Punam Raut Dismissal
-
పూనమ్‌పై ప్రశంసలు.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’
Beth Mooney Commnets On Punam Raut dismissal: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్ట్‌లో భారత మహిళా జట్టు బ్యాటర్ పూనమ్ రౌత్ ప్రదర్శించిన క్రీడా స్పూర్తి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. రెండో రోజు భారత్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఆసీస్ బౌలర్ మోలిన్యూక్స్ వేసిన బంతిని పూనమ్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్‌ను తాకి నేరుగా కీపర్ హీలీ చేతిలోకి వెళ్లింది. కీపర్‌తో పాటు ,ఆసీస్ క్రికెటర్లు అందరూ అవుట్ అని అప్పీల్ చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా తాను ఔటయినట్టు నిర్ధారించుకున్న రౌత్ పెవిలియన్ బాట పట్టింది. ఈ సిరీస్‌లో డీఆర్ఎస్ కూడా అందుబాటులో లేదు. అయినప్పటకీ మైదానాన్ని వదిలి వెళ్లి ఆసీస్ క్రికెటర్లను సైతం పూనమ్ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ మాట్లాడుతూ.. ఒక వేళ ఆమె స్ధానంలో నేను ఉంటే అస్సలు గ్రౌండ్‌ని వదిలి వేళ్లేదాన్ని కాదని తోటి ఆటగాళ్లతో మాట్లాడింది. ఈ సంభాషణ అంతా స్టంప్ మైక్రోఫోన్లో రికార్డయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... భారత్ ఆడుతున్న తొలి డే నైట్ టెస్టులో సెంచరీ సాధించి స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన 216 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్‌తో 127 పరుగులు సాధించింది. వర్షంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. Unbelievable scenes 😨 Punam Raut is given not out, but the Indian No.3 walks! #AUSvIND | @CommBank pic.twitter.com/xfAMsfC9s1 — cricket.com.au (@cricketcomau) October 1, 2021 చదవండి: Virender Sehwag: ‘ఇక చాలు... ఈసారి ముంబై అస్సలు పైకి రావొద్దు’ -
మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే..
లార్డ్స్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడిని అధిగమించకపోవడం. ఈ విషయాన్ని కెప్టెన్ మిథాలే అంగీకరించింది. 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి 9 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా పరాజయం పొందింది. ఇక మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ ఓపెనర్ పూనమ్ రౌత్ వికెట్.. 191/3 పటిష్ట స్థితిలో ఉన్న భారత్‌ను ఇంగ్లండ్ బౌలర్ ష్రబ్సోల్ దెబ్బతీసింది. క్రీజులో పాతుకుపోయిన పూనమ్ రౌత్(86)ను 43 ఓవర్లో ష్రబ్సోల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ఉమెన్ సుష్మావర్మ పరుగులేమి చేయకుండా వెనుదిరగడంతో భారత బ్యాట్స్ ఉమెన్లపై ఒత్తిడి పెరిగింది. అయినా వేద కృష్ణమూర్తి(35) క్రీజులో ఉండటం.. దాటిగా బ్యాటింగ్ చేయగల దీప్తి శర్మ బ్యాటింగ్ రావడం.. భారత్ గెలుస్తోందని అందరూ భావించారు. కానీ వేద అనవసర షాట్‌కు ప్రయత్నించి భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో మ్యాచ్ ప్తూర్తిగా ఇంగ్లండ్ వశం అయింది. చివర్లో శిఖా పాండే, దీప్తీ కుదురుగా ఆడినట్లు కనిపించినా అది ఎంత సేపు కొనసాగలేదు. పాండే అనవసర పరుగుకోసం ప్రయత్నించి రనౌట్ అయింది. థర్డ్ డౌన్లో వచ్చే దీప్తీ శర్మను చివర్లో బ్యాటింగ్ పంపడం కూడా భారత్‌ను కొంపముంచింది. ♦ బెడిసి కొట్టిన భారత్ ముందు జాగ్రత్త.. కేవలం విజయానికి 38 పరుగులే కావల్సిన సందర్భంలో దీప్తీని బ్యాటింగ్ పంపించకుండా సుష్మా వర్మ బ్యాటింగ్ రావడం భారత్‌ను కొంప ముంచింది. పూనమ్ రౌత్ వికెట్ అనంతరం దీప్తీ బ్యాటింగ్ వస్తే ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు. అది కాకుండా బ్యాటింగ్‌కు వచ్చిన సుష్మావర్మ డకౌట్ అవడంతో ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో చివర్లో దీప్తీ ఆదుకుంటుందనే భారత్ వ్యూహం.. బెడిసి కొట్టింది.