pushkarini
-
మంగళగిరిలో 500 ఏళ్ల నాటి పుష్కరిణికి పూర్వవైభవం..
-
పుణ్య స్నానాలు చేస్తూ..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయప్రాంగ ణంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గండి చెరువు వద్ద ఉన్న లక్ష్మీ పుష్కరిణిలో మునిగి ఒక బాలిక మృతి చెందింది. స్థానికులు, మృ తురాలి కుటుంబ సభ్యులు తెలిపి న వివరాలివి. హైదరాబాద్‌లోని మల్కా పూర్‌కు చెందిన బొంతల రోజా (15) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం యాదాద్రీశుడి దర్శనానికి వచ్చింది. మధ్యాహ్నం లక్ష్మీ పుష్కరిణిలో స్నానం చేస్తుండగా రోజా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి రోజాను కాపాడే ప్రయత్నం చేశారు. భక్తులు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ వచ్చేటప్పటికి బాలిక మృతి చెందింది. ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు భక్తులు, పోలీసులు భావిస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణ పోలీసులు మృతదేహాన్ని పుష్కరిణి నుంచి బయటకు తీశారు. ఆలయ సిబ్బంది పుష్కరిణిలో నీటిని తరలించి సంప్రోక్షణ చేశారు. -
మూసీపై ప్రభుత్వం ప్రగల్భాలు
సాక్షి, వికారాబాద్: మూసీ నది ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందే తప్ప, ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన గంగానది ప్రక్షాళన స్ఫూర్తితో మూసీ నది ప్రక్షాళనకు ఉద్యమం ప్రారంభించామని తెలిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని మూసీ జన్మ స్థలం వద్ద శనివారం ప్రత్యేక పూజలు చేసి ‘నమామి మూసీ’పేరిట పోరాటాన్ని ప్రారంభించారు. నదికి హారతి ఇచ్చిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ, మూసీ ప్రవహించే ఐదు జిల్లాల్లో ప్రక్షాళన కార్యక్రమం జరిగే వరకు బీజేపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు. ఇందులో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల మూసీ నది కాలుష్య కాసారంగా మారిందన్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని నదిలోకి వదలడంతో పాటు డ్రైనేజీ నీరు కలిసి కంపుగా మారిందని తెలిపారు. 16న బాపూఘాట్, ఆ తర్వాత సూర్యాపేటలో మూసీ ప్రక్షాళన కోసం ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. శనివారం అనంతగిరిలో పుష్కరిణిలో పూజలు చేస్తున్న లక్ష్మణ్ తదితరులు -
ఖాళీగానే కొత్త పుష్కరిణి !
కొండగట్టు(చొప్పదండి): భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న కొండగట్టు అంజన్న కొండపై అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. రూ.1.21కోట్లతో నిర్మించిన కొత్త పుష్కరిణిలో నీళ్లు లేక పాత కోనేరులోనే భక్తులు స్నానాలు చేస్తున్నారు. మరికొందరైతే తాగునీటి నల్లా వద్ద మగ్గులతో పట్టుకొని స్నానాలు కానిచ్చేస్తున్నారు. ఇదంతా అధికారులు చూస్తున్నా కొత్త పుష్కరిణిలో నీళ్లు నింపేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కోట్లు వెచ్చించి నిర్మించినా మూడేళ్లుగా నిరుపయోగంగానే పడి ఉంటుంది. నల్లాలే దిక్కు కొండగట్టులో నూతన పుష్కరిణిని ప్రారంభించకపోవడంతో భక్తులు పాత కోనేరుతోపాటు తాగునీటి నల్లాల వద్ద స్నానాలు చేస్తున్నారు. మరికొందరు సమీపంలో టెండరు స్నానాల గదుల్లోకి వెళ్తున్నారు. అంతేకాకుండా పాత కోనేరులోనైనా నీటిని ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. దీంతో కొన్ని రోజులుగా అందులో నీరు మురికిగా మారింది. అయినా అధికారులు స్పందించడం లేదు. కొత్త కోనేరు ప్రముఖులకేనా? కొత్త కోనేరును వినియోగంలోకి తెచ్చేందుకు నీటి సమస్య ఉందంటున్న అధికారులు ప్రముఖులు వస్తే మాత్రం ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భక్తులకు పాత కోనేరు..