మొగల్తూరులో ‘సూది’ సైకో ప్రత్యక్షం
మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సైకో సూదిగాడు మరోసారి కలకలం సృష్టించాడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సైకో మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో ఆదివారం ప్రత్యక్షమయ్యాడు. గ్రామానికి చెందిన హారిక అనే మూడేళ్ల చిన్నారికి ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. బాలిక ఏడుపుతో తల్లిదండ్రులు ఘటనాస్థలికి వచ్చేసరికి అక్కడి నుంచి సైకో పరారయ్యాడు.
ఏ క్షణాన ఎవరికి ఇంజక్షన్ ఇస్తాడోనని ప్రజలు భయపడుతున్నారు. గ్రామస్తులు ఫోన్ ద్వారా పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. మరోక పక్క సూది సైకో కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తణుకు పరిసరప్రాంతాల్లో గాలిస్తుండగా సూదిగాడు మారుమూల ప్రాంతమైన ముత్యాలపల్లిలో ప్రత్యక్షం కావడం గమన్హారం.