Pylon construction
-
రోడ్డుకి అడ్డంగా కట్టేశారు
సాక్షి, సింగరాయకొండ(ప్రకాశం): మండల తెలుగుదేశం పార్టీలో కందుకూరు రోడ్డు సెంటర్లో నడిరోడ్డులో నిర్మించిన పైలాన్ నిర్మాణం వివాదానికి ఆజ్యం పోసింది. మండలంలో రూర్బన్ పథకం కింద ఏడు గ్రామాల్లో సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ప్రజలకు తాము చేసిన అభివృద్ధి తెలియజేసేందుకు నడిరోడ్డులో పైలాన్ నిర్మించారు. అయితే ఈ పైలాన్ నిర్మాణంతో తాము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియజేయటమే కాక రానున్న ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా పనికి వస్తుందని భావించారు. దీంతో ఆఘమేఘాల మీద ఆర్అండ్బీ స్థలంలో నడిరోడ్డులో ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా పైలాన్‌ను నిర్మించారు. అనుకొన్నదొకటి అయింది మరొకటి అన్న చందంగా పైలాన్ నిర్మాణం టీడీపీలో ముసలాన్ని రాజేసింది. ఈ పైలాన్‌లో జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో గ్రామంలోని టీడీపీ నాయకుల పేర్లు వేశారు. అయితే మండల పార్టీ అధ్యక్షుడు తన పేరు వేయకపోవడంతో తనను, తన వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని వేల్పుల సింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారని, అంతేకాక పైలాన్ పైభాగంలో శ్రీ కృష్ణుని విగ్రహం ఏర్పాటు చేద్దామని కూడా మరో ప్రతిపాదన తెచ్చారన్న ప్రచారం సాగింది. అయితే ఈ ప్రతిపాదనకు టీడీపీ నాయకులు తిరస్కరించటంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిందన్న ప్రచారం సాగుతోంది. వేల్పుల సింగయ్యకు మండలంలో బలమైన వర్గం ఉంది. ఇతని పేరు పైలాన్‌పై వేయాలని మండలంలోని మూడు గ్రామాల నాయకులు మద్దతు తెలుపుతుండటంతో ఒక దశలో ఈ పైలాన్ తొలగించడానికి కూడా పథకం రచించారు. అయితే తరువాత ఈ పైలాన్‌పై మండల పార్టీ అధ్యక్షుని పేరు వేయడానికి రాళ్లు సిద్ధం చేశామని, ప్రస్తుతం ఏర్పాటు చేసిన రాళ్లను తీసేసి కొత్త రాళ్లను వేసి పైలాన్‌ను మళ్లీ నిర్మిస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనకు సింగయ్య అంగీకరించలేదని ఆదివారం ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాక ఈ పైలాన్ నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని, కేవలం అధికార పార్టీ ఒత్తిడితో ఆ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఈ పైలాన్ నిర్మాణం టీడీపీలో ఎటువంటి వివాదాలను రాజేస్తుందోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. -
విజయ 'సంకల్పం'
ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుంది. పాదయాత్ర ముగింపు రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శివార్లలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న పైలాన్ చిరస్మరణీయంగా నిలిచిపోనుంది. అనితర సాధ్యం.. అనన్య సామాన్యంఅన్న రీతిలో ఇప్పటికి 3,593.6 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన వైఎస్ జగన్.. ఈ నెల 9న తన ప్రజా సంకల్ప యాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది అభిమానులు, ప్రజల మధ్య ఈ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర.. అప్రతిహతంగా కొనసాగుతోంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ప్రతిపక్ష నేత.. 2019 జనవరి 9వ తేదీ నాటికి ఇచ్ఛాపురం చేరుకోనున్నారు. తాను అనుకున్న లక్ష్యం ప్రకారం ‘ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం’ వరకూ నడుస్తూ లక్షలాది మంది ప్రజలతో మమేకమవుతున్నారు. వారి కష్టాలను తెలుసుకుంటూ భవిష్యత్తుపై వారికి భరోసానిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా.. పైలాన్ నిర్మాణానికి శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. ఆకర్షణీయంగా.. ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు.. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో.. యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న ఈ పైలాన్ పనులు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న పటిష్టమైన ఈ నిర్మాణానికి మరో వైపు హౌరా–చెన్నై రైల్వే లైను ఉంది. దీంతో అటు వాహనాల్లో, ఇటు రైల్లో వెళ్లేవారి దృష్టిని ఈ కట్టడం ఆకర్షించనుంది. ఈ పైలాన్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోలు, జగన్ పాదయాత్ర సందర్భంగా తీసిన ఫొటోలు, అనునిత్యం జనంతో మమేకమై వారి వెతలు వింటూ భరోసా ఇస్తున్న దృశ్యాలను నిబీడీకృతం చేయనున్నారు. 13 జిల్లాలకు గుర్తుగా.. 13 మెట్లు పైలాన్ చుట్టూ చిన్నపాటి లాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ లాన్ నుంచి పైలాన్ బేస్‌కు చేరుకునేందుకు 13 మెట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేసినందున ఒక్కో జిల్లాకు చిహ్నంగా ఒక్కో మెట్టును ఏర్పాటు చేశారు. ఇక పైభాగాన వైఎస్సార్ కాంగ్రెస్ పతాకంలోని మూడు రంగులతో కూడిన ఒక టోంబ్‌ను అమర్చారు. నిర్మాణం అగ్రభాగాన పార్టీ పతాకాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల మీదుగా ఏ ఏ మార్గాల్లో వైఎస్ జగన్ నడిచారో తెలియజేస్తూ ఒక మ్యాప్‌ను కూడా ఇందులో నిక్షిప్తం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్నో దర్శనీయ స్థలంగా, ఆకర్షణీయమైనదిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో రెడీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు గర్వించేలా.. వారిలో స్ఫూర్తిని నింపేలా.. