భర్త దుబారా ఖర్చు: భార్య ఆత్మహత్య
రాచర్ల: భర్త దుబారా ఖర్చులు పెడుతుండటంతో అనవసర ఖర్చులు వద్దని వారిస్తు వస్తున్న భార్య చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బైళ్ల సాల్మాన్ ఆర్మీలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం సెలవు నిమిత్తం వచ్చిన సాల్మాన్ తన తండ్రి జ్ఞాపకార్థం గ్రామంలో బండలాగుడు పోటీలు నిర్వహించాడు. ఈ విషయమై గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అనవసర ఖర్చులు తగ్గించుకోమని.. భార్య పలుమార్లు చెప్పిన పట్టించుకోని సాల్మాన్ నిన్న అట్టహాసంగా పోటీలు నిర్వహించాడు. దీంతో రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన పుష్ప(32) వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించే లోపే మృతి చెందింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నా