అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి అర్బన్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మంగళవారం విద్యార్థులునిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈసందర్భంగా విద్యార్థులు గోకులం నుంచి అందంగా తయారు చేసిన గోవులకు సిల్క్ దుప్పట్ట కప్పుకొని ప్రశాంతి నిలయానికి తీసుకువచ్చి సేవ చేశారు. ట్రస్టు సభ్యులు వాటికి గడ్డి, పండ్లు, కాయలు తినిపించారు. అదేవిధంగా గోశాలలో పెంచుతున్న జింకలు, నెమలి, కుందేలు, పావురాలు తదితర పక్షులు, జీవాలకు పాలు తాగించడం, పండ్లు తినిపించడం చేశారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మధురాష్టకం, చల్లగాలిలో యమున తాటిపై, జగదానందకర, భవమీయ గోపాలబలం అంటూ సాగే సంగీతాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. 5000 ఏళ్ల నాటి నుంచి శ్రీకృష్ణుడు చేసిన లీలా వినోదాన్ని నాటక రూపంలో ప్రదర్శించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు, ఆశ్రమం సీనియర్లు, బాబా భక్తులు పాల్గొన్నారు.