Quadrilateral
-
క్వాడ్.. ఎవరి ప్రయోజనాల కోసం?
చతుష్టయం(క్వాడ్) అని పిలిచే ‘చతుర్ముఖ భద్రతా ముచ్చట్లు’ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాల మధ్య వ్యూహాత్మక భద్రతా ఏర్పాటు! ఎవరికి ఎవరి నుండి భద్రత కావాలి? అమెరికాకు చైనా నుండి వాణిజ్య భద్రత, జపాన్‌కు చైనా నుండి సరిహద్దు భద్రత కావాలి. ఈ ముచ్చట్లను 2007లో నాటి జపాన్ ప్రధాని షింజొ అబే ప్రారంభించారు. చైనా ఈ కూటమి ఏర్పాటుపై నిరసన తెలిపింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 2008లో తప్పుకొంది. అయితే ఈ చతుష్టయాన్ని 2017లో పునఃప్రారంభించారు. ఈ చతుష్టయం మొన్న మే 24న జపాన్ రాజధాని టోక్యోలో కలిసింది. చట్టవ్యతిరేక చేపల వేటను ఎదుర్కోడానికి సముద్రయాన ప్రేరణను ప్రారంభించింది. అనుమానిత చేపల వేట చైనా నుండే. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని నియంత్రించడానికి 4 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అందులో భారత్ వంతు లక్ష కోట్ల రూపాయలు. జపాన్, అమెరికాల ప్రయోజనాలకు, చైనా అభివృద్ధిని అడ్డుకోడానికి మనం ఇంత సొమ్మును వృథా చేయాలా? (👉🏾చదవండి: క్షమాభిక్షలోనూ ఇన్ని రాజకీయాలా?) గతంలో మోదీ జపాన్ గడ్డపై, ప్రత్యక్షంగా జపాన్ను, పరోక్షంగా అమెరికాను బుజ్జగించడానికి చైనాను విమర్శించారు. జపాన్, చైనాల మధ్య ‘సెంకకు ద్వీపాల’ సార్వభౌమత్వ, సముద్ర సరిహద్దు వివాదాలున్నాయి. మోదీ విమర్శను చైనా తీవ్రంగా పరిగణించింది. సరైన నిర్ణయం కాకపోయినా భారత సరిహద్దుల్లో చైనా సైనిక చర్యలు దీని ఫలితమే. ‘క్వాడ్’ భారత్–అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్న మాటల్లో నిజం లేదు. అమెరికా కుట్రలనూ, యుద్ధసామగ్రి వాణిజ్యాన్నీ, మోదీ అమెరికా సౌజన్య పక్షపాతాన్నీ (ఔనంటే ఔను కాదంటే కాదనే గుణం) గర్హించాలి. భారత ప్రజల ప్రయోజనాలను, ఆర్థిక వనరులను, భారత సైనికుల ప్రాణాలను కాపాడుకోవాలి. (👉🏾చదవండి: సైద్ధాంతికంగా కాంగ్రెస్ మేల్కొన్నట్లేనా?) – సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
చతుర్ముఖ పోరులో... పంజాబ్ షేర్ ఎవరో?
వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత కీలక రాష్ట్రం పంజాబ్. ఎందుకంటే మిగతా మూడు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ చిన్న రాష్ట్రాలు. సాగు చట్టాలకు వ్యతిరేక ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పంజాబ్ రైతులు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఎవరి పక్షాన నిలుస్తారు... అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పంజాబ్ రాజకీయం బాగా వేడెక్కింది. శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలైతే ఏడాదికాలంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల స్వర్ణదేవాలయం, కపుర్తలాలలో సిక్కుల మతచిహ్నాలను అపవిత్రం చేసే ప్రయత్నాలు జరగడం, లుథియానా కోర్టులో పేలుడు వెనుక ఖలిస్థాన్ గ్రూపుల హస్తమున్నట్లు వార్తలు రావడంతో... రాజకీయాలకు మతం రంగు పులిమేందుకు, ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరిట కొత్త పార్టీని పెట్టి బీజేపీతో జట్టు కట్టడంతో పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారాయి. రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తాజా పరిస్థితిపై విశ్లేషణ... దళిత ఓటుపై గంపెడాశలు పదేళ్లు అధికారంలో ఉండి... తీవ్రమైన అవినీతి ఆరోపణలు, రాష్ట్రం డ్రగ్స్ ఊబిలో కూరుకుపోవడంతో 2017లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. కేవలం 15 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. పంజాబ్ రైతాంగంలో రగులుతున్న అసంతృప్తిని పసిగట్టిన అకాలీదళ్ 2020లో మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంది. పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సతీమణి హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అకాలీదళ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తోంది. రాష్ట్ర జనాభాలో 32 శాతం దళితులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో ఈ ఏడాది జూన్‌లోనే పొత్తు పెట్టుకుంది. 20 సీట్లకు బీఎస్పీకి వదిలిపెట్టింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 111 స్థానాల్లో బరిలోకి దిగిన బీఎస్పీ 110 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోగొట్టుకుంది. 1.59 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అయితే అంతకుముందు 2007లో 4.17 శాతం, 2012లో 4.3 శాతం ఓట్లను బీఎస్పీ పొందింది. దళితులపై పట్టున్న డేరాల ప్రభావం తగ్గడం, డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ జైలుకెళ్లడంతో... దళితల ఓట్లను కూడగట్టడంతో మాయావతి తొడ్పడగలరని అకాలీదళ్ అంచనా. అయితే సొంత రాష్ట్రం యూపీలో కూడా ఎన్నికలున్న నేపథ్యంలో పంజాబ్ ప్రచారానికి మాయావతి ఎంత సమయాన్ని కేటాయించగలరనేది ప్రశ్న. మరోవైపు సుఖ్బీర్ చాలా ముందునుంచే 2022లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికి 91 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. 21 కొత్త ముఖాలను దింపారు. ముందే ఖరారు కావడంతో నియోజకవర్గంలో స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి, తగినంత సమయం వెచ్చించడానికి అకాలీదళ్ అభ్యర్థులకు వీలు చిక్కింది. కొత్త పొత్తు... కాంగ్రెస్ పొమ్మనకుండా పొగబెట్టడం తో పాటియాలా రాజు.. అమరీందర్ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరిట సొంతకుంపటి పెట్టుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో కలిసి బరిలోకి దిగుతానని ప్రకటించిన కెప్టెన్ అన్నట్లుగానే పొత్తును ఖరారు చేసుకున్నారు. ఎవరెన్ని సీట్లలో పోటీచేయాలనేది ఇంకా తేల్చుకోలేదు. అకాలీ చీలికవర్గ నేతలను కూడా కూటమిలో చేర్చుకుంటామని కెప్టెన్ ఇదివరకే స్పష్టం చేశారు. అకాలీదళ్‌తో పొత్తులో భాగం గా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం మూడు స్థానాల్లో నెగ్గింది. 5.39 శాతం ఓట్లను సాధించింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పోటీచేసిన మూడింటిలో రెండు నెగ్గి...9.63 శాతం ఓట్లు పొందింది. అమరీందర్ కాంగ్రెస్ ఓట్లను ఎన్నింటిని చీల్చగలరు, సాగు చట్టాల రద్దు ఈ కూటమికి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది, మోదీ కరిష్మా రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లను రాల్చ గలదు... ఇవన్నింటిపై ఈ కూటమి ఎన్ని చోట్ల గెలుస్తుందనేది ఆధారపడి ఉంటుంది. సొంతగూటిని చక్కదిద్దాలి.. ఒత్తిడికి తలొగ్గి అనుభవజ్ఞుడైన ముఖ్య మంత్రి అమరీందర్ సింగ్‌ను మార్చడం, తర్వాత అదేపనిగా పీసీసీ అధ్యక్షుడు నవ జ్యోత్ సింగ్ సిద్ధూ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌కు సొంత గూటిని సరిదిద్దుకోవడానికే ఎక్కువ సమయం సరిపోతోంది. పీసీసీ అధ్యక్షుడే సొంత ప్రభుత్వంపై బౌన్సర్లు సంధిస్తుంటే... తలబొప్పి కట్టడం ఖాయం. ప్రస్తుతం సిద్ధూతో కాంగ్రెస్ పెద్దలు ఇదే అవస్థను ఎదుర్కొంటున్నారు. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళిత ఓట్లు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... ఆ వర్గానికి చెందిన చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది కాంగ్రెస్. ఎన్నికల్లో దళిత కార్డుగా ఉపయోగించుకోవడానికే చన్నీని అందలం ఎక్కించారని.. ఆర్నెళ్ల సీఎంగా మిగిలిపోతారని... కాంగ్రెస్‌కు దమ్ముంటే 2022 ఎన్నికల్లో కూడా ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ హస్తం పార్టీ అలా చేయలేదు. సర్వం తన కనుసన్నల్లో నడవాలనుకునే సిద్ధూకు కోపం తెప్పించే సాహసం కాంగ్రెస్ చేయలేదు. అలాగని ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్తే... దళిత ఓటు పోటును ఎదుర్కోవాల్సిన సంకట స్థితి. సిద్ధూ మాటల మాంత్రికుడు. చక్కటి హావభావాలతో సూటిగా ప్రజల మనసుల్లో ముద్రవేయగల వాగ్భాణాలను సంధిస్తారు. పంజాబ్ లో కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిన అమరీందర్ లేని లోటును సిద్ధూ ఏమేరకు పూడ్చగలరు, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి తన చరిష్మాతో మళ్లీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయగలరా? వేచి చూడాలి. కేజ్రీవాల్‌పైనే భారం ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌పై బాగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బల మైన పునాది కలిగిన అకాలీదళ్‌కు వెనక్కి నెట్టి... 20 స్థానాలతో ఆప్ పంజాబ్ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 23.72 శాతం ఓట్లు రావడంతో గత ఐదేళ్లుగా ప్రణాళిక ప్రకారం పంజాబ్‌లో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్ ఇన్సాఫ్ పార్టీకి ఆరుస్థానాలను (రెండు నెగ్గింది) వదిలిన ఆప్ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రజాకర్షణపైనే ఆధారపడుతోంది. ఢిల్లీలో పాఠశాలల్లో నాణ్యత మెరుగుపడటం, మొహల్లా క్లినిక్‌లు విజయవంతం కావడం, పేదలకు ఉచిత విద్యుత్... తదితర ఢిల్లీ మోడల్ పాలనను అందిస్తామని వాగ్ధానం చేస్తోంది. సిక్కునే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 73 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. -
చైనాకు క్వాడ్ పరోక్ష హెచ్చరికలు
వాషింగ్టన్: ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేస్తామని క్వాడ్ సదస్సు ప్రతిజ్ఞ చేసింది. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాంతంలో అంతర్జాతీయ నిబంధనలు అమలు కావాలని పిలుపునిచ్చింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి క్వాడ్ సదస్సు శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిగింది. తొలిసారిగా నాలుగు దేశాధినేతలు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ సందస్సులో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో తమ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదో అవకాశమని నేతలు చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగా సదస్సు అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు బిగిస్తున్న నేపథ్యంలో క్వాడ్ సదస్సు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సంయుక్త ప్రకటనలో నేరుగా చైనా పేరు ప్రస్తావించకుండా అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఏ దేశమైనా ప్రవర్తించాలని పేర్కొన్నారు. ‘ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా వాణిజ్యం జరగాలి. వివాదాలు శాంతియుతంగా పరిష్కారం కావాలి. దేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రాదేశిక సమగ్రత కాపాడేలా కలసికట్టుగా కృషి చేస్తాం’’అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. అక్టోబర్ నుంచి భారత్ వ్యాక్సిన్ ఎగుమతుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని క్వాడ్ సదస్సు స్వాగతించింది. పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందేలా కృషి చేయనున్నాయి. 2022 నాటికల్లా వంద కోట్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అందజేయనున్నాయి. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం జరగడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పనలో పరస్పరం సహకరించుకోనున్నాయి. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఒక నిర్ణయానికొచ్చాయి. -
అమెరికా, భారత్ సంబంధాల్లో నూతన అధ్యాయానికి నాంది
