pull
-
పుల్ అండ్ పుష్ ట్రైన్ అంటే ఏమిటి? ఎక్కడ నడవనుంది?
భారతదేశంలో ప్రస్తుతం రవాణా రంగంలో నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు, నిర్మాణాలు జరుగుతున్నాయి. సాధారణ రైళ్లను ఆధునీకరిస్తున్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. ర్యాపిడ్ రైలు ప్రారంభం కానుంది. బుల్లెట్ రైళ్లకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ భారత్ పుల్ అండ్ పుష్ రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. పుల్ అండ్ పుష్ రైళ్ల నిర్వహణకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయంలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. భారతదేశపు మొట్టమొదటి పుల్-పుష్ రైలును నవంబర్ నెలలో బీహార్ రాజధాని పాట్నా, మహారాష్ట్ర రాజధాని ముంబై మధ్య నడపనున్నారని సమాచారం. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో రైళ్ల వేగంతో పాటు సామర్థ్యాన్ని పెంచడమే రైల్వేల లక్ష్యం. ఈ నేపధ్యంలో పుల్ అండ్ పుష్ రైళ్లను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం పుల్ అండ్ పుష్ రైళ్ల కోచ్‌లు ఈ నెలలోనే సిద్ధం కానున్నాయి. కాగా ఈ రైళ్లను ఎప్పుడు, ఎక్కడి నుంచి నడపాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ రైళ్ల గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. ఈ రైలుకు రెండు ఇంజన్లు అమర్చడం విశేషం. ఈ రైలుకు ముందు ఒక ఇంజన్, వెనుక ఒక ఇంజన్ ఉంటుంది. రైలులో జనరల్, స్లీపర్ క్లాస్‌ల చొప్పున మొత్తం 22 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభంలో ఈ రైలు నాన్-ఏసీగా నిర్వహించనున్నారు. ఈ రైలు కోసం పశ్చిమ బెంగాల్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో ప్రత్యేక కోచ్‌లను సిద్ధం చేశారు. ఈ డబుల్ ఇంజిన్ రైలులో ఒకసారి ఒక ఇంజిన్ మాత్రమే నడుస్తుంది. పుల్ అండ్ పుష్ టెక్నాలజీని ఉపయోగించడం వలన రైలు వేగాన్నిపెంచవచ్చు . అలానే తగ్గించవచ్చు. ఈ టెక్నాలజీ కారణంగా రైళ్ల సగటు వేగం 10 నుంచి 15 శాతం పెరుగుతుందని రైల్వేశాఖ చెబుతోంది. కొన్ని మార్గాల్లో ఈ రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా నడవనుందని తెలుస్తోంది. ఈ రైలుకు ‘వందే జనసాధారణ’ అని పేరు పెట్టవచ్చని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు? మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? -
బాలిక ఉసురుతీసిన పోకిరీలు
అంబేడ్కర్‌నగర్(యూపీ): సైకిల్‌పై వెళ్తున్న బాలికను వేధించేందుకు బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆకతాయిలు ప్రయత్నించారు. దుపట్టాను లాగేయడంతో ఆమె అదుపుతప్పి సైకిల్‌పై నుంచి పడిపోయింది. ఆ వెనుకే మరో యువకుడు ఆమెను బైక్‌తో ఢీకొట్టి చంపేశాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన యూపీలోని అంబేడ్కర్‌నగర్‌లో చోటుచేసుకుంది. బర్హి అయిదిల్పూర్కు చెందిన నయన్శీ పటేల్(17) ఇంటర్ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం సైకిల్‌పై ఇంటికి వెళుతోంది. వేగంగా బైక్‌పై వచ్చిన ఆకతాయిలు ఆమె దుపట్టాను లాగడంతో అదుపుతప్పి కిందపడి పోయింది. ఆ వెనుకే బైక్‌పై వచ్చిన మరో యువకుడు ఆమె మీదుగా బైక్‌ను పోనిచ్చాడు. తీవ్రగాయాలతో బాలిక చనిపోయింది. ఈ అమానుషానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సెహబాజ్, అర్బాజ్, ఫైసల్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఆదివారం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యత్నించారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. మరొకరు పారిపోయేక్రమంలో కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు. సదరు పోకిరీలు తన కూతుర్ని వేధిస్తున్నారంటూ వారం క్రితమే పోలీసులకు తెలిపినట్లు తండ్రి సభజీత్ వర్మ తెలపడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రితేశ్ పాండేను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
భర్తను కత్తి పొడిచి.. పేగులు బయటకు తీయాలని..
