
తిరుపతిలో విషాదం.. నలుగురి మృతి
తిరుపతి : చిత్తూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. తిరుపతిలోని కపిలతీర్థం పుష్కరిణిలో పడి నలుగురు భక్తులు గల్లంతయ్యారు. తిరుమల, తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జలపాతంలోకి భారీగా వరద నీరు రావడంతో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పుష్కరణిలో గల్లంతయిన వారిలో ముగ్గురి మృతదేహాలు వెలికితీశారు. మరో వ్యక్తి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను శ్రీకాంత్, వెంకటేశ్, లోహిత్ గా గుర్తించారు. ఓ పదిహేనేళ్ల పాప కూడా గల్లంతయిందని సమాచారం. మృతులంతా తిరుపతి చంద్రశేఖర్ రెడ్డి కాలనీకి చెందిన వారుగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.