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తొలిసారి భేటీ అయ్యారు. తమ సమావేశం అద్భుతంగా జరిగిందని మోదీ వెల్లడించారు. భారత్- యూఎస్ బంధం మరింత దగ్గరవ్వాలని, బలోపేతమవ్వాలని బైడెన్ ఆకాంక్షించారు. చర్చల్లో ఇరువురు నేతలు ఇండో-పసిఫిక్, వాతావరణ మార్పు, వాణిజ్యం, కోవిడ్‌తో సహా పలు అంశాలను చర్చించారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీసులో మోదీకి బైడెన్ స్వాగతం పలికారు. ఇరుదేశాల సంబంధాల్లో ఇదో నూతనాధ్యయంగా బైడెన్ అభివర్ణించారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ప్రపంపంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల బంధం పలు అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరిస్తుందని, కరోనా కట్టడిపై ఉమ్మడి నిబద్ధత చూపడంతో దీన్ని నిరూపిస్తామని బైడెన్ చెప్పారు. ప్రధాని పదవి స్వీకరించాక మోదీ అమెరికా సందర్శించడం ఇది ఏడవసారి. ‘ఈ దశాబ్దం ఎలా ఉంటుందనే విషయంలో మీ నాయకత్వం కీలకపాత్ర పోషించనుంది. భారత్, అమెరికా మధ్య మరింత బలమైన బంధానికి విత్తనాలు నాటాము’ అని బైడెన్‌తో మోదీ వ్యాఖ్యానించారు. కీలక భౌగోళికాంశాలపై బైడెన్‌కు ఉన్న అవగాహన అధికమని భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. కరోనాపై, వాతావరణ మార్పుపై పోరాటం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం తీసుకురావడం వంటి అంశాలపై మోదీతో చర్చించినట్లు తెలిపారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన గాంధీ మార్గమే శరణ్యం వచ్చేవారం జరగనున్న గాంధీ జయంతి ఉత్సవాలను బైడెన్ ప్రస్తావించారు. ఆయన చూపిన అహింస, ఓర్పులాంటి సూత్రాల అవసరం ఇప్పుడు ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా గాంధీ ప్రవచించే ట్రస్టీషిప్ సిద్ధాంతాన్ని మోదీ గుర్తు చేశారు. ఇరు రాజ్యాల మధ్య రాబోయే రోజుల్లో బంధాన్ని ధృడోపేతం చేసే శక్తి వాణిజ్యానికి ఉందన్నారు. సాంకేతికత రాబోయే రోజుల్లో మరింత కీలక పాత్ర పోషించనుందన్నారు. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుతమైన ఇండో– పసిఫిక్ ప్రాంతమే తమ రెండు దేశాలతో పాటు అనేక దేశాల ఆకాంక్ష అని బైడెన్ చెప్పారు. ఈ ప్రాంతంలో చైనా మిలటరీ విన్యాసాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ భాగస్వామ్యం అంచనాలను మించి మరింత ప్రభావం చూపగలదన్నారు. 40 లక్షల మంది ఇండో– అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తివంతం చేస్తున్నారన్నారు. భారతీయ సంతతి అమెరికా పురోగతిలో భాగం కావడంపై మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిపై ప్రధాని ప్రశంసలు కోవిడ్, క్వాడ్ తదితర అంశాలపై బైడెన్ యత్నాలు అభినందనీయమని మోదీ ప్రశంసించారు. గతంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒకసారి మోదీతో భేటీ అయ్యారు. ఆయన అధ్యక్షుడయ్యాక పలుమార్లు ఫోన్లలో, ఆన్లైన్ సమావేశాల్లో సంభాషించుకున్నా, ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. గతంలో తాము పరిచయమైనప్పుడే ఇరుదేశాల సంబంధాలపై బైడెన్ దూరదృష్టిని చూపారని, ప్రస్తుతం అధ్యక్షుడిగా అప్పటి ఆలోచనలను అమలు చేసేందుకు యతి్నస్తున్నారని బైడెన్‌ను ఆయన కొనియాడారు. ఇరు రాజ్యాలు కలిసి చేసే యత్నాలు ప్రపంచానికి మంచి చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఇరువురి భేటీ అత్యంత ఫలప్రదంగా జరిగిందని విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. భేటీ సందర్భంగా వైట్‌హౌస్‌లోని రూజ్వెల్ట్ రూమ్‌లోని సందర్శకుల పుస్తకంలో ప్రధాని సంతకం చేశారు. ప్రధానితో పాటు జైశంకర్, అజిత్‌దోవల్, హర్షవర్ధన్ శ్రింగ్లా, తరణ్‌జిత్ సింగ్ సంధూ, అమెరికా తరఫున ఆంటోనీ బ్లింకెన్, జేక్ సల్లివాన్, జాన్ కెర్రీ, కర్ట్ చాంబెల్, డోనాల్డ్ లూ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ శాంతికి ‘క్వాడ్’: మోదీ భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమి(క్వాడ్) కేవలం ఇండో–పసిఫిక్ ప్రాంతానికే కాదు మొత్తం ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లడానికి దోహదపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాలుగు బలమైన దేశాలు జట్టుకట్టి, ఒకే వేదికపైకి రావడం ప్రపంచానికి మేలు కలిగించే పరిణామం అని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆతిథ్యం ఇస్తున్న ‘క్వాడ్’ సదస్సు శుక్రవారం వాషింగ్టన్లో జరిగింది. మోదీ, బైడెన్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు స్కాట్ మోరిసన్, యోషిహిడే సుగా హాజరయ్యారు. కోవిడ్ నుంచి వాతావరణ మార్పుల దాకా ఎన్నో సవాళ్లు మానవాళికి ఎదురవుతున్నాయని బైడెన్ వ్యాఖ్యానించారు.ప్రజాస్వామిక భాగస్వాములతో కూడిన క్వాడ్ కూటమికి భవిష్యత్తుపై ఉమ్మడి దార్శనికత ఉందని అన్నారు. సవాళ్లను ఎలా ఎదిరించాలో తమకు తెలుసని చెప్పారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మానవళి కోసం క్వాడ్ కూటమి రూపంలో నాలుగు దేశాలు ఒక్క తాటిపైకి వచ్చాయని పేర్కొన్నారు. సప్లై చైన్, అంతర్జాతీయ భద్రత, వాతావరణ మార్పులు, కోవిడ్‌పై పోరాటం, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం వంటి కీలకం అంశాలపై తన మిత్రులతో చర్చిస్తున్నానని వివరించారు. సానుకూల దృక్పథంలో ముందుకు సాగాలని తాము నిర్ణయించుకున్నట్లు మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో మోరిసన్, సుగా మాట్లాడారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో బలప్రయోగానికి తావుండరాదని స్పష్టం చేశారు. ఏవైనా వివాదాలు, సమస్యలు ఉంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అవును.. భారత్‌లో మీ చుట్టాలున్నారు! బైడెన్ ప్రశ్నకు మోదీ జవాబు మోదీతో సమావేశం సందర్భంగా ఇండియాలో బైడెన్ చుట్టాల గురించి ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. భారత్‌లో బైడెన్ ఇంటిపేరున్న వారున్నట్లు తనకు తెలిసిందని, కానీ అంతకుమించి వివరాలు దొరకలేదని బైడెన్ చెప్పారు. అయితే భారత్‌లో బైడెన్ ఇంటిపేరున్న వాళ్లు అధ్యక్షుడితో చుట్టరికం ఉన్నవాళ్లేనని, ఇందుకు సంబంధించిన ఆధారాల డాక్యుమెంట్లు తెచ్చానని చెప్పి బైడెన్‌ను ప్రధాని మోదీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 