quadrangular contest
-
చతుర్ముఖ పోటీ
► ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే, ► డీఎంకేలే ప్రధాన ప్రత్యర్థులు ► బీజేపీ అభ్యర్థుల ఎంపిక ► పోలింగ్ సమయం కుదింపు సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చతుర్మఖ పోటీ నెలకొంది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టారనే ఆరోపణలతో అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దయిన విషయం తెలిసిందే. తిరుప్పరగున్రం ఎమ్మెల్యే శీనివేల్ మరణంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ మూడు నియోజకవర్గాలకు వచ్చే నెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. అన్నా డీఎంకే, డీఎంకే, పీఎంకే ఇప్పటికే తవ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగాయి. బీజేపీ అభ్యర్థులు వీరే : మూడు నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ గురువారం ఢిల్లీ నుంచి ప్రకటించింది. తంజావూరు నుంచి ఎమ్ఎస్.రామలింగం, అరవకురిచ్చి నుంచి ఎస్.ప్రభు, తిరుప్పరగున్రం నుంచి ప్రొఫెసర్ శ్రీనివాసన్ పోటీకి దిగుతున్నారు. ఫిర్యాదులు, పిటిషన్లు : ఉప ఎన్నికలు జరగనున్న మూడు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు డీఎంకే ఫిర్యాదు చేసింది. గడిచిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులనే అన్నాడీఎంకే, డీఎంకే తదితర పార్టీలు మళ్లీ పోటీకి దింపినందున తంజావూరు, అరవకురిచ్చిల్లో ఉప ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ మధురై హైకోర్టు శాఖలో సీనియర్ న్యాయవాది ప్రకాష్ గురువారం పిటిషన్ వేశారు. పోలింగ్ సమయం కుదింపు : తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చీలో వచ్చే నెల 19న జరగనున్న ఎన్నికల పోలింగ్ సమయాన్ని గంట పాటూ కుదించనున్నట్టు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని గతంలో ప్రకటించి ఉన్నారు. తాజాగా పోలింగ్ వేళలను సవరిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. నేడు అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల నామినేషన్లు : ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు నియోజవర్గాల్లో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అరవకురిచ్చీలో సెంథిల్ బాలాజీ(అన్నాడీఎంకే), కేసీ.పళని స్వామి, తంజావూరులో రంగస్వామి(అన్నాడీఎంకే), అంజుగం భూపతి(డీఎంకే), తిరుప్పరగున్రంలో ఏకే.బోస్ (అన్నాడీఎంకే), డాక్టర్ శరవణన్(డీఎంకే) నా మినేషన్లు వేయనున్నారు. రెండు పార్టీల అభ్యర్థులు మధ్యాహ్నం 1-3 గంటల మధ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. -
సీన్ మారింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గతంలో మారిదిగా కంచుకోటలు లేవు.. సాలిడ్‌గా ఒక్కరికే ఓట్లు పడే పరిస్థితీ లేదు.. కానీ ఎన్నడూ లేనంత పోటీ మాత్రం ఉంది. ఎవరు ఏ పార్టీ తరఫున బరిలో ఉన్నారన్న విషయం కూడా ఇంకా జనంలోకి పోలే దు. ఈ సారి జంపింగ్‌లు కూడా అధికమే. మొత్తంగా చూసే జిల్లా రాజకీయ చిత్రం అస్పష్టంగా ఉంది. ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఇక అదే స్థాయిలో స్వతంత్రులు కూడా అధిక సంఖ్యలోనే బరిలో ఉన్నారు. ఏ స్థానం చూసుకున్నా పోటీ హోరాహోరీగానే ఉంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు కలిపి 2009లో 219 మంది అభ్యర్థులు పోటీ పడితే ఈ సారి 284 బరిలో నిలిచారు. పార్టీల బలాబలాలు సైతం తారుమారయ్యాయి. రాజకీయ విశ్లేషకులకు కూడా ఫలితం ఊహకందడం లేదు. అయితే ఏ పార్టీ అభ్య ర్థి గట్టెక్కినా నామమాత్రపు మెజార్టీలతోనే. గతంలో జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల మధ్యే పోరు జరిగేది. 2009 ఎన్నికల్లో బీజేపీ, ప్రజారాజ్యం పార్టీలు కొన్ని స్థానాల్లో చెప్పుకోదగ్గ ఓట్లను సంపాదించాయి. కొన్ని స్థానాల్లో స్వతంత్రులు బరిలోకి దిగానా వారికి పోలైన ఓట్లు వందల్లోనే. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నం. గత ఎన్నికలతో ఏ మాత్రం పోల్చుకునే పరిస్థితి. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీల మధ్య చతుర్ముఖ పోటీ ఉంది. కొన్ని స్థానాల్లో తిరుగుబాటుదారులు, స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల తలరాతలు మార్చేలా కనిపిస్తున్నారు. మరికొన్ని స్థానాల్లో పొత్తులు పొసగక కత్తులు నూరుకుంటున్నారు. గతంలో ఏక ఛత్రాధిపత్యం ప్రదర్శించిన పార్టీలు చతికిలపడ్డాయి. కొత్తగా తెరమీదకు వచ్చిన పార్టీలు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి. సెంటిమెంటుదే అగ్రస్థానం తెలంగాణలోని మిగిలిన జిల్లాలతో పోల్చితే రంగారెడ్డిలో తెలంగాణ సెంటిమెంటు అంతగా లేనప్పటికీ గ్రామీణ నియోజకవర్గల్లో కాస్త కన్పిస్తోంది. అయితే వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహేశ్వరం, మేడ్చల్ స్థానాల్లో ప్రాంతీయాభిమానమే ప్రధానాంశంగా ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ వ్యతి రేకత, ధరల పెరుగుదల, అభివృద్ధి వంటి విషయాలు కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపవచ్చు. ఇక రాజధాని నగ రం, పరిసరాల్లోని నియోజకవర్గాల్లో తెల ంగాణ సెంటిమెంటు ప్రభావం స్వల్పం. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి స్థానాల్లో సెంటిమెంటు ఏ మాత్రం వర్కవుటయ్యే పరిస్థితి లేదు. స్థానికేతర ఓటర్లు అధిక సంఖ్యలో నివసిస్తుండడమే ఇందుకు కారణం. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నంలో కాస్త ప్రభావం చూపొచ్చు. ప్రతి ఓటూ విలువైనదే శాసనసభ ఎన్నికల్లో నెలకొన్న రసవత్తర పోరు దృష్ట్యా అన్ని పార్టీలూ అందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. ఏ ఒక్క విషయంలోనూ ప్రత్యర్థి కంటే తగ్గకూడదన్న ధోరణితో వ్యవహరిస్తున్నాయి. పోటీదారులు అధిక సంఖ్య లో ఉండడంతో ప్రతి ఓటూ విలువైనదేనన్న తరహాలో పార్టీ శ్రేణులకు అభ్యర్థులు దిశానిర్దేశం చేస్తున్నారు.