ప్రముఖులకు కొత్త కోనేరు రీతిన వ్యవహరించడంపై ఆలయ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. చిన్నచూపు అంజన్న ఆలయంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. ఎంపీ కవిత ఆలయ అభివృద్ధికి చెప్పిన మాటలు నీటిమూటలుగా మారాయి. యాదాద్రి, వేములవాడ తరహాలోనే కొండగట్టును అభివృద్ధి చేయాలి. రూ.500కోట్లు కేటాయించి, ఐఏఎస్ అధికారిని నియమించాలి. – మేడిపెల్లి సత్యం, కాంగ్రెస్ నాయకుడు గత ప్రభుత్వంలోని అభివృద్ధే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధే. ప్రస్తుతం ఎలాంటి పనులు చేయలేదు. కనీసం కొత్త కోనేరులో నీరు సైతం నింపడం లేదు. ఆదాయం పెరుగుతున్నా భక్తులకు కనీస అవసరాలు తీర్చడం లేదు. ఇప్పటికైనా పాత కోనేరులో నీరు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. – గాజుల శంకర్‌గౌడ్, ఆలయ మాజీ పాలకవర్గం డైరెక్టర్ -
శ్రీవారి పుష్కరిణికి ఏగతి..!
–మురికికూపంలా నృసింహ సాగరం –ఆవేదనలో భక్తులు ద్వారకా తిరుమల : శ్రీవారి క్షేత్రంలో పుష్కరిణి అధ్వానంగా మారింది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ నృసింహ సాగరం ప్రస్తుతం మురికికూపంగా తయారైంది. పూర్వం ఈ నృసింహ సాగరాన్ని శ్రీవారి కైంకర్యాలకు వినియోగించేవారు. రోజు స్వామివారికి తీర్థపు బిందెను ఈ కోనేరు నుంచే అర్చకులు తీసుకెళ్లేవారు. కాల క్రమేణా ఆ ఆచారం మరుగునపడింది. భక్తులు మాత్రం ఇప్పటికీ స్నానాలు చేసేందుకు ఇక్కడకు వస్తున్నారు. ఏటా వినాయకుని విగ్రహాల నిమజ్జనాలను ఈ చెరువులోనే చేస్తారు. అలాగే పత్రి, ఇతర పూజా సామగ్రిని గ్రామస్తులు ఈ పుష్కరిణిలోనే కలుపుతారు. ఈ ఏడు కూడా భక్తులు వీటిని పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. దీంతో చెత్తాచెదారం కోనేరు ఒడ్డుకు చేరడంతో ఆ ప్రాంతమంతా మురికిమయంగా మారింది. కోనేరులో కాలు పెట్టేందుకు కూడా వీలు లేనంతగా తయారైంది. అట్ల తద్దినాడు స్నానాలు ఆచరించేందుకు వచ్చిన పలువురు మహిళలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి పుష్కరిణిని శుభ్రం చేయించి మోక్షం కలిగించాలని భక్తులు కోరుతున్నారు. -
పుష్కరాల్లో సీసీ కెమెరాలలతో నిఘా
-
పుష్కరిణిలో పడి నలుగురు గల్లంతు
-
తిరుపతిలో విషాదం.. నలుగురి మృతి
తిరుపతి : చిత్తూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. తిరుపతిలోని కపిలతీర్థం పుష్కరిణిలో పడి నలుగురు భక్తులు గల్లంతయ్యారు. తిరుమల, తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జలపాతంలోకి భారీగా వరద నీరు రావడంతో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పుష్కరణిలో గల్లంతయిన వారిలో ముగ్గురి మృతదేహాలు వెలికితీశారు. మరో వ్యక్తి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను శ్రీకాంత్, వెంకటేశ్, లోహిత్ గా గుర్తించారు. ఓ పదిహేనేళ్ల పాప కూడా గల్లంతయిందని సమాచారం. మృతులంతా తిరుపతి చంద్రశేఖర్ రెడ్డి కాలనీకి చెందిన వారుగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.