వరదల్లో 200 మంది మృతి
బోగోటా(కొలంబియా): పుటమయో ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి సుమారు 200 మంది మృతిచెందారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందల కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. సుమారు 25 ఇళ్లు పూర్తి ధ్వంసమయ్యాయి.
శుక్రవారం రాత్రి ఒక్క రోజే 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం వల్ల ఆ ప్రాంతంలో నదులు పొంగి ప్రవహిస్తోన్నాయి. కొన్ని చోట్ల కార్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో కొలంబియా ప్రెసిడెంట్ జువన్ మాన్యుల్ సాంటోస్ ఎమర్జెన్సీని ప్రకటించాడు.