మాజీ భర్తను కత్తితో పొడిచి పేగులు బయటకు తీయాలని ప్రయత్నించిన కేసును బుధవారం బ్రిటన్ కోర్టు విచారించింది. వాదోపవాదనల సందర్భంగా బాధితుడు బిలాల్ మహమ్మద్ తన మాజీ భార్య ఆయనను కత్తితో పొడిచి పేగులు బయటకు తీసేందుకు యత్నించిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన బిలాల్ మాజీ భార్య దాల్యా సయీద్ అతన్ని చంపడానికి ప్రయత్నించినట్లు చేసిన వ్యాఖ్యలను ఖండించింది. బిలాల్ తనను రేప్ చేశాడని ఆత్మరక్షణ కోసం అతన్ని పొడవాల్సివచ్చినట్లు కోర్టు జ్యూరీకి తెలిపింది. పాకిస్తాన్ కు చెందిన బిలాల్ మహమ్మద్ చదువుకోవడానికి బ్రిటన్ వచ్చి ఓ రెస్టారెంట్ లో పనిచేసేవాడు. అతన్ని రెస్టారెంట్ లో చూసిన దల్యా ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. కాగా, 2013లో ఇద్దరికి మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బిలాల్ రెండో వివాహం కూడా చేసుకున్నాడు. దల్యా, బిలాల్ లకు జన్మించిన బిడ్డను బిలాల్ పాకిస్తాన్ కు తీసుకుని వెళ్తాడనే భయంతో దల్యా బిడ్డను ఎక్కడ ఉంచాలన్న విషయంపై చర్చించుకోవాలని బిలాల్ ను కోరింది. దీనిపై స్పందించిన బిలాల్ బర్మింహామ్ లోని తన నివాసానికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. ఇంట్లోకి వచ్చి రావడంతోనే దల్యా తనను కౌగిలించుకుని పెదవులు, మెడ, ఛాతీపై ముద్దుపెట్టుకుందని.. ఏం జరుగుతుందో తెలుసుకనే లోపే కత్తితో తన పొట్టలో రెండు మార్లు పొడిచినట్లు మహమ్మద్ జ్యూరీకి వివరించాడు. ఆమెను నవ్వేం చేశావ్? అని ప్రశ్నించగా తిరిగి మరోసారి పొడిచినట్లు తెలిపాడు. దీంతో ఆమె చేతిలో నుంచి కత్తిని లాక్కున్నట్లు చెప్పాడు. ఈ లోగా ఆమె తన పేగులను పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించినట్లు వెల్లడించాడు. దీంతో తాను కత్తిని సోఫా వెనుకకు విసేరేసి ఓ చేత్తో పొట్టను పట్టుకుని ప్రాణభయంతో ఇంట్లో బయటకు పరుగులు పెట్టడానికి ప్రయత్నించగా.. ప్రధాన ద్వారం వద్ద పట్టుకుని ముఖం మీద పెప్పర్ స్ప్రే చల్లినట్లు చెప్పాడు. చివరికి ఎలాగో వేరే ఫ్లాట్ లోకి పరుగెత్తి సాయం కోరి ప్రాణాలు కాపాడుకున్నట్లు వివరించాడు. కేసులో వాదోపవాదనలు విన్న జడ్జి తీర్పును వాయిదా వేశారు.