pushpa kumari
-
కళ: అమెరికాలో పుష్పవిలాసం
కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... మాన్హాటన్ (యూఎస్) 86 స్ట్రీట్‌లోని బస్‌షెల్టర్‌లో కనిపించిన ఒక చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ కళాప్రేమికులు, ఆధునిక కళాప్రేమికులు... ఇద్దరూ ఇష్టపడే చిత్రం అది. ‘జాయ్ ఆఫ్ లివింగ్’ అనే ఆ చిత్రాన్ని గీసింది మన ఇండియన్ ఆర్టిస్ట్ పుష్పకుమారి. గత రెండు సంవత్సరాల కరోనా కల్లోల చీకటిని వస్తువుగా తీసుకొని, ఆశావాద దృక్పథాన్ని ప్రతిఫలించేలా గీసిన చిత్రం అది. అమెరికాకు చెందిన ‘పబ్లిక్ ఆర్ట్ ఫండ్’ అనే నాన్–ప్రాఫిట్ ఆర్గనైజేషన్ న్యూయార్క్, బోస్టన్, షికాగోలలో పుష్పకుమారి చిత్రప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ చిత్రాలను సాధారణ కళాప్రేమికుల నుంచి చేయి తిరిగిన చిత్రకారుల వరకు ప్రశంసిస్తున్నారు. పేరులోనే ‘కళ’ ధ్వనించే మధుబని (బిహార్) జిల్లాలోని రంతి అనే గ్రామంలో పుట్టింది పుష్ప కుమారి. రంతి అనేది ఊరు అనడం కంటే ‘ఊరంత బడి’ అనడం సమంజసం. ఎటు చూసినా ఆబాలగోపాలం చేతిలో మధుబని మధుర కళావిన్యాసాలే! పుష్ప అమ్మమ్మ మహాసుందరిదేవి మధుబని ఆర్ట్‌ను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లిన తొలితరం కళాకారుల్లో ఒకరు. అమ్మమ్మ ఒడిలో ఆర్ట్పాఠాలు నేర్చుకుంది పుష్ప. పదమూడేళ్ల వయసులోనే కుంచె పట్టిన పుష్ప కాలంతో పాటు తన కళను మెరుగు పరుచుకుంటూ వస్తోంది. మొదట్లో అందరూ గీసినట్లే తాను గీసేది. తరువాత కాలంలో మాత్రం తనదైన ప్రత్యేకత గురించి ఆలోచించింది. ‘సింబాలిజం’ను సంప్రదాయ కళలోకి తీసుకురావడం ఒకింత కష్టమైన పని. అయితే ఆ కష్టం పుష్ప చిత్రాలలో కనిపించదు. దీనికి కారణం సింబాలిజంను సృజనాత్మకంగా మధుబనిలోకి తీసుకురావడమే. అమ్మమ్మ కుంచె నుంచి అందమైన చిత్రాలను నేర్చుకోవడమే కాదు, ఆమె నోటి నుంచి పురాణాలు, జానపద కథలు ఎన్నో విన్నది పుష్ప. అవేమీ వృథా పోలేదు. తన కళకు ఇంధనంగా పనికి వచ్చాయి. పుష్ప కళాప్రపంచంలో కేవలం కళ మాత్రమే కనిపించదు. సమాజం కూడా కనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే సంప్రదాయ కళ అనే పునాది మీద తనదైన దృశ్యభాషను సృష్టించుకుంది పుష్ప. సామాజిక,రాజకీయ సమస్యలు, జెండర్ సమస్యలు, పర్యావరణ సంబంధిత అంశాలను కేంద్రంగా చేసుకొని చిత్రాలు గీస్తుంది పుష్ప. నాగరికత అనే పేరుతో భూమాతను ఎంత హింస పెడుతున్నామో ‘ఎర్త్–2’ చిత్రంలో కనిపిస్తుంది. ఇటీవల కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని గీసిన చిత్రాలకు మంచి స్పందన లభించింది. ‘నేను గీసే ప్రతి చిత్రానికి తనదైన భావవ్యక్తీకరణ ఉండేలా చూసుకుంటాను’ అంటుంది పుష్ప. బోల్డ్ స్ట్రైకింగ్ ఫిగర్స్ గీయడంలో దిట్ట అనిపించుకున్న పుష్ప చిత్రాలలో రంగుల ఆర్భాటం కనిపించదు. సాదాసీదా ఇంక్బాటిల్నే ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. ‘చిత్రాలు మౌనంగా కనిపిస్తాయి. కాని ఆ మౌనంతోనే అవి మనతో మాట్లాడేలా చేయడం ఆర్టిస్ట్ విశిష్ఠత’ అని చెబుతారు విశ్లేషకులు. పుష్పకుమారి గీసిన చిత్రాలను చూస్తే... అవి మౌనంగా మాట్లాడే చిత్రాలు అనే విషయం కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది. -
గజ్వేల్‌లో మహిళ హత్య
