ragunandhan
-
రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. టీఆర్ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. రేణుకా చౌదరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రోజుల వ్యవధిలో తెలంగాణలో ముగ్గురు మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. తెలంగాణలో పసి పిల్లలకు కూడా రక్షణ కరువైంది. ఇదేనా బంగారు తెలంగాణ అంటే..?. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసును నీరుగారుస్తున్నారు. వేలల్లో కేసులు నమోదయితే.. 46 కేసులలో మాత్రమే దోషులకు శిక్ష పడింది. జూబ్లీహిల్స్ మైనర్ కేసును వదిలేది లేదు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు విప్పడంలేదు. షీ టీమ్స్ ఏమయ్యాయి..?. మైనర్ వీడియోను బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా దోషే. రఘునందన్ రావు ఇన్నోవా బండి వీడియో ఎందుకు బయటపెట్టలేదు. ఆయన సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త వాంగ్మూలంలో మంత్రి పువ్వాడనే తన చావుకు కారణం అని చెప్పినా ప్రభుత్వం నుంచి చర్యలు లేవు. నగరంలో రక్షణ లేనప్పుడు..పెట్టుబడులు ఎలా వస్తాయి. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగింది. లైసెన్స్‌లు ఇస్తుంది.. ఎక్సైజ్ శాఖ కాదా..?’’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు -
దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి
సాక్షి, సిద్దిపేట/ సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నోట్ల కట్టలపై హైడ్రామా కొనసాగింది. పోలీసుల సోదాలు, బీజేపీ కార్యకర్తల హల్చల్, తోపులాట, డబ్బులు లూటీ, పోలీసుల లాఠీచార్జి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డగింపుతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల కోడ్ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన డబ్బులను సోదాచేసి పట్టుకున్నామని పోలీసులు చెప్పగా.. పోలీసులే డబ్బులు తెచ్చిపెట్టి సోదాల్లో దొరికాయని చెబుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. విమర్శలు, ప్రతివిమర్శలు, నినాదాలతో సిద్ది్దపేట పట్టణం హోరెత్తింది. దుబ్బాక ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం సిద్దిపేటలోని లెక్చరర్స్ కాలనీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ సురభి రాంగోపాల్‌రావు, పక్కనే ఉన్న సురభి అంజన్‌రావు ఇంటిలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ (ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్) ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. నోట్ల కట్టలతో ఉన్న బ్యాగుతో పోలీసు ఈ సందర్భంగా అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని ప్రచారం చేస్తున్నారంటూ... బీజేపీకి చెందిన పలువురు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో వందలాది మంది కార్యకర్తలు వచ్చి అంజన్‌రావు ఇంట్లోకి వెళ్లారు. అక్కడ పోలీసుల వద్ద ఉన్న డబ్బులను బలవంతంగా లాక్కొని ఈ డబ్బు పోలీసులే తీసుకువచ్చారని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని రఘునందన్‌రావు, అంజన్‌రావు, రాంగోపాల్‌రావులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని లాఠీచార్జి చేసి బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. గొడవ విషయం తెలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిì సంజయ్ కరీంనగర్ నుంచి బయలుదేరి వస్తుండగా... సిద్దిపేట శివారులో పోలీసులు అడ్డుకున్నారు. పక్కనే ఉన్న కార్యకర్తలు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. అనంతరం సంజయ్‌ని తిరిగి కరీంనగర్ పంపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పరిస్థితిని వివరిస్తున్న రఘునందన్‌రావు, ఆయన సతీమణి నాకు సంబంధం లేదు: రఘునందన్‌రావు మా అత్తగారి ఇంటిపక్కనే ఉన్న ఇంట్లో డబ్బులు దొరికితే తనకేం సంబంధమని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. దసరా సందర్భంగా తన భార్య, కూతురు, మనువరాలు అత్తగారి ఇంటికి వచ్చారని చెప్పారు. ప్రచారంలో ఉన్న తాను మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేశానని, తీయకపోవడంతో అనుమానం వచ్చి సిద్దిపేటకు రాగా పోలీసుల సందడి కనిపించిందని చెప్పారు. మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా పోలీసులు ఇల్లంతా చిందరవందర చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రచారం చేసుకుంటున్న తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అంజన్‌రావు ఇంట్లో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట తనిఖీల్లో డబ్బు దొరికింది: పోలీస్ కమిషనర్ దుబ్బాక ఉపఎన్నికల్లో నిబంధనలకు విరుద్దంగా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్దిపేటలో డబ్బు నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం మూడు చోట్ల సోదాలు నిర్వహించగా డబ్బులు దొరికాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విజయ్ సాగర్, పోలీసు సిబ్బంది కలిసి... మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సుతోపాటు రఘునందన్‌రావు బంధువులు సురుభి అంజన్‌రావు, సురభి రాంగోపాల్‌రావు ఇళ్లలో సోదాలు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా అంజన్‌రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ సోదాల్లో ప్రతీది రికార్డు చేశామన్నారు. అయితే విషయం తెలుసుకున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 250 మంది అనుచరులతో పోలీసులపై దాడి చేసి రూ. 12.80 లక్షలు తీసుకెళ్లారని చెప్పారు. వీడియో ఫుటేజీల ద్వారా వీరిని గుర్తించి రికవరీ చేస్తామని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. డబ్బు విషయంపై ప్రశ్నించగా జితేందర్‌రావు డ్రైవర్ తెచ్చి ఇచ్చాడని, ఈ డబ్బులను కొద్దికొద్దిగా దుబ్బాకకు పంపించేందుకు ఇక్కడ పెట్టామని స్వయంగా అంజన్‌రావు చెప్పిన వాగ్మూలం రికార్డు చేశామని సీపీ జోయల్ డేవిస్ వివరించారు. లెక్చరర్స్ కాలనీలోని రఘునందన్‌రావు మామ ఇంటి పక్కన ఉన్న అంజన్‌రావు నుంచి వాంగ్మూలం రికార్డు చేస్తున్న సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విజయ్ సాగర్, సీపీ జోయల్ బీజేపీ గుండాగిరీ: హరీశ్‌రావు దుబ్బాక ఉపఎన్నికల్లో గెలువలేమని తెలుసుకున్న బీజేపీ నాయకులు అడ్డదారిలో వెళ్లి ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో డబ్బుల లొల్లిపై దుబ్బాక ప్రచారంలో ఉన్న ఆయన మాట్లాడారు. బీజేపీ అసత్య ప్రచారానికి దిగుతోందని ఆరోపించారు. మొన్నటికి మొన్న శామీర్‌పేట సమీపంలో బీజేపీ నాయకుల దగ్గర డబ్బులు దొరికాయన్నారు. అనుమానంతో సోమవారం రఘునందన్‌రావు బంధువు ఇంటిని తనిఖీ చేశారని, డబ్బు దొరికితే తమ తప్పులు బయటపడతాయనే ఆలోచనతో బీజేపీ కార్యకర్తలు గుండాల్లా ప్రవర్తించి పోలీసుల వద్దనున్న డబ్బులు గుంజుకపోయారన్నారు. దౌర్జన్యం చేసి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. అమిత్ షా ఆరా.. సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఎంపీ బండి సంజయ్‌ని ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన గొంతు పట్టుకొని వాహనంలో కుక్కారని అమిత్ షాకు సంజయ్ వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అభ్యర్థి ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాల గురించి వివరించినట్లు తెలిపాయి. కమలం పార్టీది కపట నాటకం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటజోన్: గత రెండు పర్యాయాలు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ గోబెల్స్ ప్రచారం, అభూత కల్పనలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అందులో భాగంగానే పట్టుబడిన డబ్బుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కమలం పార్టీ నానా యాగీ చేస్తూ కపట నాటకం ఆడుతోందన్నా రు. సిద్దిపేటలో జరిగిన పరిణామాలపై సోమ వారం రాత్రి హరీశ్ స్పందించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో రెడ్‌హ్యాండెడ్‌గా, తహసీల్దార్ సమక్షంలో వీడి యో చిత్రీకరణల మధ్య డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులే స్పష్టం చేశారన్నారు. సోమవారం బీజేపీకి సంబంధించిన ఇద్దరి ఇళ్లతో పాటు టీఆర్ఎస్కు చెందిన సిద్ది పేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, చేగుంట మండలంలో టీఆర్ఎస్ నేత ఇంట్లో కూడా సోదాలు జరిగాయన్నారు. రఘునందన్ ఎన్ని కల్లో ఖర్చు చేసేందుకే డబ్బు నిల్వ చేశామని బంధువు ఇచ్చిన వాంగ్మూలం వీడియో రికా ర్డు ఉందన్నారు. దీన్ని ఎన్నికల అధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. వాస్తవాలు తెలియకుండా బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు ట్రాప్‌లో పడ్డారన్నారు. -
భయపడొద్దు.. ఎదుర్కొందాం : కిషన్‌రెడ్డి
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులకు, వారి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, దుబ్బాక ఉప ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిద్దామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. సిద్దిపేట పట్టణంలో దుబ్బాక బీజే పీ అభ్యర్థి మామ ఇంట్లో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తనిఖీల అనంతరం రఘునందన్‌రావును సోమవారం రాత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులను పరిశీలించారు. రఘనందన్‌రావు కుటుంబసభ్యులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాలపై అధికారులతో నిర్బంధం విధించడం సరికాదన్నారు. సెర్చ్‌వారెంట్ లేకుండా పోలీసులు ఇళ్లంతా చిందరవందర చేసి, మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించారన్నారు. ఎన్నికల ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న జితేందర్‌రెడ్డి, వివేక్‌లను హైదరాబాద్‌కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌కు బలవంతంగా తరలించారన్నారు. అధికారం శాశ్వతం కాదనేది టీఆర్ఎస్ గుర్తించాలి