RAINBOW HOSPITALS
-
నాకు మా బావ అంటే చాలా ఇష్టం.. కానీ
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్‌కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్‌తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్‌గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్‌లో.. భవిష్యత్‌లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్‌ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. నాకు 43 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడంలేదు. స్కానింగ్ ద్వారా ఇంకెన్ని రోజుల్లో నాకు పీరియడ్స్ ఆగిపోవచ్చనేది తెలుసుకోవచ్చా? – జి. ప్రసన్నకుమారి, కోటగిరి మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. మామూలుగా నెలలు ఆగి.. ఏడాది వరకూ రాకపోతే దాన్ని మెనోపాజ్‌గా పరిగణిస్తాం. పెరీమెనోపాజ్.. అంటే మెనోపాజ్ కంటే రెండుమూడేళ్లు ముందు.. వెనుక టైమ్ అన్నమాట. అండాశయాల్లో అండాలు తయారుకానప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. మెనోపాజ్‌కి సగటు వయసు 51 ఏళ్లు. నలభై అయిదేళ్లలోపు ఆగిపోతే ఎర్లీ మెనోపాజ్ అంటారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో గర్భసంచి లైనింగ్ పలుచగా ఉండడం, అండాశయాల్లో అండాలు లేదా ఫాలికిల్స్ లేకపోవడం.. మెనోపాజ్ అని చెప్పడానికి కొన్ని మార్గాలు.. సూచనలు. నిర్ధారించడానికి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అనే రక్తపరీక్ష చేసినప్పుడు అది 35 కన్నా ఎక్కువ ఉంటే మెనోపాజ్ అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ఒంట్లోంచి వేడివేడి ఆవిర్లు, ఆ వెంటనే చెమటలు, మూడ్‌స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నెలలు ఆగిపోయిన తర్వాత కూడా గర్భసంచి లైనింగ్ పలుచగా కాకుండా దళసరిగా అంటే 5ఎమ్ఎమ్ కన్నా ఎక్కువగా ఉంటే తర్వాత పరీక్షల కోసం సూచిస్తాం. దీనిని ఎండోమెట్రియల్ హైపర్ప్లాజియా అంటారు. అందుకే 40 నుంచి 45 ఏళ్లలోపు నెలసరి ఆగిపోతే టీఎస్‌హెచ్, థైరాయిడ్ పరీక్షలను కచ్చితంగా చేయించాలి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
IPO: రెయిన్బో టార్గెట్ రూ.2,000 కోట్లు
న్యూఢిల్లీ: మల్టీ స్పెషాలిటీ పిల్లల హాస్పిటల్ చెయిన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. 29న ముగుస్తుంది. దీని ద్వారా సంస్థ రూ. 2,000 కోట్లు సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. ఇష్యూలో భాగంగా రూ. 280 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రస్తుత వాటాదారులు 2.4 కోట్ల వరకు షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటర్లు రమేష్ కంచర్ల, దినేష్ కుమార్ చీర్ల, ఆదర్శ్ కంచర్ల.. ప్రమోటర్ గ్రూప్‌నకు చెందిన పద్మ కంచర్ల, అలాగే ఇన్వెస్టర్లయిన బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (గతంలో సీడీసీ గ్రూప్), సీడీసీ ఇండియా.. ఓఎఫ్ఎస్లో వాటాలు విక్రయించనున్నారు. అర్హత కలిగిన ఉద్యోగుల కోసం 3 లక్షల షేర్లను కేటాయించనున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను .. గతంలో జారీ చేసిన నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లకు ముందస్తుగా చెల్లించడం, కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయడం, వైద్య పరికరాలను కొనుగోలు చేయడం తదితర అవసరాల కోసం సంస్థ వినియోగించుకోనుంది. చదవండి: ఐపీవో బాటలో క్యాంపస్ షూస్, గోదావరీ బయో..! -
ఎవరిది లోపం?