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ పట్టణంలో సోమవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గజ్వేల్-తూప్రాన్ రహదారిని ఆనుకుని ఉన్న ఇంట్లో, ఎప్పుడూ జనం రద్దీగా ఉండే ప్రదేశంలో.. ఉదయం వేళే ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. దుండగులు కత్తులతో పాశవికంగా దాడి చేసి రక్తపు మడుగులో పడేసి వెళ్లిపోయారు. ఉపాధి కోసం సుమారు పదిహేనేళ్ల కిందట భర్తతో కలిసి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన ఆ మహిళ గుర్తుతెలియని దుండగుల చేతిలో హతమవడం, ఆ కుటుంబంలో తీరని శోకం అలుముకుంది. వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌లోని మర్వాడీ ప్రాంతానికి చెందిన బుధేరామ్ తన భార్య పుష్పకుమారి(33)తో కలిసి సుమారు 15 ఏళ్ల క్రితం గజ్వేల్‌కు ఉపాధి కోసం వలస వచ్చాడు. పట్టణంలో గణేష్ పాన్ బోకర్స్ పేరిట మార్కెట్ రోడ్డులో బంగారం తాకట్టు దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తూప్రాన్ రోడ్డు వైపున వీరు ఓ ఇల్లును అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. వీరికి స్వప్న(8), వసుంధర(6), హేమంత్(2) ముగ్గురు సంతానం. స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో స్వప్న నాలుగో తరగతి, వసుంధర 2వ తరగతి చదువుతున్నారు. రోజూలాగే సోమవారం పుష్పకుమారి తన కూతుళ్లను ఉదయం 9.30 గంటలకు పాఠశాల వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చింది. భర్త బుధేరామ్ అప్పటికే దుకాణానికి వెళ్లిపోయాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో కత్తిపోట్లకు గురై పుష్పకుమారి రక్తపు మడుగులో పడిఉంది. బుదేరామ్ దుకాణం నుంచి ఇంటికి బంగారు ఆభరణాలను తీసుకెళ్లడానికి రాగానే ఈ దృశ్యాన్ని చూశాడు. విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారమందించారు. వెంటనే స్థానిక సీఐ అమృతరెడ్డి, ఎస్ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి సందర్శించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాలను సేకరించారు. మహిళ శరీరంపై ఏడు వరకు కత్తిపోట్లు ఉన్నాయి. కాగా ఇంట్లో బంగారు ఆభరణాలను భద్రపరిచే బాక్స్‌ను పగులగొట్టి వెండి పట్టీలు, కొంత బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. దోపిడీ దొంగల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ కదలికలను క్షుణ్ణంగా తెలుసుకుని దుండగులు హతమార్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఆ మహిళను చలి నుంచి రక్షణ కోసం కట్టుకునే గుడ్డతో ఉరివేయడానికి ప్రయత్నించిన హంతకులు ఆమె అలికిడి చేయడంతో కత్తితో హతమార్చినట్లు సంఘటనతీరును బట్టి తెలుస్తోంది. గత అక్టోబర్ 9న గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలో జంట హత్యల ఘటన మరువకముందే ఈ దారుణం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ‘అమ్మ’ కోసం చిన్నారుల రోదన... తమను రెడీ చేసి స్కూలుకు పంపిన ‘అమ్మ’ మరో గంటలోపే విగత జీవిగా మారడంతో చిన్నారులు స్వప్న, వసుంధర, హేమంత్ రోదించడం చూపరులను కంటతడిపెట్టించింది. ‘మా’కు క్యా హువా.. అంటూ గుక్కపెట్టి ఏడ్చారు. ‘ఖల్సే స్కూల్‌కు కోన్ బేజ్తే’...అంటూ బంధువులతో దుఃఖించారు.