1972లో తాను సెనేటర్‌గా తొలిసారి ఎన్నికైనప్పుడు బైడెన్ అనే ఇంటిపేరున్న ఒక వ్యక్తి ముంబై నుంచి తనకు అభినందనలు తెలుపుతూ లేఖ రాశాడని బైడెన్ గుర్తు చేసుకున్నారు. దాంతో తన ముత్తాతకు ముత్తాతకు ముత్తాత ఎవరో ఇక్కడ ఉండిఉండొచ్చని భావించానని చెప్పారు. అలాగే 2013లో భారత్‌ను సందర్శించినప్పుడు తనకు ఇండియాలో ఎవరైనా చుట్టాలున్నారా అన్న ప్రశ్న ఎదురైందన్నారు. మరుసటి రోజే తనకు ఇండియాలో ఐదుగురు బైడెన్స్ నివశిస్తున్నట్లు తెలిసిందన్నారు. మరింత ఆరా తీయగా జార్జ్ బైడెన్ అని ఈస్ట్ ఇండియా టీకంపెనీలో ఒకరుండేవారని, బహూశ ఆయన ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని స్థానికంగా సెటిలై ఉండొచ్చన్నారు. అయితే నిజంగా ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. భారత్‌తో తన బంధుత్వంపై తనకెవరైనా సాయం చేస్తారేమోనని ఈ విషయాలన్నీ చెబుతున్నానని ఆయన అనగానే మోదీతో సహా సమావేశంలోని వారంత నవ్వుల్లో మునిగారు. అనంతరం నిజంగా నాకు చుట్టాలున్నారా? అని మోదీని బైడెన్ అడగ్గా ఆయన అవునన్నారు. గతంలో కూడా తనతో ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. అందుకే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అన్వేషించామని, ఈ రోజు వీటిని తీసుకువచ్చామని, వీటితో మీకు ఉపయోగం ఉండొచ్చని వివరించారు. ముంబైలో తన కొత్త చుట్టాలతో ఇంతవరకు సంభాషించలేదని, త్వరలో మాట్లాడతానని బైడెన్ చెప్పారు. కమలకు తాతయ్య జ్ఞాపకం: కానుకగా ఇచ్చిన ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అరుదైన జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చారు. కమల తాతయ్య, తమిళనాడుకు చెందిన పి.వి. గోపాలన్ ప్రభుత్వ అధికారిగా వివిధ హోదాల్లో పని చేశారు. ఆయనకు సంబంధించిన ఒక పాత నోటిఫికేషన్‌ను హస్తకళా నిపుణులు తయారు చేసిన కలప ఫ్రేమ్‌లో పెట్టి బహుమానంగా ఇచ్చి కమలను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. దాంతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం, అత్యంత పురాతన నగరమైన వారణాసిలో హస్తకళల నిపుణులు ప్రత్యేకంగా తయారు చేసే గులాబీ మీనాకారి చదరంగం సెట్‌ను బహుమతిగా అందించారు. ఈ చదరంగం సెట్లో ప్రతీ పావు అత్యంత అద్భుతమైన కళతో ఉట్టిపడుతూ చూపరుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. తాను కలుసుకున్న ఇతర ప్రపంచ దేశాల అధినేతలకు కూడా మనసుని ఉల్లాసపరిచే బహుమానాలు ఇచ్చారు. ఆ్రస్టేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్‌కు గులాబీ మీనాకారి కళతో తయారు చేసిన వెండి నౌకను బహుమతిగా ఇచ్చారు. జపాన్ ప్రధాని సుగాకు చందనపు చెక్కతో తయారు చేసిన బుద్ధుడి ప్రతిమను కానుకగా ఇచ్చారు. హస్తకళ నిపుణులు తయారు చేసిన ఈ కళాత్మక వస్తువులన్నింటిలోనూ వారణాసి సాంస్కృతిక చైతన్యం ఉట్టిపడుతూ ఉండడంతో ఆ కానుకలు అందరినీ అమితంగా ఆకర్షించాయి. రూజ్వెల్ట్ రూమ్‌లోని సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న ప్రధాని మోదీ -
అమెరికాకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఐదు రోజుల అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అమెరికాతో పాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని తెలిపారు. అమెరికాకు బయల్దేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఒక ప్రకటనను విడుదల చేశారు. కోవిడ్ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్ సదస్సులో దృష్టి పెడతామని వెల్లడించారు. ‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహా్వనం మేరకే అక్కడికి వెళుతున్నాను. 22–25 వరకు యూఎస్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటాం’’అని మోదీ చెప్పారు. ఈ పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను కూడా కలుసుకొని ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి గల అన్ని అవకాశాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. గగనతలం వినియోగానికి పాక్ ఓకే: అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాకిస్తాన్ అనుమ తించింది. కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దు తర్వాత ప్రధాని, రాష్ట్రపతి విదేశాలకు వెళితే తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాక్ నిరాకరిస్తూ వచి్చంది. దీంతో పాక్ ధోరణిపై భారత్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఎఒ)లో తన నిరసన గళాన్ని వినిపించింది. అఫ్గానిస్తాన్ గగనతలం సురక్షితం కాదు కాబట్టి ఈసారి మోదీ విమానానికి పాక్ అనుమతించింది. వరుస సమావేశాలతో ప్రధాని బిజీ ► సెపె్టంబర్ 23న (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలోని వాషింగ్టన్లో మేజర్ కంపెనీల సీఈవోలతో సమావేశమై చర్చించనున్నారు. క్వాల్కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, ఆటమిక్స్, బ్లాక్‌స్టోన్ కంపెనీల సీఈవోలతో చర్చిస్తారు. అదే రోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ► సెపె్టంబర్ 24న (శుక్రవారం) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్‌హౌస్‌లో చర్చలు జరుపుతారు. అఫ్గానిస్తాన్ పరిణామాలు దాని ప్రభావం, సీమాంతర ఉగ్రవాదం, పెరిగిపోతున్న చైనా ఆధిపత్యం, భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోనూ భేటీ అవుతారు. జపాన్ ప్రధాని యోషిహిడో సుగాతో విడిగా చర్చలు జరుపుతారు. అదే రోజు అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్ దేశాలతో కూడి న క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. ఆ సమావేశం ముగిశాక న్యూయార్క్ బయల్దేరి వెళతారు. ► 25న (శనివారం) ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ► సెప్టెంబర్ 26 (ఆదివారం ) భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటారు. -
క్వాడ్‌తో చైనా కలవరం.. ఎందుకంత ఉలికిపాటు?