గర్భం రాకపోవడానికి స్త్రీ, పురుషులలో ఎక్కువ బాధ్యత లేదా లోపం ఎవరిదై ఉంటుంది? లోపాల విషయానికి వస్తే ఇద్దరిదీ సమానబాధ్యత ఉంటుందా? ఫెల్లోపియన్ ట్యూబుల్లో వచ్చే సమస్యలు కూడా గర్భం రాకపోవడానికి కారణం అంటుంటారు. దీని గురించి వివరించగలరు. – టి.ఎన్., గుంటూరు ఆడవారిలో సమస్యల వల్ల, 35% మగవారిలో సమస్యల వల్ల, 30% ఇరువురిలో సమస్యలు ఉండడం వల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మగవారిలో శుక్ర కణాలు తక్కువ ఉండటం, అసలు లేకపోవటం, వాటి నాణ్యత, కదలిక సరిగా లేకపోవటం, హార్మోన్ల లోపం, జన్యు లోపం, ఇన్ఫెక్షన్లు వంటి అనేక కారణాల వల్ల సంతానం కలగకపోవటానికి కారణాలు కావచ్చు. ఆడవారిలో హార్మోన్ల లోపం, అండం తయారు కాకపోవటం, అండం నాణ్యత సరిగా లేకపోవటం, గర్భాశయంలో లోపాలు, గడ్డలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు మూసుకొనిపోవటం, ఇన్ఫెక్షన్లు వంటివి... ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల సంతానం కలగడానికి ఇబ్బంది అవుతుంది. 30% మందిలో భార్య, భర్త ఇద్దరిలోను సమస్యలు, ఇంకా పరిశోధనలలో కూడా తెలియని ఎన్నో కారణాల వల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి సంతానం కలగనప్పుడు దంపతులు ఇద్దరూ కూడా తప్పనిసరిగా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆడవారిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల, ఇంకా కొన్ని కారణాల వల్ల గర్భాశయం ఇరువైపులా ఉండే ఫెలోపియన్ ట్యూబ్లలో వాపు, అడ్డంకులు ఏర్పడి, అవి మూసుకొనిపోవటం జరగవచ్చు. ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల అండం, వీర్యకణాలు ట్యూబ్‌లోకి ప్రవేశించలేకపోవటం, రెండూ ఒకటి కాలేకపోవటం వల్ల గర్భం ధరించటంలో ఇబ్బంది ఏర్పడుతుంది.ఫెలోపియన్ ట్యూబ్స్ తెరుచుకుని ఉన్నాయా, మూసుకొని ఉన్నాయా తెలుసుకోవటానికి హిస్టరోసాల్పింగో గ్రామ్ (హెచ్ఎస్జీ) అనే ఎక్స్–రే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ట్యూబ్స్ మూసుకొని ఉంటే, ల్యాపరోస్కోపి ద్వారా సరిచేయడానికి ప్రయత్నం చేయవచ్చు. నాకు నవ్వడం అంటే చాలా ఇష్టం. ఏ చిన్న జోక్ చెప్పినా విపరీతంగా నవ్వుతుంటాను. మావారు నన్ను రకరకాల జోక్స్ చెప్పి నవ్విస్తుంటారు. అయితే ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్‌ని. ఈ సమయంలో గట్టిగా నవ్వడం సరికాదని ఇంట్లో పెద్దలు చెబుతున్నారు. ఇది నిజమేనా? – ఆర్వి, కాజీపేట గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఎంతో ఆనందంగా సమయాన్ని గడిపితే అంతే ఆరోగ్యంగా బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదుగుతుంది. అలాగే తల్లి కూడా మానసిక ఆందోళన లేకుండా, తొమ్మిది నెలలు తేలికగా గడిచిపోతాయి. ప్రెగ్నెన్సీలో గట్టిగా నవ్వకూడదని ఎక్కడా లేదు. ఆరో నెల నుంచి కడుపులో బిడ్డ బయట శబ్దాలను వినగలుగుతుంది. అలాగే మీ మానసిక పరిస్థితి బిడ్డ ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుంది. గట్టిగా నవ్వడం వల్ల, కడుపులో బిడ్డ కూడా పైకి, కిందకి కదులుతుంది. గట్టిగా నవ్వడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దీనివల్ల మెదడు నుంచి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవి మనసుని, శరీరాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతాయి. అవయవాలకి రక్త సరఫరా పెరుగుతుంది. అలాగే బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకి దోహదపడుతుంది. కాబట్టి నువ్వు గట్టిగా నవ్వడాన్ని గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. నీకు ఎలా నవ్వాలనిపిస్తే అలా నవ్వుకోవచ్చు. దానివల్ల నీకు, పుట్టబోయే బిడ్డకి ఇద్దరికీ మంచిదే! నగరాల్లో నివసించే గర్భిణి స్త్రీలు gestational diabetes అనే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు ఈమధ్య చదివాను. దీని గురించి వివరించండి. ఇది రాకుండా ముందుజాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? – ఆర్.