'పీఎఫ్'కు యూఏఎన్ తప్పనిసరి!
కేంద్ర ప్రభుత్వం యోచన
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) చందాదారులందరికీ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్) తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో సంస్థ ఉన్నతాధికారులకు కేంద్ర భవిష్యనిధి కమిషనర్ కేకే జలాన్ ఈ మేరకు తెలిపారు. చందాదారులకు సంస్థ సేవలు, పథకాలు సమర్థంగా అందజేసేందుకు యూఏఎన్ తప్పనిసరి చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు వివరిం చారు. ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు పీఎఫ్ ఖాతాలు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా రిటైర్ అయ్యేంతవరకు ఒకే సంఖ్య(యూఏఎన్) కేటాయించే విధానాన్ని కిందటేడాది అక్టోబర్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.