
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
పూరీ: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైన యాత్రకు లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.