Public support
-
అభిమాన నేత కోసం పోటెత్తిన జనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అభిమాన నేత వస్తున్నారని తెలిసి విజయవాడ గాంధీనగర్ జనంతో పోటెత్తింది. అక్రమ కేసులో అరెస్టయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలుసుకొనేందుకు గాంధీనగర్‌లోని జైలు వద్దకు వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు బెజవాడ మొత్తం తరలివచ్చిందా అన్నంతగా జనం వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఉదయం 10 గంటలకే గాంధీనగర్ కిక్కిరిసిపోయింది. దీంతో పోలీసులు జైలు ప్రాంగణానికి అన్ని వైపులా 100 మీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టి ప్రజలను అడ్డుకున్నారు. అయినా అభిమాన నేత వైఎస్ జగన్ వచ్చే వరకు బారికేడ్ల ముందే జనం నిరీక్షించారు. ఆయన జైలు పరిసరాల్లోకి చేరుకోగానే అభిమానులు, మహిళలు జై జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ముందుకురికారు. బారికేడ్లను తోసుకొని జైలు ప్రాంగణానికి నలువైపులా ఉన్న దారుల్లోకి చొచ్చుకొచ్చారు. ఊహించనంతగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, జగన్ అభిమానులు రావడంతో పోలీసులు వారిని నియంత్రించలేక చేతులెత్తేశారు.వైఎస్ జగన్ వాహనంలో నుంచి బయటకు వచ్చి వారందరికీ అభివాదం చేయగానే కేరింతలు కొట్టారు. వంశీతో ములాఖత్ అనంతరం తిరిగి వెళ్లే సమయంలోనూ జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు తోసుకురావడంతో వాహనం ముందుకు కదలడం కూడా కష్టంగా మారింది. ఓ దశలో జగన్ సెక్యూరిటీ కూడా వారిని నియంత్రించడానికి తీవ్రంగా కష్ట పడాల్సి వచ్చింది. వైఎస్ జగన్ వారందరినీ ఓపిగ్గా పలకరిస్తూ ముందుకు కదిలారు. -
జన భాగస్వామ్యంతోనే జల సంరక్షణ
న్యూఢిల్లీ: దేశంలో జల సంరక్షణ విషయంలో కేవలం ప్రభుత్వం తీసుకొనే చర్యలే సరిపోవని, ప్రజలందరి భాగసామ్యంతోనే అది సాధ్యమవుతుందని, ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జల సంరక్షణ ఉద్యమంతో అనుసంధానమైతేనే ప్రజలకు ఇందులోని తీవ్రత, ప్రాధాన్యం తెలుస్తుందని అన్నారు. కార్యక్రమ ఉద్దేశం అర్థమైతే వారు దాన్ని సొంతం చేసుకుంటారని తెలిపారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల తొలి జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, భాగస్వామ్యానికి నీరు ఒక కీలకాంశం కావాలని చెప్పారు. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నీటి పంపకాలపై ముందుగానే దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల మధ్య నడుమ దశాబ్దాలుగా జల వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వాటర్ విజన్–2047’ మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం జలం అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. మనం నిర్దేశించుకున్న సమ్మిళిత లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 25 ఏళ్లలో సాగించబోయే ‘అమృతకాల’ ప్రయాణంలో ‘వాటర్ విజన్–2047’ అనేది అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ శాతం పనులు జల సంరక్షణ దిశగానే జరగాలని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. ప్రజలతోపాటు సామాజిక సంస్థలు, పౌర సంస్థలు సైతం జల సంరక్షణ ఉద్యమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం అంటే దాని అర్థం ప్రభుత్వపరంగా పారదర్శకత తగ్గించడం కాదన్నారు. అలాగే మొత్తం బాధ్యతను ప్రజలపై మోపడం కాదని తేల్చిచెప్పారు. జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి స్థానికంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లాలో అమృత సరోవరాలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ తెలియజేశారు. ఇప్పటికే 25,000 సరోవరాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రతి సరోవరం కనీసం ఎకరం వైశాల్యంలో