purvavaibhavam
-
అడవుల విస్తీర్ణంతో జిల్లాకు పూర్వవైభవం
భావితరాల మేలు కోసం మొక్కలు నాటాలి సింగరేణి హరితహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మణుగూరు : అడవుల విస్తీర్ణంతో జిల్లాకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సింగరేణి ఆధ్వర్యంలో మణుగూరులో నిర్వహించిన హరితహారంలో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో అడవుల పెంపకంలో జిల్లా దేశంలోనే చెప్పుకోదగిన స్థాయిలో ఉండేదని ఉమ్మడి రాష్ట్రంలోనూ అటవీ విస్తీర్ణంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు, కొందరు స్మగ్లర్లు, స్వార్థపరుల కారణంగా అడవులు తగ్గిపోయాయన్నారు. తిరిగి అడవులు పెంచేందుకు ప్రజలందరి సహకారం అవసరమన్నారు.భావితరాల మేలు కోసం ప్రతి విద్యార్థి మొక్క నాటేలా ఆసక్తి కల్పించాలన్నారు. అడవులు ఉంటే అడవి బిడ్డలైన గిరిజనులకు అన్నిరకాలుగా మేలు చేసినట్లేనన్నారు. సింగరేణి మణుగూరు ఏరియాలో ఒకేసారి పదిహేను వేల మొక్కలు నాటేలా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ మనోహర్‌రావు, ఏరియా సీజీఎం మాదాసి మల్లేష్, ఎస్వోటూ సీజీఎం నారాయణ, ఓసీ ప్రాజెక్టు అధికారి టీవీ.రావు, ఆర్డీఓ రవీంద్రనాథ్, ఎంపీపీ చిడెం అంజమ్మ, జెడ్పీటీసీ దుర్గ, తహసీల్దారు తిరుమలాచారి, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, ఎంపీడీఓ పురుషోత్తం, ఐసీడీఎస్ సీడీపీఓ సుబ్బలక్ష్మి, టీబీజీకేఎస్ నాయకుడు సామా శ్రీనివాసరెడ్డి, ఎక్స్లెంట్, శ్రీవిద్య పాఠశాలల కరస్పాండెంట్లు యూసుఫ్‌షరీఫ్, నూకారపు రమేష్ చౌదరి, టీఆర్ఎస్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్, పాయం నర్సింహారావు, ముత్యంబాబు, ఉడుముల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
‘చంద్రన్న కానుక’లతో సంక్రాంతికి పునర్వైభవం
ప్రారంభోత్సవ కార్యక్రమంతో మంత్రి పరిటాల సునీత అనంతపురం సెంట్రల్ : సంక్రాంతి పండుగకు పూర్వవైభవం తీసుకురావడానికే ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. సోమవారం స్థానిక కృష్ణకళామందిరంలో చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరుస కరువు కాటకాలతో సంక్రాంతి పండుగ కళ తప్పుతోందన్నారు. పండుగ చేసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భావించి నిత్యవసర సరుకులు అందజేయాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని తెలిపారు. సరుకుల పంపిణీలో డీలర్లు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో పెనుకొండ దుర్ఘటన బాధాకరమన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు కోటి రూపాయలు, తిరుపతిలో ముఖ్యమంత్రి పాల్గొంటున్న దృష్ట్యా అదనంగా మరో కోటి, సచివాలయంలో వేడుకలు నిర్వహణకు రూ. 2లక్షలు చొప్పున మొత్తం రూ. 14.02 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల సమయంలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ చమన్, నగరపాలక సంస్థ మేయర్ స్వరూప, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, ఈరన్న, ఉన్నంహనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, డెప్యూటీ మేయర్ గంపన్న, ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం, సివిల్ సప్లై రాష్ట్ర డైరక్టర్ రవిబాబు, జిల్లా మేనేజర్ వెంకటేశం, ఆర్డీవో ఉస్సేన్సాహేబ్ పాల్గొన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే టీడీపీ లక్ష్యం : ఎంపీ జేసీ తాడిపత్రి టౌన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ ధ్యేయమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్లో సోమవారం చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలు పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సరుకులను పంపిణీ చేస్తోందన్నారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. చాగళ్లు రిజర్వాయర్‌కు నీళ్లు తెప్పించేందుకు ప్రత్యేక కాలువ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇన్చార్జి తహశీల్దార్ రమాదేవి మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో 26,652 మందికి, రూరల్ పరిధిలో 13,637 మందికి సరుకులు పంపిణీ చేయనున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జిలానీబాషా, రెవెన్యూ డీటీ రాజశేఖర్ , డెప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐలు మల్లేసు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీకి పూర్వవైభవం తెస్తాం
మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న పరిస్థితుల్లో తాను ఖమ్మం ఎంపీగా విజయం సాధించడంతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించామని, ఈ స్ఫూర్తితో రాష్ర్టంలో వైఎస్ఆర్ సీపీకి పూర్వవైభవం తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సోమవారం జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వలసలకు పేరొందిన పాలమూర్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం అధికారంలో ఉన్న పాలకులు వాటిని పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశించారని, కానీ ఆర్నెళ్ల కాలవ్యవధిలోనే కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నదని విమర్శించారు. 8 గంటలపాటు కరెంట్ ఇస్తామని ప్రజలను నమ్మించిన కేసీఆర్, మరో మూడేళ్లదాకా కరెంట్ కష్టాలు ఇలాగే ఉంటాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేశాం పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచీ జిల్లాలో చురుగ్గా పనిచేస్తున్నామని, రాష్ట్ర పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశామని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, సీజీసీ సభ్యుడు ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. షర్మిలమ్మ జిల్లాలో చేపట్టిన మరోప్రస్థానం పాదయాత్రను చరిత్రలో కనివినీఎరుగని రీతిలో జయప్రదం చేశామని, కల్వకుర్తి నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో చనిపోయిన ఓ రైతు కుటుంబానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పిలిపించి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించామని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోకపోతే ప్రజలపక్షాల పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. అదే సందర్భంలో అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. -ఎడ్మ కిష్టారెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిన వైఎస్ పార్టీ శ్రేణులు నిస్తేజంగా ఉన్నారని విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ సమావేశానికి వచ్చిన జనాన్ని చూస్తే ప్రజల గుండెల్లో వైఎస్ ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర నేత నల్లా సూర్యప్రకాశ్‌రావు అన్నారు. జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకుని ఒరగబెట్టిందేమిలేదన్నారు. ఇక్కడినుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా జిల్లా అభివృద్ధికి ఏమీచేయడం ఏదన్నారు. -సూర్యప్రకాశ్‌రావు జిల్లాలో పార్టీ బలంగా ఉంది వేలాదిమంది అ భిమానులు సమావేశంలో పాల్గొనడాన్ని చూస్తే జిల్లాలో పార్టీ బలంగా ఉందనే విష యం తెలుస్తుందని పార్టీ రాష్ట్ర నేత జనక్‌ప్రసాద్ అన్నారు. ప్రజల కష్టాలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం వల్లే పార్టీ చెక్కుచెదరలేదన్నారు. ప్రజాసమస్యలపై చర్చించడానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని, సీఎంకు ఇవ్వడానికి వెళ్తే అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. సీఎంను మరోసారి కలవడానికి ప్రయత్నిస్తామని అప్పటికీ స్పందించకపోతే ఆయన క్యాంపు ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని తేల్చిచెప్పారు. -జనక్‌ప్రసాద్ ఎలక్షన్లు, కలెక్షన్లే కేసీఆర్ ధ్యేయం మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచిన కేసీఆర్ కనిపించడం లేదని జిల్లా ప్రజలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి హెచ్ఎ.రహెమాన్ అత్తాస్ గుర్తుచేశారు. ఎలక్షన్లు, కలెక్షన్లు, కన్స్ట్రక్షన్లు ధ్యేయంగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన బూటకమన్నారు. -రహ్మాన్ ప్రత్యర్థి పార్టీల నోళ్లు మూతపడక తప్పదు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ లేదని పలుపార్టీల నాయకులు విమర్శించారని, సమావేశానికి వచ్చిన జనాన్ని చూసి వారి నోళ్లు మూతపడక తప్పదని రాష్ట్ర నేత గట్టు రాంచందర్‌రావు అన్నారు. స్వార్థం కోసం కొంతమంది లీడర్లు పార్టీని వీడినప్పటికీ క్యాడర్ మాత్రం చెక్కుచెదరకుండా ఉందన్నారు. జిల్లాలో 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 157 మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జిల్లా పార్టీకి, కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డికే దక్కిందన్నారు. అభద్రతా భావంతో ఇతర పార్టీల్లోకి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు తిరిగి పార్టీలోకి రావాలన్నారు. -గట్టు రాంచందర్‌రావు సమావేశంలో తీర్మానాలివే.. వ్యవసాయ అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలి. వర్షాభావ పరిస్థితులు సక్రమంగా లేనందున కరువు జిల్లాగా ప్రకటించి పంట నష్టపరిహారం, కరువు సహాయం అందించాలి. రబీసీజన్‌లో ఏడుగంటలపాటు కరెంట్‌ను సరఫరా చేసిఙ రైతులను ఆదుకోవాలి. కబేళాలకు తరలిపోతున్న పశుసంపదను ఆదుకోవడానికి {పభుత్వం ఉచితంగా పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలి. వృద్ధాప్య పింఛన్ల వయస్సును 60 ఏళ్లకు కుదించాలి. ఉపాధి హామీ పథకాన్ని అమలుచేసి గ్రామీణప్రాంతాల్లో రైతు కూలీలకు పని కల్పించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించి విద్యార్థుల్లో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టాలి. జిల్లాలో జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు సమకూర్చి వాటిని వెంటనే పూర్తిచేయాలి జిల్లాను ఎడారిగా మార్చే జూరాల-పాకాల పథకాన్ని రద్దు చేయాలి