Public awareness
-
గిరిజన.. సందీపం
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్.. రుతుస్రావం సమయంలో హైజీనిటీ.. బాల్య వివాహాలు.. గృహ హింస.. ఇలా ఎన్నో అంశాలపై చాలా మందికి అవగాహన ఉండదు. వీటి గురించి కనీసం బయట మాట్లాడటానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం వీటి గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. గ్రామగ్రామానికీ, ఇంటింటికీ, ప్రతి స్కూల్‌కీ తిరుగుతూ వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. డిగ్రీ కుర్రాడు ఈ అవగాహనా కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అందరిలా కురోళ్లలా ఫోన్లు, గేమ్స్ ఆడుకుంటూ ఇన్‌స్టాలో రీల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేయకుండా సామాజిక స్పృహతో సమస్యలపై అవగాహన పెంచుతూ.. పోరాడుతూ ముందుకు సాగుతున్నాడు ఓ డిగ్రీ కుర్రాడు. అతడే నిజామ్ కాలేజీలో బీఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న సందీప్ నాయక్. అతడు చేస్తున్న పనిని మెచ్చి వందలాది మంది సందీప్ వెనుక నడుస్తున్నారు. 15 ఏళ్ల నుంచే.. ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు సమీపంలోని జైతారం తండాలో జన్మించిన సందీప్.. 15 ఏళ్ల వయసు నుంచే సమాజంలోని సమస్యల గురించి తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలను సందర్శించేవాడు. ఎన్నో సవాళ్లతో, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సందీప్.. వాటిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా పాఠశాలల నుంచి పిల్లల డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయని గర్తించాడు. ఈ సమస్యకు వెనుక ఉన్న కారణాల అన్వేషణలో పడ్డాడు. బాల్య వివాహాలు, బాల కారి్మక వ్యవస్థ, లింగ అసమానతలు, గృహ హింస, రుతుస్రావం సమయంలో పరిశుభ్రత, ప్యాడ్స్ వినియోగం లేకపోవడం వంటి సమస్యలు కారణమని గుర్తించాడు. వీటన్నింటినీ రూపుమాపేందుకు, వాటిపై సమాజంలో అవగాహన పెంచేందుకు గొంతెత్తాలని నడుం బిగించాడు. అనుకున్నదే తడవుగా ‘వాయిస్ ఫర్ వెల్ఫేర్’ పేరుతో ఓ ఎన్జీవో స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా పలు సమస్యలపై పోరాడుతున్నాడు.మహిళల గొంతుకగా.. సంస్థ ద్వారా చిన్నారులు, మహిళల గొంతుకగా నిలిచేందుకు కృషి చేస్తున్నాడు. నిజామ్ కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న సందీప్ కార్యకలాపాలకు మెచ్చి తోటి విద్యార్థులతో పాటు తెలిసిన వాళ్లు అతడి వెనుక నడుస్తున్నారు. మారుమూల గ్రామాలు, ప్రాంతాలకు వెళ్లి అక్కడి మహిళలు, చిన్నారులకు ఎన్నో విషయాలపై అవగాహన కలి్పస్తున్నాడు. పాఠశాలలకు వెళ్లి.. చిన్నారులకు చదువు చెబుతున్నాడు. సమాజంలో అసమానతలు తగ్గాలంటే చదువు ఒక్కటే మార్గమని సందీప్ చెబుతున్నాడు. -
దేశానికే యువరాణి.. కాబోయే భర్త కోసం.. రాజభోగాలు విడిచి..
ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు. -
మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త’’
బత్తలపల్లి: ‘‘మాటేసి ఉన్నాం... మాస్క్ లేకుండా బయటకొచ్చారో జాగ్రత్త’’ అంటూ యముడు వేషధారి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఆర్డీటి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాకారులు ఆంజనేయులు, శ్రీరాములు, సుదర్శన్‌లు ప్రజలు కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేశారు. చదవండి: ప్చ్.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా! కరోనా: ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది? -
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్
సాక్షి, గుంటూరు : ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రాణాంతక వైరస్ విజృంభించి, మన దేశంలోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్ అంటే ? కరోనా వైరస్‌ను 1937లో గుర్తించారు. ఈ వైరస్ ఎక్కువగా కోళ్లు, చుంచుఎలుకలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గబ్బిళాల ఊపిరితిత్తుల వ్యాధులకు కరోనా వైరస్ కారణమవుతోంది. కొన్ని రకాల కరోనా వైరస్లు మానవుల్లో కూడా సాధారణ జలుబు, ఫ్లూ ఫీవర్ వంటి స్వల్ప కాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని 1960లో గుర్తించారు. కాలక్రమేణా ఈవైరస్ల్లో ఉత్పరివర్తనలు జరిగి మనిషికి ప్రాణాంతక వైరస్‌లుగా మారాయని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు రకాల హ్యూమన్ కరోనా వైరస్‌లను గుర్తించారు. వీటినే 229 ఈ – ఆల్ఫాకరోనా వైరస్, ఓసీ 43, బీటా కరోనా