ప్రగతి పట్టాలెక్కేనా?
రైల్వే బడ్జెట్లో వరాలపై తిరునగరి వాసుల ఆసక్తి
{పభూ, గుప్తా కరుణిస్తేనే పెండింగ్
{పాజెక్టులకు మోక్షం కలగామారిన వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్
తిరుపతికి ఏటా రైల్వే బడ్టెట్‌లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి రోజూ వేలాదిగా వచ్చే భక్తుల కోసం వరల్డ్‌క్లాస్ స్టేషన్‌ను నిర్మిస్తామని దాదాపు దశాబ్దకాలంగా కేంద్రం చెబుతూనే ఉంది. కానీ వాస్తవ పరిస్థితిలో ఏ మాత్రం కానరావడం లేదు. ఇటీవల రైల్వే మంత్రి, జీఎం వేర్వేరుగా తిరునగరికి వచ్చిన సందర్భంగా స్థానిక ఎంపీ వారికి ప్రత్యేక నివేదికను అందించారు. తాజాగా విజయవాడ సమావేశంలోనూ తన డిమాండ్లను తెలియజేశారు. ఇందులో యాభైశాతం ఆమోదించినా.. న్యాయం జరిగినట్టేనని భావిస్తున్నారు. ఎంపీ ఇచ్చిన నివేదికలోని అంశాలపై ప్రత్యేక కథనం..
తిరుపతి అర్బన్: దక్షిణమధ్య రైల్వేలోనే ఎక్కువ ఆదా యం వచ్చే మొదటి మూడు స్టేషన్లలో ఒకటైన తిరుపతికి ఈ రైల్వే బడ్టెట్లోనైనా న్యాయం చేయాలని ప్రజలు, రైల్వే కార్మికులు కోరుతున్నారు. ఇక్కడి ప్రధాన సమస్యల గురించి ప్రతిసారీ ఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖతో సహా ఆ శాఖ ఉన్నతాధికారులకు, సికింద్రాబాద్‌లోని జీఎంలకు ఎన్నోసార్లు నివేదిం చా రు. అయినా ఫలితం మాత్రం కనిపించ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏర్పాటు చేసిన రైల్వే బడ్జెట్ ప్రతిపాదనల సమావేశంలో ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ ప్రత్యేక నివేదికను అందించారు.
తిరుపతి ఎంపీ ప్రతిపాదనలివీ...
రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా తక్షణం రైల్వే డివిజన్ ఏర్పాటు కు చర్యలు చేపట్టాలి. తిరుపతి పరిధిలోని రేణిగుంట సీఆర్ఎస్ లో కేవలం రైలు బోగీల మరమ్మతులు కాకుండా బోగీల తయారీ దిశగా నిధులు, విస్తరణ అభివృద్ధి పనులు చేపట్టాలి.అంతర్జాతీయ హోదాస్థాయికి రైల్వేలోని అన్ని విభాగాలను అభివృద్ధి చేసేందుకు నిధులు పుష్కలంగా విడుదల చేయాలి.తిరుపతి దక్షిణం వైపు రైల్వే ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి మరిన్ని ప్లాట్‌ఫాంలు, ప్రయాణికుల వసతి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. తిరుపతి, నడికుడి రైల్వేలైన్ పూర్తికోసం సమృద్ధిగా నిధులు మంజూరు చేయాలి. }M>-âహస్తిలో అన్ని ప్రధాన రైళ్లకు స్టాపింగ్ సౌకర్యం కల్పించాలి.
తిరుపతి నగరంతో పాటు వెంకటగిరి, గూడూరు సమీపంలో జరుగుతున్న కొన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తికి, అవసరమైన చోట కొత్త ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు ఇవ్వాలి.తిరుపతి, చిత్తూరు నుంచి విజయవాడ వరకు మరిన్ని కొత్త రైళ్ల ఏర్పాటుకు చర్య లు చేపట్టాలి. సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకు పొడిగించి నడపాలి. రాష్ట్రంలోని పోర్టులకు అనుసంధానంగా రైల్వే ప్రాజెక్ట్‌లు అభివృద్ధి చేయాలి. జిల్లా పరిధిలోని మరికొన్ని రైల్వే సమస్యలు నిత్యం వేలాదిగా తాకిడి ఉండే రైల్వే ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికుల కోసం స్టేషన్ పరిసరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలి. రైల్వేస్టేషన్లో ప్రయాణికులందరికీ ఆరోగ్యకరమైన తాగునీటి సరఫరాకు ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేయాలి. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల మంది రైల్వే కార్మికులు, ఉద్యోగుల సౌకర్యార్థం తిరుపతిలో రైల్వే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు మోక్షం కల్పించాలి. రైల్వే కార్మికుల సౌకర్యార్థం రైల్వే స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
తిరుపతిలోని మెకానికల్, సేఫ్టీ, రైల్వే పోలీస్, ఎలక్ట్రికల్, కోచ్ డిపో విభాగం, శానిటరీ విభాగాల్లోని వందలాది ఖాళీలను భర్తీ చేయాలి. చిత్తూరు, పాకాల, మదనపల్లి, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లను మరింత అభివృద్ధి చేయాలి. తిరుపతిలో కార్మికులు, ఉద్యోగులకు అవసరమైన రైల్వే క్వార్టర్స్ నిర్మాణం దిశగా చర్యలు తీసుకోవాలి.చిత్తూరు జాతీయ రహదారిలోని అన్ని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఈ సంవత్స రం అయినా ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు కేటాయించాలి. తిరుపతితో పాటు రేణిగుంట, చంద్రగిరి, తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్లలోని ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసి అభివృద్ధిని వికేం ద్రీకరించి ప్రయాణికులకు సేవలు విస్తృ తం చేయాలి. వీటిలో ఎంత మేరకు ఆమోదిస్తారో వేచి చూడాల్సి ఉంది.
ప్రతిపాదనలకే వరల్డ్‌క్లాస్ పరిమితం
తిరుపతి రైల్వేకి ప్రపంచ స్థాయి అభివృద్ధి చేకూరుస్తామని 2008 నుంచి రైల్వే మంత్రులు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ అంశం కొన్నాళ్ల పాటు మరుగున పడినప్పటికీ... ఇటీవల నగరానికి వచ్చిన రైల్వే జీఎం రవీంద్రగుప్తా చేసిన ప్రకటనతో మరోసారి చర్చనీయాంశమైంది. విజయవాడలో దక్షిణమధ్య రైల్వే జీఎం ఆధ్వర్యంలో జరిగిన రైల్వే బడ్జెట్ ప్రతిపాదనల సమావేశంలో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అందించిన ప్రతిపాదన నివేదికలకు రైల్వేశాఖ మోక్షం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.