చల్లని తల్లి గంగమ్మ
పుంగనూరుటౌన్, న్యూస్‌లైన్: గంగజాతర సందర్భంగా పుంగ నూరు జనసంద్రమైంది. ప్యాలెస్‌లో పూజ ల అనంతరం సుందరంగా అలంకరించిన ట్రాక్టర్‌పై రాత్రి 10 గంటల ప్రాంతంలో అమ్మవారిని ఉంచి పట్టణంలోని తేరువీధి, సెంటర్‌లాడ్జి, సుబేధారువీధి, బేస్తవీధి, తూర్పుమొగశాల, కుమ్మరవీధి, కట్టకిందపాళెంవీధి ప్రాంతాల మీదుగా తీసుకొచ్చి సుగుటూరు గంగమ్మ ఆలయంలో అమ్మవారిని కొలువుదీర్చారు. తమిళుల భీకరపోరాట నృత్యాలు, మేళతాళాలు, బాణసంచాలతో పట్టణం మారుమోగింది. సుమారు 8 గంటల సేపు పట్టణంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.
అలాగే పట్టణంలో 8 ప్రాంతాల్లో అష్ట గంగమ్మలకు పూజలు నిర్వహించారు. బజారువీధిలో నడివీధి గంగమ్మ, తూర్పు మొగసాలలో తలుము గంగమ్మ, బాలాజీ థియేటర్ వద్ద మలారమ్మ గంగమ్మ, మైసూర్ బ్యాంకు వద్ద నలగంగమ్మ, బస్టాండులో విరూపాక్షి మారెమ్మ, నల్లరాళ్లపల్లె వద్ద నలగంగమ్మ, కోనేరు వద్ద బోయకొండ గంగమ్మ, నానాసాహెబ్‌పేటలోని నడివీధి గంగమ్మను ఉంచి భక్తులు పూజలు
నిర్వహించారు. విరూపాక్షి మారెమ్మ ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి వేడుకగా ఊరేగించారు.
నేడు భక్తుల సందర్శన
పుంగనూరు ప్యాలెస్ ఆవరణంలోని సుగుటూరు గంగమ్మ ఆలయంలో బుధవారం వేకువజాము నుంచి భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పిస్తారు. ఆలయం వద్ద బ్యారీకేడ్లు నిర్మించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గెరిగెలు తీసుకొచ్చే భక్తులకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగ మ్మ జాతరకు కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివస్తారు.
పెద్దిరెడ్డి మొక్కులు
సుగుటూరు గంగమ్మ జాతర సందర్భం గా ప్రముఖులు ప్రత్యేక పూజలు చేసి, గంగమ్మ చల్లని ఆశీస్సుల కోసం మొక్కు లు చెల్లించుకున్నారు. అమ్మవారికి పూజ లు చేసిన వారిలో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ఎన్.అమరనాథరెడ్డి గంగమ్మకు సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే టీడీపీ నాయకులు శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనీషారెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలు జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, కొం డవీటి నాగభూషణం, ఆవుల అమరేం ద్ర, పూలత్యాగరాజు, రాజేష్, అశోక్‌రా జ్, విశ్వనాధంశెట్టి, నాగరాజారెడ్డి, వెంకటరెడ్డి యాదవ్ కూడా పూజలు చేశారు.