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదల, సంకల్పానికి చిహ్నంగా నిర్మిస్తున్న ఈ పైలాన్ మరో రెండు రోజుల్లో దాదాపుగా పూర్తవుతుందని ప్రజా సంకల్ప యాత్ర ఏర్పాట్లను తొలి నుంచీ పర్యవేక్షిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ చెప్పారు. ప్రధాన పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఇక మెరుగులు దిద్దే పని ఉందన్నారు. గతంలో ఏ నాయకుడూ చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కఠోర దీక్షతో తన సంకల్పాన్ని పూర్తి చేశారని.. ఇది పార్టీలో అందరికీ గర్వకారణమన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇప్పటికే అడుగు పెట్టిన జగన్.. కొర్లాం, బారువ క్రాస్, సోంపేట, కవిటి, రాజపురం, కొజ్జీరియా మీదుగా పాదయాత్ర సాగిస్తూ ఇచ్ఛాపురం చేరుకుంటారని తెలిపారు. ఈ నెల 9న పైలాన్‌ను ఆవిష్కరించాక ఇచ్ఛాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారని తలశిల రఘురామ్ వివరించారు. -
ప్రజాసంకల్ప యాత్ర: సిద్దమవుతున్న 2000 కి.మీ పైలాన్
-
దేశం మార్కు... అతిక్రమణ!
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన రహదారుల మధ్యలో పైలాన్ల నిర్మాణం సీఎం చంద్రబాబు కార్యక్రమానికి ప్రాధాన్యం చిలకలూరిపేటలో అధికారుల అత్యుత్సాహం సాక్షి ప్రతినిధి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసే ఆరాటంలో జిల్లా యంత్రాంగం సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోవడం లేదు. ఈ నెల 18న చిలకలూరిపేట నియోజకవర్గంలోని కార్యక్రమాలకు హాజరుకానున్న సీఎంను మరింత సంతృప్తి పరిచేందుకు అనుమతులు లేని ఆర్భాటాలకు తెరతీశారు. రహదారులు, ప్రధాన కూడలి ప్రాంతాల్లో విగ్రహాలు, పైలాన్ల నిర్మాణాలు చేపట్టకూడదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించి, హడావుడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో జరగనున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’అనే రీతిలో ఇద్దరి ప్రశంసలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హడావుడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులను కూడా సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు భిన్నంగా వ్యవహరించే వ్యక్తులుగా మార్చేస్తున్నారు. వివరాలు ఇవి.... 2012లో సుప్రీం తీర్పు .....రహదారులు, కూడలి ప్రాంతాల్లో విగ్రహాలు, ఇతర కట్టడాల నిర్మాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని 2006 లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై రహదారులు, కూడలి ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు 2012లో తీర్పునిచ్చింది. దీని ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అన్ని ప్రభుత్వశాఖలకు 2013 ఫిబ్రవరి 18న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని రహదారులు, కూడలి ప్రాంతాలు, పేవ్మెంట్లకు సమీపంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొన్నారు. ఇటువంటి నిర్మాణాలు చేపట్టడానికి ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల్లోని అంశాలను జిల్లా స్థాయి అధికారులకు అందే విధంగా చేయడంతోపాటు వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడిలా.... రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గానికి ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద నిర్మించనున్న గృహ సముదాయంతో పాటు రూ. 10 కోట్లతో టౌన్‌హాలు, రూ.11 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ. 143 కోట్లతో అమృత పథకం కింద మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన, రూ. 4 కోట్లతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఇంకా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనచేస్తారు. రూ. 2 కోట్లతో నిర్మించిన అర్బన్ మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ మూడు పైలాన్లు నిర్మిస్తున్నారు. రహదారులు, ప్రధాన కూడలి ప్రాంతాల్లో వీటిని నిర్మించరాదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారు. మూడు సెంటర్లలో అధికారులు భారీ ఎత్తున పైలాన్లను నిర్మిస్తున్నారు. నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పీ కెనాల్స్ కార్యాలయ ప్రాంగణంలో రూ. 10 లక్షలు అంచనా వ్యయంతో ఒకటి, ఎన్ఆర్టీ సెంటర్ (అమృత్ పథకం తాలూకు)లో, పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు సెంటర్(స్వచ్ఛాంధ్ర పథకం తాలుకు)లో పైలాన్లు నిర్మిస్తున్నారు. ఈ మూడింటిలో రెండు పైలాన్లు జాతీయ రహదారుల మధ్యలోనే నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ద్వారా సుప్రీంకోర్టు ఉత్తర్వులనుఅధికారులుధిక్కరించారనేవిమర్శలుబాహాటంగావినపడుతున్నాయి. ఆర్భాటపు పైలాన్లు .... ప్రతి పనికి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొంటున్నప్పటికీ, అధికారులు ఆ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మూడు పైలాన్ల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించకుండా ఒక్కోదానిపై రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. రూ.5 లక్షలకు మించిన పనులకు టెండర్లు ఆహ్వానించాలనే నిబంధన ఉన్నప్పటికీ, నామినేషన్ పద్ధతిపై పైలాన్ నిర్మాణాలను ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు.