బాటిల్ కోసం వ్యక్తిని చెప్పుతో కొట్టిన పాపులర్ సింగర్.. వీడియో వైరల్
ఒక్కోసారి సెలెబ్రెటీలు వింతగా ప్రవర్తిస్తుంటారు. కోపం వస్తే తమ అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. చిన్న చిన్న వాటికి సిబ్బందిపై చేయి చేసుకుంటారు. తాజాగా పాకిస్తాన్కు చెందిన పాపులర్ సింగర్ రాహత్ ఫతేహ్ అలీఖాన్.. ఓ బాటిల్ కోసం తన శిష్యుణ్ని చెప్పుతో కొట్టాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఎక్స్(ట్విటర్)లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్కు చెందిన పాపులర్ సింగర్ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ గురించి తెలిసిందే. పాకిస్తాన్లో కాకుండా ఆయనకు భారత్లో సైతం అభిమానులు ఉన్నారు. అనేక హిందీ సినిమాలకు ఆయన పాటలను ఆలపించాడు. తాజాగా ఆయన ఇంట్లో పవిత్ర జలానికి సంబంధించిన బాటిల్ కనిపించకుండా పోయిందట.
(చదవండి: ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్.. ‘గురూజీ’కి బన్నీ షాక్!)
దానికి కారణంగా శిష్యుడే కావడంతో అతన్ని బూతులు తిడుతూ.. చెప్పుతో కొట్టాడు. అతని జట్టు పట్టుకొని లాగుతూ నేలపై కూర్చోబెట్టి ‘నా బాటిల్ ఎక్కడ’ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ దారుణంగా కొట్టాడు. తనని వదిలేయాలంటూ బాధితుడు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. చివరకు ఇతర సిబ్బంధి వచ్చి అతన్ని నిలువరించారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది కాస్త వైరల్ అయింది. సింగర్ చర్యపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బాటిల్ కోసం అతన్ని అంతలా చితక్కొట్టాలా? ఎంత పెద్ద సెలెబ్రెటీ అయినా..ఇలా చేయడం మంచిది కాదంటూ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ని ట్రోల్ చేస్తున్నారు.
క్షమాపణలు చెప్పిన అలీఖాన్
చెప్పుతో కొడుతున్న వీడియో వైరల్ కావడంతో అలీఖాన్ ఈ ఘటనపై వివరణ ఇస్తూ ఓ వీడియోని విడుదల చేశాడు. ఇది గురు, శిష్యుల మధ్య జరిగిన విషయమని, స్టూడెంట్ తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని చూడాలని విజ్ఞప్తి చేశాడు. బాధితుడు తన శిష్యుడే అయినప్పటికీ.. అలా కొట్టడం తప్పేనని క్షమాపణలు చెప్పాడు.
ఇదే వీడియోలో బాధితుడు మాట్లాడుతూ.. పవిత్ర జలానికి సంబంధించిన బాటిల్ కనిపించకుండా పోవడానికి తానే కారణమని.. అందుకే అలీఖాన్ దండించారని తెలిపారు. అలీఖాన్ తనకు తండ్రిలాంటి వాడని, తనను ప్రేమగా చూసుకుంటాడని చెప్పారు. కోపంలో ఆయన తనను కొట్టాడని.. అంతకు మించి దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదన్నాడు. తమ గురువు పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను వైరల్ చేశారని బాధితుడు చెప్పడం గమనార్హం.
Famous singer Rahat Fateh Ali khan beating his servent for bottle of Alcohol pic.twitter.com/9DZwYxgPmV
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) January 27, 2024
Update : Rahat Fateh Ali Khan ( @RFAKWorld )issued a clarification regarding his viral video, There was holy water in the bottle pic.twitter.com/oIStHwWXFp
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) January 27, 2024