Punjab AAP leader
-
కేజ్రీవాల్ కాబోయే ప్రధాన మంత్రి.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
ఛండీగఢ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా కీలక చర్చ నడుస్తోంది. కాగా, యూపీ, పంజాబ్ ఫలితాలపై ఎక్కువ ఉత్కంఠ నెలకొంది. యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, పంజాబ్‌లో ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ నేత, పంజాబ్ ఎన్నికల సహ ఇన్ఛార్జ్ రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. దేశ ప్రజల ఆశాకిరణమని, దేవుడి దయ, ప్రజలు అవకాశం ఇస్తే కాబోయే ప్రధాన మంత్రి ఆయనే అంటూ కామెంట్స్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తూ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. అయితే, గురువారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాఘవ్ చద్దా కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో తమ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్ తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీని అని తెలిపారు. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్.. ప్రధాన మంత్రి స్థాయిలో హోదాలో కనిపిస్తారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని అన్నారు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి.. పదేళ్లు కూడా కాకపోయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాల వేళ ఆయన ఇలా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
మరో ఆప్ నేత అరెస్ట్
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో నేతను అరెస్ట్ చేశారు. దళిత మైనర్ బాలికపై లైంగికదాడి యత్నం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న పంజాబ్‌కు చెందిన ఆప్ విద్యార్థి విభాగం నాయకుడు హర్దీప్ సింగ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న హర్దీప్ను ఈ రోజు సంగ్రుర్ జిల్లా ధిండ్సా గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హర్దీప్ సన్నిహితుడుగా భావిస్తున్నారు. ఓ ఫొటో స్టూడియో నడుపుతున్న హర్దీప్ వద్దకు ఫొటో తీయించుకునేందుకు వెళ్లగా, తనపై దారుణానికి ప్రయత్నించినట్టు బాధిత బాలిక ఆరోపించింది. కాగా రాజకీయ కుట్రతోనే తనను కేసులో ఇరికించారని హర్దీప్ అన్నాడు. ఆప్ నాయకులపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రేప్ కేసులో ఢిల్లీ ఆప్ నేత సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకుని, పార్టీ నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు అరెస్ట్ కాగా, మరో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆప్ టికెట్ పొందిన దేవ్ మనే అనే నాయకుడు తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించింది. -
ఆప్ నేత వద్దకు అమ్మాయి ఫొటో కోసం వెళ్తే..
చండీగఢ్: వరుస వివాదాలు, కేసులు, తీవ్ర ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. వివాదాల్లో కూరుకుపోతున్న ఆప్ నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. రేప్ కేసులో ఢిల్లీ ఆప్ నేత సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకుని, పార్టీ నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు అరెస్ట్ కాగా, మరో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్‌లోనూ ఆప్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆప్ టికెట్ పొందిన దేవ్ మనే అనే నాయకుడు తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించగా, తాజాగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న విద్యార్థి విభాగం నాయకుడు హర్దీప్ సింగ్‌పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. ప్రస్తుతం హర్దీప్ పరారీలో ఉన్నాడు. సంగూర్కు చెందిన హర్దీప్ తనపై లైంగికదాడికి యత్నించినట్టు ఓ మైనర్ దళిత బాలిక ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంగూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితురాలు తన చెల్లెలితో కలసి పాస్ పోర్టు సైజు ఫొటోలు తీయించుకునేందుకు హర్దీప్ స్టూడియోకు వెళ్లగా.. హర్దీప్ డార్క్ రూమ్‌లో ఆమెపై లైంగికదాడికి యత్నించాడు.ఆమె గట్టిగా అరవడంతో ఆయన అక్కడి నుంచి బయటకుపారిపోయాడు. ఆప్ నేతలు హర్దీప్పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కేజ్రీవాల్ గత ఫిబ్రవరిలో హర్దీప్ గ్రామానికి వెళ్లారు. ఆప్ అగ్రనేతలు కొందరు ఆయన ఇంట్లో బసచేశారు. కేజ్రీవాల్‌తో హర్దీప్ దిగిన ఫొటో బయటకు రావడంతో ఆప్‌లో దుమారం రేపుతోంది. పంజాబ్‌లో ఆప్ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసింది. దీనికి తోడు తాజా కేసులు ఆప్‌కు ఇబ్బందికరంగా మారాయి.