వైరస్, హెచ్‌కేయూ 1 బీటా కరోనా వైరస్, సార్స్ కరోనా వైరస్, మెర్స్ కరోనా వైరస్, నోవెల్ కరోనా వైరస్‌లుగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనాలోని ఊహన్ నగరంలో విజృంభిస్తున్న వైరస్‌ను నోవెల్ కరోనా వైరస్‌గా గుర్తించారు. శ్వాసకోశ వ్యాధులకు కారణం లాటిన్ భాషలో కరోనా అంటే క్రౌన్ అని అర్ధం. క్రౌన్ లేదా, హేలో ఆకారంలో వైరస్ ఉండటం వల్ల దీనికి ఆపేరు పెట్టారు. ఈవైరస్ మానవుల్లో ఊర్ధ్వ శ్వాసకోశ వ్యాధులకు (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్), జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతోంది. ఈ వైరస్సోకిన వారిలో జలుబు (రన్నింగ్ నోస్), గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. సీతాకాలంలో, వేసవి కాలం ప్రారంభంలో ఎక్కువగా ఈవైరస్ సోకుతోంది. కొందరిలో బ్యాక్టీరియల్ బ్రాంకైటీస్, న్యూమోనియాకు ఈవైరస్ కారణమై ప్రాణాంతకమవుతోంది. 2003లో ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించిన ఈవైరస్ బారిన 8098 మంది పడగా అందులో 774 మంది మృతిచెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2012 సౌదీ అరేబియాలో, మరలా 2013లో సౌదీ అరేబియాలో 124 మందికి వైరస్ సోకి వారిలో 52 మంది మృతిచెందినట్లు గుర్తించారు. 2014లో అమెరికాలో, 2015లో కొరియాలో వ్యాధిని గుర్తించారు. 2019 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాప్తంగా 2,468 కేసులు నమోదు కాగా, వారిలో 851 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వైరస్ ఎలా వ్యాప్తిస్తుంది? హ్యూమన్ కరోనా వైరస్లు వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతాయి. వైరస్ వ్యాప్తి చెందడంలో ముక్కు, నోటి నుండి స్రవించే స్రావాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మడం, దగ్గడం వల్ల వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తిచెందుతోంది. ఆ తుంపరలతో కలుషితమైన దుస్తులు, ఇతర వస్తువులు, కరచాలనం, తాకడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి ప్రవేశిస్తుంది. అరుదుగా మలమూత్రాల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. లక్షణాలు... వైరస్ సోకిన రెండు లేదా మూడు రోజుల్లోనే లక్షణాలు బయలపడతాయి. వ్యాధి లక్షణాలను బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ లక్షణాలుగా విభజించారు. మైల్డ్, మోడరేట్ లక్షణాల్లో ముక్కుల నుంచి స్రావాలు కారడం (రన్నింగ్ నోస్), దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఫ్లూ జ్వరం, కామన్ కోల్డ్ లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్లు శ్వాస నాళాలు, శ్వాస కోశాలకు వ్యాపించినప్పుడు బ్రాంకైటీస్, న్యూమోనియా లక్షణాలు బయటపడతాయి. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, అవయవాలు మార్పిడి చేయించుకున్నవారిలో, క్యాన్సర్, ఎయిడ్స్ బాధితుల్లో, ఎక్కువ కాలం విచక్షణా రహితంగా స్టెరాయిడ్స్ వాడిన వారిలో, ఊపిరి తిత్తుల వ్యాధుల బాధితులు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి మంచినీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. వ్యాధిపై అప్రమత్తతో ఉండి ముఖానికి మాస్క్ ధరించాలి. వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు, కోళ్ల ఫారాలు, జంతు సంరక్షణ శాలలు, కబేళాల దగ్గరకు వెళ్లకూడదు. అనుమానితులకు, ఇతురులకు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా, కర్చీప్ అడ్డుపెట్టుకోవాలి. తరుచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – డాక్టర్ తాతా సేవకుమార్, గుంటూరు -
ప్రజల సహకారంతోనే ఆరోగ్యాంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారాలంటే ప్రజల సహకారం అవసరమని, వైద్య విద్యార్థుల కృషి కూడా కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచడానికి ప్రత్యేకంగా స్వాస్థ్య విద్యా వాహిని కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు సందర్శించిన విద్యార్థులకు ప్రత్యేకంగా మార్కులు వేయాల్సిందిగా ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఉప కులపతిని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు 446 బృందాలుగా ఏర్పడి జనవరి రెండు నుంచి డిసెంబర్ చివరి వరకూ పరిసరాలు..వ్యక్తిగత పరిశుభ్రత, అంటు వ్యాధులు, రక్తహీనత, పునరుత్పత్తి ఆరోగ్యం, సమీకృత ఆహారం, వ్యాయామ అక్షరాస్యత, దీర్ఘకాలిక వ్యాధులు, వ్యసనాల వంటి వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారని చెప్పారు.