Public appearances
-
Deepika Padukone: ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
-
వెలుగులోకి అలీబాబా చీఫ్ జాక్‌మా
బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, అలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా రెండున్నర నెలల తర్వాత ఆన్లైన్ వీడియోలో ప్రత్యక్షమయ్యారు. 50 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో.. తన ఫౌండేషన్ మద్దతు పొందిన టీచర్లకు అభినందనలు తెలియజేశారు. తను రెండున్నర నెలలుగా కనిపించకుండా పోవడానికి, అలీబాబా గ్రూపుపై చైనా సర్కారు నియంత్రణ చర్యల గురించి మా ప్రస్తావించలేదు. ఈ వీడియో చైనా బిజినెస్ న్యూస్, ఇతర పోర్టళ్లలో దర్శనమిచ్చింది. ‘‘జనవరి 20న జరిగిన వార్షిక గ్రామీణ టీచర్ల ఆన్లైన్ కార్యక్రమంలో జాక్‌మా పాల్గొన్నారు’’అంటూ జాక్‌మా ఫౌండేషన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 24న షాంఘై కాన్ఫరెన్స్ సందర్భంగా చైనా నియంత్రణ సంస్థలను జాక్‌మా విమర్శించారు. ఆవిష్కరణలను తొక్కి పెడుతున్నాయని ఆయన ఎత్తిచూపారు. తర్వాత కొన్ని రోజుల్లోనే జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూపు భారీ ఐపీవో ప్రయత్నాలను నియంత్రణ సంస్థలు సస్పెండ్ చేశాయి. వ్యాపార దిగ్గజంగా ఎదిగిన 56 ఏళ్ల జాక్‌మా ఆ తర్వాత నుంచి కనిపించకుండాపోవడంతో.. చైనా కమ్యూనిస్ట్ సర్కారు నిర్బంధించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
నాపై కుట్ర చేస్తున్నారు..
బీరుట్: ఆర్థిక అవకతవకల ఆరోపణలతో జపాన్ నుంచి నాటకీయంగా తప్పించుకున్న ఆటోమొబైల్ సంస్థ రెనో–నిస్సాన్ మాజీ చీఫ్ కార్లోస్ ఘోన్ .. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. నిస్సాన్, జపాన్ ప్రాసిక్యూటర్లు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జపాన్ నుంచి లెబనాన్‌కు పరారైన తర్వాత తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తనపై మోపిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు నిరాధారమైనవని ఆయన చెప్పారు. ‘నేను 17 ఏళ్లుగా సేవలందించిన దేశమే నన్ను బందీగా చేసింది అనిపించింది. న్యాయం సంగతి పక్కనపెడితే అక్కడ కనీసం నా మాట పట్టించుకునే పరిస్థితే లేదు. నా మిత్రులు, కుటుం బంతో ఎలాంటి సంబంధాలు లేకుండా తెంచేశారు. నేను ఏ తప్పూ చేయనప్పటికీ.. తుది తీర్పు కోసం అయిదేళ్లు నిరీక్షించాల్సి ఉంటుం దని లాయర్లు చెప్పారు. దీంతో గత్యంతరం లేక బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాల్సి వచ్చింది‘ అని ఘోన్ పేర్కొన్నారు. -
ఔను... నేనంతే!
సినిమాల్లో తప్ప నయనతార విడిగా కనిపించరు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. యాడ్స్‌లో నటించరు. అప్పుడెప్పుడో ఓ యాడ్‌లో నటించారంతే. పబ్లిక్ దర్శనాలు ఎక్కువ ఇవ్వకపోవడానికి నయనతార కారణాలు నయనతారకున్నాయి. అయితే, ఇలా చేయడం వల్ల నయనతార ఫ్రెండ్లీ టైప్ కాదనీ, గర్వం అనీ, పొగరనీ చాలామంది అనుకుంటారు. ఈ విషయం గురించి నయనతార ప్రస్తావిస్తూ, ‘‘అవును. నేను పొగరుబోతునే! అహంకారిని కూడా! అయితే, నాతో వేళాకోళంగా ప్రవర్తించే వాళ్ల దగ్గరే అలా ఉంటాను. మిగతావాళ్ల దగ్గర అలా ఉండాల్సిన అవసరం నాకేంటి?’’ అన్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషా చిత్రాలతో తెగ బిజీగా ఉన్న ఈ మలయాళ సుందరి తన స్వభావం గురించి ఇంకా చాలానే చెప్పారు. ‘‘నాతో సినిమాలు చేసినవాళ్లకూ, చేసేవాళ్లకూ నేనెంత ఫ్రెండ్లీగా ఉంటానో తెలుసు! నా గురించి నేను ఎక్కువ చెప్పుకుంటున్నానని అనుకోకపోతే ఒక్క మాట. నాది చాలా స్వీట్ నేచర్! షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా ఉంటాను. అందరితోనూ మాట్లాడుతుంటాను’’ అని ఆమె తన వాదన వినిపించారు. ఇన్నీ చెబుతూనే, ఒక్క విషయం కుండబద్దలు కొట్టారు. ‘‘ఏమైనా, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. నాకు మర్యాద ఇస్తే... నేనూ వాళ్ళకు మర్యాద ఇస్తా. ఒకవేళ నా దగ్గర మర్యాదగా నడుచుకోకూడదని ఎవరైనా నిశ్చయించుకుంటే, నా నుంచి కూడా ఇక మర్యాద ఎక్స్పెక్ట్ చేయొద్దు’’ అన్నారు.