పురుషోత్తంనాయుడు మళ్లీ ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:ఏపీ ఎన్జీవోల సంఘం ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షునిగా పి.అశోక్‌బాబు, సహ అధ్యక్షునిగా చౌదరి పురుషోత్తంనాయుడు మళ్లీ ఎన్నికయ్యారు. వీరి ఎన్నికపై జిల్లా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో మరోసారి వీరు విజయం సాధించడం సంతోషంగా ఉందని సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, కార్యవర్గ సభ్యులు అన్నారు.