Puri Rath Yatra
-
పూరీలో మాత్రమే జగన్నాథ రథయాత్ర
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్రను ఒడిశాలోని పూరీలో మినహా రాష్ట్రాంలోని మిగిలిన ప్రాంతాల్లో చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. కరోనా విజృంభణతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఈ సందర్భంలో అనుమతులివ్వలేమని తెలిపింది. పూరీ మినహా ఇతరప్రాంతాల్లో రథయాత్రలను అనుమతించేది లేదని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని హైకోర్టు సమర్ధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ‘నాకూ జగన్నాథ రథయాత్రను చూసేందుకు పూరీ వెళ్లాలనే ఉంది. కానీ మనమేమీ నిపుణులం కాము. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఛాన్సు తీసుకోలేము. కావాలంటే యాత్రను టీవీలో చూడొచ్చు. వచ్చే దఫా భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాం’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈనెల 12న పూరీ సహా పలు ప్రాంతాల్లో వార్షిక రథయాత్ర జరగాల్సి ఉంది. -
కనులపండువగా పూరీ రథయాత్రకు అంకురార్పణ
భువనేశ్వర్/పూరీ: శ్రీక్షేత్రంలో భంవురి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జరిగిన పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టారు. జగన్నాథుని రథయాత్ర ఘట్టాలను నిర్ణీత కాలంలో ఓ క్రమపద్ధతిలో ముగించడం ఆనవాయితీ కాగా, శ్రీమందిరం రత్నసింహాసనంపై కొలువైన మూలవిరాట్లకు తొలుత పూజలు చేసి, ఆజ్ఞామాలలు సమర్పించారు. అనంతరం 3 రథాలకు వేర్వేరుగా తయారు చేసిన ఆజ్ఞామాలలను రథ నిర్మాణ ప్రాంగణానికి తీసుకువచ్చిన ప్రధానార్చకుల వర్గం ఇరుసు, చక్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల తర్వాత ఇరుసుకు ఇరువైపులా రెండు చక్రాల చొప్పున అమర్చారు. ఈ ప్రక్రియనే భంవురి ఉత్సవంగా పేర్కొంటారు. దీనినే రథయాత్రలో ప్రధాన భాగంగా కూడా భావిస్తారు. స్థానికంగా అయితే దీనిని చొక్కా డేరా నీతిగా వ్యవహరిచంగా, ఏటా దీనిని కనులపండువగా నిర్వహిస్తుండడం విశేషం. కరోనా విజృంభణ వేళ కూడా కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ శ్రీమందిరం ఆచార వ్యవహారాలకు ఏమాత్రం భంగం కలగకుండా ఉత్సవ ఆద్యంతాలు విజయవంతంగా సాగడం గమనార్హం. -
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
-
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
పూరీ: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైన యాత్రకు లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'రథయాత్ర' లో వైద్యులకు నో లీవ్
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో జూలై 1 నుంచి ఆగస్టు వరకు జరగనున్న పూరీ జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని 280 మంది వైద్యులు, 650 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు అందించనున్నట్టు ఒడిషా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. నబకాలేబర్ గా పిలిచే ఈ పవిత్ర ఉత్సవంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. జగన్నాథ ఆలయం వద్ద స్వామి వారి తోబుట్టువుల పాత ప్రతిమలను మార్చి వాటి స్థానంలో కొత్త దేవతల ప్రతిమలు ప్రతిష్ఠించి ఈ ఉత్సవాలు చేసుకుంటారు. ఈ ప్రతిమల ఊరేగింపు కార్యక్రమం జూలై 18న జరగనుంది. రథయాత్ర ఊరేగింపులో భక్తులకు సౌకర్యార్థం అత్యవసర చికిత్స అందుబాటులో ఉండేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైద్యులకు, పారామెడికల్ వైద్యసిబ్బందికి సూచనలు చేసింది. ఎవరైనా దీనికి రాలేమని చెబితే.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అత్ను సబ్యాషి నాయక్ మీడియాకు వెల్లడించారు. ఈ విషయంలో ఒడిషా ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించనుంది. ఈ యాత్ర సమయంలో వైద్యులకు సెలవులు మంజూరు చేయబోమంటూ తేల్చిచేప్పేసింది. ఏదైనా అత్యవసరమైతే తప్ప వైద్యులకు సెలవులు మంజూరు చేస్తామని, దానికి కూడా వైద్య కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. రథ యాత్ర జరిగే ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకూ వైద్యల కొరత లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల వైద్యులను కూడా రప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రథయాత్రకు 50 లక్షల మంది వరకు భక్తులు తరలిరానున్నట్టు ఒడిషా ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
పూరీజగన్నాధుని రథయాత్ర