నియంతృత్వ పరిపాలనను తెలంగాణ ప్రజ లు తిప్పికొడతారన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తించాలన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, చెన్నారెడ్డి లాంటి హేమాహేమీలను ఓడించిన ఘన చరిత్ర ప్రజలకు ఉందన్నారు. అధికారం మా కుటుంబానికి మాత్రమే శాశ్వతం అనే పద్ధతి సరికాదన్నారు. రఘునందన్‌రావుకు ప్రచారం నిర్వహించుకు నే హక్కు ఉందన్నారు. తెలంగాణతో సహా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న రఘునందన్‌రావును ప్రభుత్వం నిర్బంధం చేయడం సరికాదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యకర్తలు శాంతియుతంగా గ్రామాల్లో ప్రచా రం నిర్వహించాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలువబోతోందని, అందుకే అధికార పార్టీ అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తోందన్నారు. -
సుజాతకు అఖండ మెజార్టీ ఖాయం
సాక్షి, దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికలో దివం గత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, క్రాంతి తదితరులు సుజాతను ఓదార్చారు.ప్రచారానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు జాడల్లో నడిచిన గొప్ప ప్రజా నాయకుడు రామలింగారెడ్డి అని చెప్పారు. ఆయన ఆశయాల సాధన కోసం సీఎం ఆ కుటుంబానికే టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. పేదల కష్టాలు తెలిసిన సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పారు. ‘సుజాత నాకు చెల్లెలాంటిది. ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. మా చెల్లెకు సీఎం కేసీఆర్ సందేశం ఇచ్చి.. టికెట్ ఖరారు చేశారని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం, విశ్వాసం నింపేందుకు వచ్చామని తెలిపారు. సుజాతకు తాను, ఎంపీ ప్రభాకర్ ఎడమ, కుడి భుజాలమని, అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తామన్నారు. దుబ్బాక దశ, దిశను మార్చిన గొప్ప నాయకుడు రామలింగారెడ్డి అని కితాబిచ్చారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సుజాతకు తాము వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. రఘునందన్‌కు హైకోర్టులో ఊరట సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండల పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనపై అరెస్టులాంటి బలవంత చర్యలేవీ చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటీ చేయబోతున్నారని, ఈ నేపథ్యంలో ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు. -
వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్‌కు అవార్డు
సీఎం చేతుల మీదుగా నేడు పురస్కారం కోరుట్ల: కోరుట్ల వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ టి.రఘునందన్‌కు ఉన్నత విద్యలో ఉత్తమఅధ్యాపక అవార్డు వచ్చింది. రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాన్ని సీఎం చేతుల మీదుగా గురువారం అందుకోనున్నారు. హన్మకొండకు చెందిన రఘునందన్ హైదరాబాద్‌లో 1990లో ఎంవీఎస్సీ కోర్సు, 2006లో పీహెచ్డీ పూర్తిచేశారు. 1993లో ఆముదాలవలస అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా నియమితులయ్యారు. 25ఏళ్లుగా పలు హోదాల్లో ప్రొఫెసర్‌గా పనిచేసి 2012లో అసోసియేట్ డీన్‌గా పదోన్నతి పొందారు. మే నెలలో కోరుట్ల వెటర్నరీ డీన్‌గా నియమితులయ్యారు. రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్సిటీలో అంతరించిపోతున్న దక్కన్ గొర్రెల జాతిపై పరిశోధనలు, అండర్గ్రాడ్యూయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మేజర్ అడ్వైజర్‌గా, వివిధ అంతర్జాతీయ సెమినార్ల పరిశోధన పత్రాలు పరిశోధించారు. రేడియో, టెలివిజన్ కార్యక్రమాల్లో గొర్రెలు, పశువులు, మేకలు, పందుల పెంపకందార్లకు సూచనలు అందిస్తూ అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. 2014లో నెస్స్ ఫౌండేషన్ నుంచి రైతుబంధు అవార్డు అందుకున్నారు. ఇండియన్ డెయిరీ అసోసియేషన్, ఇండియన్ సొసైటీఫర్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, స్మాల్ రూమినెంట్ సొసైటీ, న్యూట్రిషన్ సొసైటీ వంటి సంస్థల్లో ఆయన జీవిత కాల సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. 2015లో వారంపాటు ఫ్రాన్స్ వెళ్లి అక్కడ అర్బినెట్ ప్రాజెక్టులో కరువులో పశుగ్రాసాలు అన్న అంశంపై జరిగిన వర్క్‌షాపులో పాల్గొన్నారు. విద్యాబోధనతో పాటు పశువైద్యం, పెంపకం, పోషణలో పరిశోధనలు నిర్వహించిన క్రమంలో యూనివర్సిటీస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా టి.రఘునందర్ ఎంపిక కావడం విశేషం. బాధ్యతలను పెంచింది ఉత్తమ పురస్కారం నా భాధ్యతను మరింత పెంచింది. పశుసంరక్షణ, పెంపకం, పోషణ వంటి అంశాల్లో రైతులకు ప్రయోజనకర అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తా. రైతులు నేరుగా వెటర్నరీ కళాశాలకు వచ్చి పశుపెంపకంలో మెలకువలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. –రఘునందన్, అసోసియేట్ డీన్, కోరుట్ల