ఉంటుందని, ఇందులో 10,000 క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయొచ్చని అన్నారు. జల సంరక్షణకు జియో–సెన్సింగ్, జియో–మ్యాపింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు వాడుకోవాలని సూచించారు. టెక్నాలజీ–పరిశ్రమలు–స్టార్టప్‌లను అనుసంధాస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. నమామి గంగా మిషన్ తరహాలో నదుల ప్రక్షాళనకు రాష్ట్రాలు సైతం నడుం బిగించాలని ప్రధానమంత్రి విన్నవించారు. నదుల, జల వనరులను కాపాడుకోవాలన్నారు. ప్రతి రాష్ట్రంలో చెత్త నిర్మూలన, మురుగునీటి శుద్ధి కోసం నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. తాజా నీటిని సంరక్షించుకోవడం, మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడం పర్యావరణానికి చాలా మేలు చేస్తుందని వివరించారు. ‘ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ స్కీమ్’ కింద 70 లక్షల హెక్టార్లకుపైగా భూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. -
68% ప్రజల మద్దతు ఉంటుందన్న టిఆర్ఎస్
-
మీ సహకారంతోనే సాధ్యం
ప్రజల అండతోనే పేదరిక నిర్మూలన: మోదీ * బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతోంది * గరీబీ హఠావోకు ఎంచుకున్న మార్గం సరికాదు * ‘రెండేళ్ల’ సందర్భంగా ఒడిశాలో భారీ సభ బాలాసోర్ (ఒడిశా): దేశంలో పేదరిక నిర్మూలన సాధించేందుకు ప్రజల సహకారం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనించాలన్న మోదీ.. ఒడిశాతోపాటు వివిధ రాష్ట్రాల్లో రాజకీయ మార్పు జరగాలన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఒడిశాలోని బాలాసోర్‌లో గురువారం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. గరీబీ హఠావో అనే నినాదాన్నిచ్చిన ఇందిరాగాంధీపై విమర్శలు చేశారు. ‘గత 40-50 ఏళ్లుగా దేశంలో గరీబీ హఠావో నినాదాన్ని వింటూనే వస్తున్నాం. ఈ నినాదాన్నిచ్చిన వారి ఉద్దేశాలు చెడుగా ఉండకపోవచ్చు. కానీ.. పేదరికం, నిరుద్యోగం విషయంలో వీరు చేపట్టిన ఏ పనులూ ఫలితాన్నివ్వలేదు. వారు ఎంచుకున్న మార్గం సరిగా లేకపోవటమే ఇందుకు కారణం’ అని మోదీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అభివృద్ధికి పర్యాయపదంగా మారిందన్నారు. తను ప్రజలకు జవాబుదారీనన్న మోదీ.. ఎప్పుడైనా నవీన్ పట్నాయక్ (ఒడిశా సీఎం) ప్రజలకు లెక్కలుచెప్పారా? అనిప్రశ్నించారు. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనించండి. వాటితో పోలిస్తే ఒడిశా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ కూడా బీజేపీకి అధికారమివ్వండి’ అని ప్రధాని తెలిపారు. దేశంలో తూర్పు ప్రాంతం కంటే పశ్చిమప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందిందోప్రజలు ఆలోచించాలన్నారు. రుణాలపై పేదల ‘ముద్ర’: చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఉద్దేశించిన ముద్ర పథకం విజయవంతమైందన్న ప్రధాని.. రుణాలను తిరిగి చెల్లించటం ద్వారా పేదలు తమ విశాల హృదయాన్ని చాటుకుంటున్నారన్నారు. ఈ పథకం కింద పేదలకు రూ.50 వేల నుంచి 10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. కాగా, ‘రెండేళ్ల’ ప్రచారంలో భాగంగా.. బీజేపీ ఢిల్లీ విభాగం మోదీ రథాలను ప్రారంభించింది. 5 వేల కొత్త ఐటీఐలు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటిన్నర మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే ఐఐటీల సామర్థ్యాన్ని మరో ఆరు లక్షలు పెంచాలని, 5 వేల కొత్త ఐటీఐలను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. ఈమేరకు గురువారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్ అవసరాలను గుర్తించి సరైన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మోదీ చెప్పారు.ఐఐటీల సామర్థాన్ని ప్రస్తుతమున్న 18.5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.