protest at jantarmantar
-
జంతర్ మంతర్‌కు మారిన సీఎం దీక్షావేదిక
-
జంతర్ మంతర్‌కు మారిన సీఎం దీక్షావేదిక
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చేయ తలపెట్టిన నిరాహార దీక్ష వేదిక మారింది. తొలుత ఇందిరాగాంధీ సమాధి ఉన్న శక్తిస్థల్ వద్ద దీక్ష చేయాలని ముఖ్యమంత్రి తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే, శక్తిస్థల్ వద్ద మరమ్మతులు చేస్తున్నారని, అందువల్ల అక్కడ ఎలాంటి దీక్షలు వద్దని అధికారులు సూచించినట్లు తెలిసింది. దీంతో దేశ రాజధాని నగరంలో పోరాటాలకు వేదిక అయిన జంతర్ మంతర్ వద్దకు సీఎం కిరణ్ దీక్షావేదిక మారింది.