకృతే విలపించేలా విషాదంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక వైరల్ ఫోటో అందరి హృదయాలను ద్రవింపచేసింది. ఆ ఫోటోలో ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద తమను కాపాడే వారి కోసం బిక్కు బిక్కుమంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. అందులో ఆ చిన్నారి తన తమ్ముడి తలపై చేయి వేసి శిథిలాల కింద నలిగిపోకుండా కాపాడుతోంది. వాళ్లు అలా శిథిలాల కింద సుమారు 17 గంటల పాటు చిక్కుపోయినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్ సఫా ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన ట్విట్టర్లో.." ఆ ఏడేళ్ల బాలిక తమ్ముడిని రక్షించుకోవడానికి పడుతున్న తాపత్రయం మనసును పిండేస్తుంది. ఈ ఫోటోని ఎవరూ షేర్ చేయలేదు, ఆ చిన్నారి చనిపోక మునుపే షేర్ చేయండి. ఆ చిన్నారులు బతకాలని కోరుకుందాం. పాజిటివ్‌గా ఆలోచిద్దాం" అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు తమ్ముడి మీద ఆ చిన్నారికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతూ..ఏ అక్క చేయని సాహసం చేస్తోంది ఆ చిన్నారి. వారిద్దరూ బతకడమే గాక ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..ట్వీట్లు చేశారు. The 7 year old girl who kept her hand on her little brother's head to protect him while they were under the rubble for 17 hours has made it safely. I see no one sharing. If she were dead, everyone would share! Share positivity... pic.twitter.com/J2sU5A5uvO — Mohamad Safa (@mhdksafa) February 7, 2023 (చదవండి: ఆ విమానం కూలి మంటల్లో చిక్కుకుంది..కానీ ఆ ఇద్దరు పైలట్లు..) -
ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి..
తాడిమర్రి(శ్రీసత్యసాయి జిల్లా): కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలంటూ తహసీల్దార్‌ను ఆశ్రయించారు. వివరాలు... తాడిమర్రి మండలం దాడితోటకు చెందిన ఎం.కుళ్లాయప్ప కుమారుడు రాజ్‌కుమార్ టైల్స్ పరిచే పనిచేస్తున్నాడు. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలకు చెందిన తలారి శ్రీనివాసులు కుమార్తె మౌనిక, రాజ్‌కుమార్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదవండి👉: మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా కడపలో టైల్స్ పరిచేందుకు వెళ్లిన రాజ్‌కుమార్ వద్దకు ఈ నెల 4న మౌనిక ఒంటరిగా వెళ్లింది. అదే రోజు కడపలోని దుర్గమ్మ గుడిలో వీరు వివాహం చేసుకున్నారు. అయితే మౌనిక కనిపించడం లేదంటూ తండ్రి శ్రీనివాసులు చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమ జంట ఈ నెల 24న తాడిమర్రి పోలీసు స్టేషన్లో హాజరై తాము వివాహం చేసుకున్న సంగతి తెలిపారు. అనంతరం మంగళవారం తహసీల్దార్ హరిప్రసాద్‌ను కలిసి అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు హరిప్రసాద్, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
దాడిని అడ్డుకున్న 'విశ్వాసం'
పెంపుడు జంతువులు యజమానుల పట్ల అత్యంత విశ్వాసాన్ని చూపిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ విశ్వాసానికి మారుపేరైన శునకం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాటి విశ్వాసానికి తార్కాణంగా ఇప్పుడు యూట్యూబ్ లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. తన యజమానిపై దాడి చేయబోయిన వ్యక్తిపై ప్రతాపం చూపించిన ఆ పెంపుడు జంతువు వైనం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. చాకుతో దాడికి దిగబోయిన వ్యక్తిని అడ్డుకొని.. తన యజమాని ప్రాణాలు నిలబెట్టిన ఓ పెంపుడు జంతువు వీడియో యూట్యూబ్ లో లక్షలమందిని ఆకట్టుకుంటోంది. కెన్యాకు చెందిన ఓ శిక్షణ పొందిన శునకం.. స్నేహానికి, హానికి మధ్య తారతమ్యాన్ని ఇట్టే పసిగట్ట గలిగింది. యజమానితోపాటు కూర్చొని హాయిగా కబుర్లు చెబుతున్న వ్యక్తి ప్రవర్తనలో మార్పును సెకన్లలోనే గమనించగలిగింది. యజమానిపై కత్తి దూయాలనుకున్న అతడ్ని... చాకచక్యంగా అడ్డుకొని యజమాని ప్రాణాలను కాపాడటంతోపాటు, విశ్వాసాన్ని చాటుకుంది. ఎన్నో ఏళ్లుగా పోలీసులకు తోడ్పడుతూ, ఇళ్లలో కాపలాగా కూడా ఉపయోగపడుతున్న శునకాలు... తమ బాధ్యతను సవ్యంగా నిర్వర్తించడంతోపాటు... శిక్షణ ఇచ్చిన వారిపట్ల, యజమానిపట్ల చూపించే అత్యంత విశ్వాసం ప్రస్తుత వీడియోలో మరోమారు సాక్షాత్కరించింది. కెన్యాలో ఇటువంటి తర్ఫీదు పొందిన శునకాలు 20 వరకూ ఉన్నాయి. ప్రమాదాలను తప్పించుకునేందుకు, దొంగల బాధ నుంచి బయటపడేందుకు ముందు జాగ్రత్తగా ఇటీవల షాపింగ్ మాల్స్, హోటల్స్, చర్చిలు వంటి వాటిలో కాపలా కోసం స్నిఫర్ డాగ్స్ ను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి శునకాలను వైట్ కాలర్ జాబ్ డాగ్స్ అని కూడా అంటున్నారు. వీటి బ్రీడ్ ను బట్టి సుమారు వీటి ఖరీదు 20 లక్షల రూపాయలకు పైగా పలుకుతోంది. వీటిలో కేవలం కాపలాకు వినియోగించే డాగ్స్ సుమారు 12 వేల రూపాయలనుంచి, లక్షన్నర వరకూ ఉంటాయి.