అమెరికాలో క్వాడ్ సదస్సు జరుగుతుంటే చైనా ఎందుకు ఉలిక్కిపడుతోంది? అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్ దేశాలు భద్రతలో పరస్పరం సహకరించుకుంటే చైనాకు వచి్చన ఇబ్బందేంటి? అసలు ఎందుకీ క్వాడ్ ఏర్పాటైంది? దాని లక్ష్యాలేంటి? క్వాడిలేటరలర్ సెక్యూరిటీ డైలాగ్, సింపుల్‌గా క్వాడ్..అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్ దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజనాలు కాపాడుకుంటూ భద్రతలో ఒకరికొకరు సహకరించుకోవడం దీని లక్ష్యం. 2004లో సునామీ అల్లకల్లోలం తర్వాత విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి ఏర్పడిన ఈ కూటమి 2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబె చొరవతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపనే లక్ష్యంగా రూపాంతరం చెందింది. ఇప్పటివరకు క్వాడ్ సమావేశాలు విదేశాంగ మంత్రులు, దౌత్య ప్రతినిధుల మధ్య మాత్రమే జరిగాయి. ఈ ఏడాది మార్చిలో కరోనా విజృంభణ కారణంగా నాలుగు దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తొలిసారిగా ప్రత్యక్షంగా ఈ నెల 24 (శుక్రవారం)న వాషింగ్టన్లో సమావేశమవుతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో ఈ క్వాడ్ సదస్సు జరగడం చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చైనాతో చిక్కులు క్వాడ్ భాగస్వామ్య దేశాలన్నీ చైనాతో ఏదో రకంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మేలో చైనా బలగాలు భారత్ సైనికులపై దాడి చేసిన తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఆర్థికంగా, మిలటరీ శక్తితో భారత్‌కు చైనా సవాళ్లు విసురుతోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడిచింది. కరోనా సంక్షోభం సమయంలో ట్రంప్ దానిని చైనా వైరస్ అనడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇక దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం, సెంకకు, డయోయూ దీవులపై డ్రాగన్ దేశానికున్న ఆసక్తి జపాన్‌కు ప్రమాదకరంగా మారింది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీకైందన్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆ్రస్టేలియా డిమాండ్ చేయడంతో చైనా ఆ దేశంపై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు దేశాల కూటమి కలిసి చర్చించుకుంటున్నాయంటే చైనాలో కలవరం మొదలైంది. చర్చకు వచ్చే అంశాలు ► ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు పెరిగిపోతున్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం నెలకొల్పడం ► దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం దేశాలను కూడా కలుపుకొని క్వాడ్ ప్లస్ కూటమి ఏర్పాటు ► కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచదేశాలన్నింటికీ అందేలా వ్యాక్సిన్ పంపిణీ ► పర్యావరణ మార్పుల్ని ఎదుర్కోవడం ► సైబర్ స్పేస్, జీ5 టెక్నాలజీలో పరస్పర సహకారం ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సవాళ్లు ఇండో పసిఫిక్ ప్రాంతంలో నానాటికీ చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని దీవుల్లో మిలటరీ స్థావరాలను నిర్మించడం మొదలు పెట్టింది. ఇవన్నీ అమెరికాను ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే అమెరికా వాణిజ్య కార్యకలాపాలాన్నీ ఈ సముద్రం ప్రాంతం ద్వారా ఎక్కువగా జరుగుతాయి. 2019లో 1.9 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం ఇండో పసిఫిక్ ప్రాంతం ద్వారానే జరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచ ఎగుమతుల్లో 42 శాతం, దిగుమతుల్లో 38 శాతం ఈ ప్రాంతం ద్వారా జరిగాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అలాంటప్పుడు చైనా ఆ ప్రాంతంలో పట్టుబిగించడం అన్ని దేశాలకు తలనొప్పిగానే మారింది. మొదట్నుంచీ క్వాడ్ కూటమిని వ్యతిరేకిస్తూ వస్తున్న చైనా.. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహాలపై క్వాడ్ చర్చిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఏం చేయాలో తెలియక రగిలిపోతోంది. దేశాల మధ్య ఒప్పందాలు, ఆయా దేశాల ప్రయోజనాలు కాపాడుకోవడం, వారి మధ్య విశ్వాసం పెరగడానికి దోహదం చేయాలి తప్ప మూడో దేశాన్ని మధ్యలోకి లాగకూడదని చైనా అంటోంది. మూడో పక్షాన్ని టార్గెట్ చేసే ఏ సదస్సు కూడా తన లక్ష్యాలను చేరుకోలేదన్నది చైనా వాదనగా ఉంది. మరోవైపు అమెరికా అఫ్గాన్ నుంచి సేనల్ని వెనక్కి తీసుకు వచ్చాక చైనాను ఎదుర్కోవడంపైనే దృష్టి సారించింది. అంతర్జాతీయంగా అమెరికా తన పూర్వవైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఎట్టకేలకు క్వాడ్ శిఖరాగ్రం
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం ఒక ప్రతిపాదనగా మొదలైన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల భావన ఇప్పుడు శిఖరాగ్ర సమావేశం వరకూ వచ్చింది. శుక్రవారం తొలి శిఖరాగ్రం జరగబోతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్య దేశాలుగా వున్న ఈ కూటమిపై మొదట్లో చైనా శంకలకు పోయింది. అది తనకు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న కూటమి అని, దక్షిణ చైనా సముద్ర జలాల్లో తన ఆధిక్యతను తగ్గించేందుకు జపాన్, అమెరికాలు ఏకమై భారత్, ఆస్ట్రేలియాలను కూడా కలుపు కొని రూపొందించిన వ్యవస్థ అని భావించింది. కానీ తాజాగా జరగబోయే శిఖరాగ్ర సమావేశానికి ముందు బుధవారం చేసిన ప్రకటనలో చైనా కొంత వెనక్కి తగ్గిన దాఖలా కనబడుతోంది. ఈ ప్రాంతంలో శాంతిసుస్థిరతలకు దోహదపడేలా... ఇక్కడి ప్రయోజనాలను పరిరక్షించేలా, పార దర్శకంగా, అందరినీ కలుపుకొనిపోయే రీతిలో క్వాడ్ వుండాలని కోరుకుంటున్నట్టు ప్రకటించింది. మూడేళ్లక్రితం ప్రతిపాదన స్థాయి దాటి సంస్థాగత రూపం సంతరించుకోవటం మొదలైనప్పుడు చైనా ఇందుకు భిన్నంగా స్పందించింది. ‘ఇది కేవలం పతాకశీర్షికలకెక్కడానికి చేస్తున్న ప్రయత్నం. సముద్రంలో కొట్టుకొచ్చే నురుగలాంటిది. కనుమరుగు కావటానికి ఎంతో కాలం పట్టదు’ అని వ్యాఖ్యానించింది. మొత్తానికి తొలిసారి క్వాడ్ దేశాల అధినేతలు ఆన్లైన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు. దక్షిణాసియాలో, హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా అడుగులేయాలని నిర్ణయించుకున్నప్పటినుంచి మన దేశం క్వాడ్‌పై ఆసక్తి చూపటం మొదలుపెట్టింది. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) పేరిట యూరేసియా, హిందూ మహా సముద్ర తీర ప్రాంతాలను కలిపే బృహత్తర ప్రాజెక్టుకు చైనా రూపకల్పన చేయటం, అది మన వ్యూహాత్మక ప్రాంతాలను ఒరుసుకుంటూ వుండటంతో మన దేశం అప్రమత్తమైంది. అలాగని కేవలం చైనా వ్యతిరేకత ఒక్కటే క్వాడ్‌కు ప్రాతిపదికగా వుండటం సమ్మతం కాదని మన దేశం తెలిపింది. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ఆ సంగతిని స్పష్టంగానే చెప్పారు. మూడేళ్లక్రితం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ మాటే అన్నారు. ఇండో–పసిఫిక్ భావన కేవలం భౌగోళిక పరమైనదే తప్ప, వ్యూహాత్మకమైనది కాదని వివరించారు. ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకోని దీన్ని రూపొందించటం లేదని తెలిపారు. అయితే చైనా వ్యవహారశైలి క్రమేపీ మారుతూ వస్తోంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో, తూర్పు లద్దాఖ్‌లో, హాంకాంగ్, తైవాన్ తదితరచోట్ల దాని దూకుడు పరో క్షంగా క్వాడ్‌కు మళ్లీ ప్రాణం పోసింది. బైడెన్ వచ్చాక కూడా క్వాడ్‌కు అమెరికా మంచి ప్రాధాన్యత ఇస్తోంది. అమెరికా రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నవారు తొలుత నాటో ప్రధాన కార్యాలయం కొలువుదీరిన బ్రస్సెల్స్ సంద ర్శిస్తారు. అందుకు భిన్నంగా కొత్త రక్షణమంత్రి ఆస్టిన్ లాయిడ్ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంపైనే శ్రద్ధపెట్టారు. ఆ వెంటనే శిఖరాగ్ర సదస్సు తేదీలు ఖరారయ్యాయి. ప్రపంచంపై ఆధిపత్యానికి చైనా ప్రయత్నిస్తున్నదని, దాన్ని సకాలంలో కట్టడి చేయకుంటే ముప్పు కలుగు తుందని అమెరికా నమ్ముతోంది. ఇలాంటి అభిప్రాయమే క్వాడ్‌లోని ఇతర దేశాలకు కూడా వుంది. జపాన్‌కు దక్షిణ చైనా సముద్ర జలాల్లో, ఆస్ట్రేలియాకు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆ దేశంతో సమస్యలున్నాయి. భౌగోళికంగా చూస్తే అమెరికాకు చైనాతో సమస్యల్లేవు. కానీ మొత్తంగా తన ఆధిపత్యానికి ఆ దేశం ఎసరు పెట్టవచ్చునని అమెరికా ఆందోళనలో వుంది. ట్రంప్ ఏలుబడి పుణ్యమా అని యూరొపియన్ యూనియన్(ఈయూ) తన తోవ తాను చూసుకుంది. నాటో కూటమి కొనసాగాలంటే దానికయ్యే వ్యయం భరించాలని ట్రంప్ అప్పట్లో చెప్పటం ఈయూ దేశాలకు ఆగ్రహం కలిగించింది. ఇదే అదునుగా ఈయూతో చైనా సన్నిహితమైంది. బైడెన్ వచ్చే లోపు ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలను మొన్న జనవరిలో ముగించి, సూత్రప్రాయమైన అవగాహనను కుదుర్చుకుంది. ఇలా ఎక్కడికక్కడ తలనొప్పిగా మారిన చైనాపై అమెరికాకు ఆగ్రహం వుండటంలో ఆశ్చర్యం లేదు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి అవసరమైన నిధులు సమీకరించటం, కీలక సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు, వాతావరణ మార్పులు వంటి అంశాలు క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో చర్చకు రాబోతున్నాయి. వీటితోపాటు ఇండో–పసిఫిక్ దేశాల భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సమీక్షిస్తారు. ఇక్కడే మన దేశం ఆచి తూచి అడుగేయటం ఉత్తమం. చైనాతో మనకు సమస్యలున్న మాట వాస్తవమే. మొన్న వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికులు రెచ్చిపోయి, అకారణంగా ఘర్షణలకు దిగి మన జవాన్లను పొట్టనబెట్టుకున్నా మన దేశం సంయమనం చూపింది. ఆ దేశంతో ఎంతో ఓపిగ్గా పలు దఫాలు చర్చలు జరిపి ఆ సమస్యకొక పరిష్కారాన్ని సాధించగలిగింది. ఇతర అంశాల విషయంలో కూడా ఈ వైఖరే మన దేశానికి మేలు చేస్తుంది. అమెరికా–పూర్వపు సోవియెట్ యూనియన్ల మధ్య దశాబ్దాలపాటు సాగిన ప్రచ్ఛన్న యుద్ధం పర్యవసానాలు అందరికీ అనుభవమే. ఆ రెండు దేశాలతోపాటు వాటి వెనక సమీకృతమైన దేశా లన్నీ అప్పట్లో అభివృద్ధి ప్రాజెక్టులపై కన్నా భద్రతపై ఎక్కువ కేంద్రీకరించాల్సివచ్చింది. ఆ పరిస్థితి మరోసారి తలెత్తకూడదు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సు అందుకు అనుగుణమైన నిర్ణయాలు తీసు కోవాలని ఆశించాలి. -
మన రైలు.. ఇక మరింత వేగం!
సాక్షి, హైదరాబాద్: మన రైలు వేగం మరింత పెరగనుంది. గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగు పెట్టనుంది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇది సరికొత్త మైలురాయి కావడం విశేషం. స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ కారిడార్లను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేయడంతో అక్కడ రైళ్లు వేగంగా వెళ్లడానికి మార్గం సుగమమైంది. లాక్డౌన్ సమయంలో... స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ పేరుతో దేశవ్యాప్తంగా రెండు కారిడార్లను కేంద్రం అభివృద్ధి చేసింది. డబ్లింగ్ లైన్ ఉన్న మార్గాలను అనుసంధానిస్తూ ఉత్తర–దక్షిణ భారత రాష్ట్రాలను కలుపుతూ ఈ మార్గాలు విస్తరించాయి. వీటిలో ప్రమాదకర మలుపులు లేకుండా చేయటంతోపాటు కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ, 260 మీటర్ల పొడవున్న పట్టాలను పటిష్టమైన రీతిలో ఏర్పాటు చేశారు. లాక్డౌన్ సమయం లో ఈ పనులు పూర్తి చేశారు. అనంతరం జూలై నుంచి దశలవారీగా ఆర్డీఎస్ఓ పర్యవేక్షణలో కన్ఫర్మేటరీ అసిలోగ్రాఫ్ కార్‌తో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించారు. తర్వాత పూర్తిస్థాయి రైళ్లను గరిష్ట వేగంతో నడిపి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవటంతో ఆ పరీక్షలు విజయవంతమైనట్టు ప్రకటించారు. తాజాగా రైల్వే సేఫ్టీ కమిషనర్ కొన్ని చిన్నచిన్న సూచనలు చేస్తూ రైళ్లను గరిష్ట వేగంతో నడిపేందుకు అనుమతి మంజూరు చేశారు. దీంతో రెండుమూడు వారాల్లో ఆ మార్పులు పూర్తిచేసి రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,280 కి.మీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,612 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్ విస్తరించి ఉండగా.. ప్రస్తుతానికి 1,280 కిలోమీటర్ల మేర ఈ తరహా ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. స్వర్ణ వికర్ణ కారిడార్‌కు సంబంధించి బల్లార్షా నుంచి కాజీపేట వరకు 234 కి.మీ., కాజీపేట నుంచి విజయవాడ, గుంటూరు వరకు 510 కి.మీ., స్వర్ణ చతుర్భుజి కారిడార్‌లో (చెన్నై–ముంబై సెక్షన్) 536 కి.మీ. ఈ మార్గం ఉంటుంది. ఇప్పటికే సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైళ్లను నడుపుతున్నారు. ఇకపై మిగతా మార్గాల్లో కూడా ఇది అమలవుతుంది. ప్రస్తుతం ఆ మార్గాల్లో 90 కి.మీ. నుంచి 110 కి.మీ. గరిష్ట వేగంగా ఉంది. కొన్ని మార్గాల్లో పరిమిత దూరం 120 కి.మీ. వరకు నడుపుతున్నారు. సింగిల్ లైన్లు, సరైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ లేని మార్గాల్లో మాత్రం రైళ్లు ఇప్పటిలాగానే సాధారణ వేగంతో నడుస్తాయి. ఇందులో కొన్ని ప్రధాన మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్–నిజామాబాద్ మార్గం ఒకటి. -
చైనాను ఢీకొట్టే శక్తి.. భారత్‌కు మాత్రమే
న్యూఢిల్లీ : చతుర్భుజ కూటమి ఏర్పాటు.. అదే సమయంలో ’ఇండో-పసిఫిక్‘ అనే పదాన్ని డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించడం అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రంప్ కీలక వ్యాఖ్యల నేపథ్యంలో పలు దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలు చైనాకు పోటీగా చతుర్భుజ కూటమిగా ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌తో బంధాలను మరింత ధృఢపరచుకునే దిశగా ఫ్రాన్స్ అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఇండియన్ ఓషియన్ రీజియన్ (ఐఓఆర్)లో భాగంగా భారత్‌తో ఉన్నత స్థాయి చర్చలకు ఫ్రాన్స్ సిద్ధమవుతోంది. మనీలాలో జరిగిన ఇండియా-ఏసియన్ సదస్సులో చతుర్భుజ కూటమి చర్చల అనంతరం భారత్ బంధంపై ఫ్రాన్స్ మరింత ఆసక్తి చూపుతోంది. ఇదే విషయాన్ని భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగేల్మర్ వివరించారు. ఇండియన్ ఓషియన్ రీజియన్‌లో చైనా ఆధిపత్యాన్ని నిలువరించాలంటే.. భారత్‌తో బంధాన్ని మరింత ధృఢం చేసుకోవాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి జేన్ యువాస్ డ్రెన్, 2018 ఆరంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రాన్ భారత్‌లో పర్యటిస్తారని ఆయన తెలిపారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఫ్రాన్స్ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని ఆయన అన్నారు. హిందూ మహాసముద్రంలో నౌకా స్థావరాల ఏర్పాటు, ద్వీపాల రక్షణ, ఇతర అంశాల్లో భారత్ సహకారం తమకు అవసరమని ఫ్రాన్స్ పేర్కొంది. -
చైనాను ఢీకొట్టే శక్తి.. భారత్ మాత్రమే
-
చైనా కట్టడికి చతుర్భజ వ్యూహం!
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఎదురులేని ఆర్థిక, సైనిక శక్తిగా అవతరించిన చైనా ఆధిపత్య ధోరణిని కట్టడిచేయడానికి పదేళ్లనాటి ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి రంగం సిద్ధమైంది. దక్షిణ చైనా సముద్రంపై పూర్తి పెత్తనం కోరుతున్న చైనా ఆటలు సాగకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాతో కూడిన నాలుగుదేశాల కూటమి(ఇంగ్లిష్‌లో క్వాడ్రిలేటరల్ క్వాడ్) అవసరమని జపాన్ ప్రధాని షింజో అబే 2007లో సూచించారు. తర్వాత నెల రోజులకే ఆయన పదవి నుంచి వైదొలిగాక ఈ చైనా ‘వ్యతిరేక’ చతుర్భజం ఐడియా మరుగునపడిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు అబే జపాన్ ప్రధానిగా తన స్థానం బలోపేతం చేసుకున్నాక ఈ ప్రతిపాదనకు గట్టి ఆమోదముద్ర లభించింది. ఇటీవల 31వ ఆగ్నేయాసియా, 12వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనడానికి ఈ నాలుగు దేశాల నేతలు మనీలా వచ్చిన సందర్భంగా నాలుగు రాజ్యాల కూటమి ప్రతిపాదనపై ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. షింజో మొదటిసారి ఈ ఆలోచనను 2007 ఆగస్ట్‌లో భారత పార్లమెంటులో ప్రసంగిస్తూ వెల్లడించారు. ‘‘ఇండోపసిఫిక్ ప్రాంతంలో ఇండియా, జపాన్ కలిసి పనిచేస్తే ఈ విశాల ఆసియా ప్రాంతం పసిఫిక్మహాసముద్ర ప్రాంతాలన్నిటినీ కలుపుకుని ఇక్కడి దేశాల మధ్య సంబంధాలను బలోపేతంచేసే శక్తిగా అవరిస్తుంది . ఈ క్రమంలో వీటికి అమెరికా, ఆస్ట్రేలియా జతకూడితే ఇక్కడ ప్రజలు, సరకులు, పెట్టుబడులు, పరిజ్ఞానం స్వేచ్ఛగా ఒక చోట నుంచి మరో చోటకు పయనించడానికి వీలవుతుంది.’’అని షింజో వివరించారు. షింజో లక్ష్యమేంటి? అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచంలో ప్రధానపాత్ర పోషించే ఆసియా, పసిఫిక్ దేశాల రవాణాకు దక్షిణ చైనా సముద్రం ఎంతో కీలకమైంది. అయితే, ప్రపంచీకరణ ఫలాలతో బలమైన ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా ఈ సముద్రప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించేవిధంగా చర్యలు తీసుకుంటోంది. పొరుగుదేశాలను బెదరించే ధోరణిలో ప్రకటనలు చేస్తోంది. అదీగాక, చైనాతో ప్రాదేశిక వివాదాలతో సతమతమైన జపాన్ఈ కమ్యూనిస్టు రాజ్యం అనుసరించే పెత్తందారీ ధోరణులకు వ్యతిరేకంగా సంకీర్ణం నిర్మించాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా అగ్రరాజ్య ఆధిపత్య హోదా నెమ్మదిగా బలహీనం కావడంతో నాలుగుదేశాల ప్రాంతీయ కూటమి అత్యవసరమనే అభిప్రాయానికి