‘ముత్తూట్’ మరవకముందే మరో చోరీ
జహీరాబాద్ : పట్టణంలో ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి గురైన సంఘటనను మరవక ముందే హనుమాన్ మందిర్ రోడ్డు లో గల రఫీ జ్యూవెలర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో 50 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. అయితే దోపిడీలో ఆరి తేరిన వారే బంగారు దుకాణంలో దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
దుకాణం గురించి అంచనా వేసిన అనంతరమే చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జ్యూవెలర్స్ షాప్‌లోని పై అంతస్తులో బట్టల దుకాణం కూడా నిర్వహిస్తుండడంతో దొంగలు ముందుగానే దుకాణం గురించి పూర్తిగా అవగాహన పొంది న అనంతరమే దోపిడీకి పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయాన్ని పలువు రు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ గా.. ముత్తూట్ ఫైనాన్స్‌లో అప్పట్లో భారీగా దొంగతనం జరిగింది. అంత కు ముందు కూడా జహీరాబాద్ ప్రాంతంలోని పలు బ్యాంకులలో దొంగతనం, దొంగతనం యత్నం జరిగింది.
2013 మార్చి 18న కొత్తూర్ (బీ) గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో చోరికి పాల్పడి రూ.3.75 లక్షల నగదును అపహరించారు. 2013 మార్చి 28న కోహీర్ మండలం కవేలి సిండికేట్ బ్యాంకు ను దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ సందర్భంగా దొంగలు జరిపిన కాల్పుల్లో అప్పటి ఎస్ఐ వెంకటేష్ గాయపడిన విష యం తెలిసిందే. 2013 జూన్ 25న జహీరాబాద్ మండలం మల్చల్మ సిండికేట్ బ్యాంకులో దొంగలు చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు.
దొంగల కోసం ప్రత్యేక టీంలు
దొంగలను పట్టుకునేందుకు గాను పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. దొంగతనం జరిగిన తీరు ను బట్టి ఎక్కడి గ్యాంగ్ పని అయి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీలో జార్ఖం డ్ ప్రాంతానికి చెందిన వారిగా అప్ప ట్లో పోలీసులు గుర్తించారు. వారిలో కొందరు ఇప్పటికే పట్టుబడ్డారు. జూయలర్స్ దుకాణం దోపిడీకి సంబంధించి పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారు ఉండి ఉంటారా అనే విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.