జపాన్వచ్చినట్టు కనిపిస్తోంది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా తాజా పరిణామాల ఫలితంగా చైనాకు ఇండియా మరింత దూరం కావడంతో భారత్‌ను ఈ కూటమిలో చేర్చుకోవడానికి ఇదే మంచి తరుణమని కూడా షింజే భావిస్తున్నారు. అధ్యక్షపదవి చేపట్టినప్పటి నుంచీ చైనాను కట్టడి చేయడానికి ట్రంప్చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అమెరికా ఈ కూటమి ప్రతిపాదనపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. అమెరికాను అనుసరించే ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ‘చతుర్భుజం’లో భాగంకావడానికి సిద్ధమైంది. పదేళ్ల క్రితం ఈ ప్రతిపాదన వెల్లడికాగానే చైనా చేసిన బెదిరింపులు, అప్పటి ఆర్థిక సమస్యల కారణంగా జపాన్మినహా మిగిలిన మూడు దేశాలూ వెనక్కి తగ్గాయి. కొత్త కూటమి చేయాలిందేంటి? హిందూమహాసముద్ర ప్రాంతం, ఆగ్నేయాసియా ప్రాంతం మీదుగా ముడి చమురు చైనాకు రవాణా అవుతోంది. అందుకే ఈ ప్రాంతాలపై తన ప్రభావం, ఆధిపత్యం ఉండేలా చైనా చాలా కాలంగా పావులు కదుపుతూ చాలా వరకు అనుకున్నది సాధించింది. దౌత్య, ప్రాంతీయ సంబంధాల్లో ఇండియా కొంత వెనుకబడడం చైనాకు ఇప్పటి వరకూ కలిసొచ్చింది. బర్మా, బంగ్లాదేశ్, శ్రీలంకతో చైనాకు సంబంధాలు బాగా బలపడ్డాయి. రెండు నెలలకు పైగా డోక్లామ్వివాదంతో విసిగిపోయిన భారత్‌కు ఈ ‘క్వాడ్’ కూటమిలో చేరడం మంచి అవకాశంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ చైనా ప్రవర్తన గమనిస్తే అంతర్జాతీయ చట్టాలపై దానికి గౌరవం లేదనే అభిప్రాయం కలుగుతుంది.అందుకే ఆదివారం మనీలాలో జరిగిన అధికారుల స్థాయి క్వామ్సమావేశంలో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో అందరూ నియమనిబంధనలతో కూడిన పద్ధతి అనుసరించడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించే క్రమంలో అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా నౌకా రవాణాకు, గగనతలంలో విమానాలకు అడ్డంకులు లేకుండా చూడడం, ఇక్కడ నౌకలకు భద్రత కల్పిస్తూ, ఉగ్రవాదుల నుంచి సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం వంటి అంశాలపై నాలుగు దేశాల ప్రతినిధులు చర్చించారు. చైనా వన్ బెల్ట్ - వన్ రోడ్(ఓబీఓఆర్ - బెల్ట్ రోడ్ ప్రాజెక్టు)కు ట్రంప్ ప్రత్యామ్నానికి మార్గం సులువవుతుందా? చైనా ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆర్భాటంగా అమలుచేస్తున్న బెల్ట్ రోడ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ ఈ ప్రాంతంలో సూచించే ఆర్థిక మౌలికసదుపాయాల ప్రాజెక్టు ఈ కూటమి బలపడితే ఆచరణలోకి వస్తుందని భావిస్తున్నారు. చైనా ఆధిపత్య ధోరణికి సవాలు విసురుతూ కూటిమి కడతున్న ఈ నాలుగు దేశాలూ ప్రజాస్వామ్యపంథాలో నడుస్తున్నాయి. ‘ప్రజాతంత్ర వజ్రం’ గా జపాన్అభిర్ణిస్తున్న ఈ క్వాడ్ కూటమి చైనా దుందుడుకు పోకడలను ఎంత వరకు అడ్డుకుంటుందో! స్వేచ్ఛగా, అందరికి అందుబాటులోకి తీసుకొద్దామనుకుంటున్న దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఈ నాలుగు దేశాలు లేకున్నా సమీపంలోని దేశాల్లో అమెరికాకు సైనిక స్థావరాలున్నాయి. జపాన్, ఆస్ట్రేలియాలూ దానికి దగ్గర్లోనే ఉన్నాయి. ఈ కూటమి రూపుదిద్దుకునే క్రమంలో చైనా ఎలా స్పందిస్తుందనే అంశంపై సభ్యదేశాల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఆర్థికంగా బలపడిన నాలుగు పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ పేరుతో చేతులు కలపడం చైనాకు పెద్ద సవాలే. (సాక్షి నాలెడ్జ్సెంటర్) -
సైకిల్ తో భారత స్వర్ణ చతుర్భుజిని దాటాడు..!
ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లలో తన సైక్లింగ్ ను పూర్తి చేసిన ఓ యువకుడు... ఇప్పుడు తన భారత ప్రయాణంవైపు దృష్టి సారించాడు. సన్నని దారులు, ఇరుకైన ప్రాంతాల్లోని అడ్డంకులను సైతం తప్పించుకొంటూ ప్రయాణించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే కివి సైకిల్ తో... రికార్డు సాధనే ధ్యేయంగా దూసుకుపోతున్నాడు. భారత ప్రధాన నగరాల్లో పారిశ్రామిక వ్యవసాయ, సాంస్కృతిక కేంద్రాలుగా పనిచేసే రహదారి నెట్వర్క్ స్వర్ణ చతుర్భుజిని దిగ్విజయంగా దాటేశాడు. రెండేళ్ళ క్రితం 24 ఏళ్ళవయసున్న టిమ్ ఛిట్టాక్ తన ఫాస్టెట్ సైక్లింగ్ తో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ పర్యటనలు ముగించుకొని తాజాగా భారత్ లో ప్రవేశించాడు. న్యూజిల్యాండ్ వైకటో విశ్వవిద్యాలయంనుంచి లా అండ్ ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన ఛిటాక్... ఫిబ్రవరి 27న ఢిల్లీలో న్యూజిల్యాండ్ ఎంబసీనుంచీ సైకిల్ ప్రయాణం ప్రారంభించాడు. సగటున 250 కిలోమీటర్ల చొప్పున మొత్తం 24 రోజుల్లో 6000 కిలోమీటర్ల దూరం సైకిల్ ప్రయాణం చేస్తూ చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, జైపూర్, కాన్పూర్, పూనే, సూరత్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మొదలైన నగరాలన్నీ చుట్టేశాడు. తాను సవాలుగా స్వీకరించిన ఈ సైక్లింగ్ తనకు గొప్ప అనుభవాన్నిచ్చిందని ఛిటాక్ చెప్తున్నాడు. సైక్లింగ్ చేయడానికి జాతీయ రహదారులు కొంత సహకరించేవిగానే ఉంటాయని, ఇన్నర్, లింక్ రోడ్లలో ప్రయాణమే పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పాడు. తాను ప్రయాణంలో ఉన్నపుడు కనీసం రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసుకుంటానని చెప్తున్న ఛిటాక్... ఒకసారి ఓ ట్రక్ కింద పడబోయి తృటిలో తప్పించుకున్నట్లు తెలిపాడు. భారత స్వర్ణ చతుర్భుజిపై సైక్లింగ్ చేసి, గిన్నిస్ రికార్డును సాధించే ప్రయత్నంలో ఛిటాక్ రోజుకు 80 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కినట్లు చెప్పున్నాడు. గిన్నిస్ ను సంప్రదించిన అనంతరం ప్రారంభించిన అతడి ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమౌతుందో తెలియాల్సి ఉంది.