ఎన్., తాడిపత్రి గర్భిణీల రక్తంలో చక్కెర శాతం ఉండాల్సిన దాని కంటే పెరగడాన్ని gestational diabetes అంటారు. ప్రెగ్నెన్సీలో కొందరి శరీర తత్వాన్ని బట్టి, కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల, ముందు నుంచే బరువు అధికంగా ఉండటం, తల్లిదండ్రులలో షుగర్ వ్యాధి ఉండటం, ప్రెగ్నెన్సీ సమయంలో బరువు అధికంగా పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం... వంటి అనేక కారణాల వల్ల gestational diabetes వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. gestational diabetesనగరాల్లో ఉండే గర్భిణీలలోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాలలో ఉండే గర్భిణీలలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే నగరాలలో ఉండే కొంతమంది గర్భిణీలలో వారిలో ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల, ఎక్కువ శారీరక శ్రమ చెయ్యకపోవటం వల్ల, అధిక బరువు ఉండటం వల్ల నగరాలలో ఉండే గర్భిణీలలో gestational diabetesఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు ఉన్న మహిళలు, గర్భం రాకముందే బరువు తగ్గటం, గర్భం వచ్చిన తర్వాత ఆహారంలో స్వీట్స్, షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు, పండ్లలో అరటిపండు, సపోటా వంటివి తక్కువగా తీసుకోవటం, అధిక బరువు పెరగకుండా అన్నం తక్కువ తిని, కూరలు ఎక్కువ తీసుకోవటం, చిన్న చిన్న పనులు, కొద్దిగా వాకింగ్ వంటివి చేయడం వల్ల చాలావరకు gestational diabetesని కొందరిలో నివారించవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల వచ్చేgestational diabetesని నివారించలేక పోవచ్చు. కాకపోతే ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, తక్కువ మోతాదులో మందులతో gestational diabetes అదుపులో ఉంటుంది. అలాగే దానివల్ల వచ్చే సమస్యలు పెరగకుండా, కాంప్లికేషన్స్ ఎక్కువ కాకుండా బయటపడవచ్చు. -
'వంట చేయడం చాలా ఇష్టం.. కానీ టైం లేదు'
బంజారాహిల్స్ : వంట చేయడం అంటే తనకు చాలా ఇష్టమని అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వంట చేసే సమయం దొరకడం లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తాను మంచి భోజన ప్రియురాలినని, బంగ్లాకోడి వంటకం అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లో ఉలవచారు టై రెస్టారెంట్‌ను ఆమె శనివారం జస్టిస్ సుభాషణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉలవచారు తన దృష్టిలో బెస్ట్ ఫుడ్ అని, రెండు వారాలకోసారి ఈ హోటల్ నుంచే తెప్పించుకుంటానని వెల్లడించారు. పేరు నిండా ఆంధ్రాతనం ఉన్నా ఇక్కడన్నీ తెలంగాణ వంటకాలే లభిస్తుండటం విశేషం అన్నారు. ఇండియాలోనే హైదరాబాద్ ఫుడ్‌కు ఒక ప్రత్యేకత ఉందని.. ముఖ్యంగా 50 రకాల బిర్యానీలు లభ్యమవుతాయని చెప్పారు. లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడుతూ.. తాను కూడా భోజన ప్రియుడినేనని, రాజుగారి కోడి పులావ్ అంటే ఇష్టమని తెలిపారు. హైదరాబాద్ అంటే పెరల్స్, బ్యాంగిల్స్ మాత్రమే కాదని బిర్యానీ కూడా ఉందన్నారు. 'ముహూర్తం చూసుకుని పిల్లలను కనటం దురదృష్టకరం' బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో పిల్లల ఆస్పత్రి రెయిన్బో 'బర్త్ రైట్ బై రెయిన్బో' నినాదంతో ప్రవేశపెట్టిన కొత్త బ్రాండ్‌ను ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె.. ముహూర్తం చూసి పిల్లలను కంటున్నారని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సహజ ప్రసవాలపై ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అవగాహన తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా హీరో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ బర్త్ రైట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. -
సేవల్లో మరో రెయిన్బో హాస్పిటల్
-
రెయిన్బో హాస్పటల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు
-
‘శ్వాస’ అందించరూ ప్లీజ్!
మెదడులో ఫంగస్ గొంతు ద్వారానే శ్వాస అరుదైన వ్యాధితోబాధపడుతున్న బాబు కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ముద్దులొలికే తమ కొడుకును చూసి సంతోషించే అదృష్టం లేకుండా పోయింది ఆ బాబు తల్లిదండ్రులకు. ఎనిమిది నెలల వయసులో ఉన్న కొడుకు ముచ్చట్లను చూసి తరించాల్సిన ఆ తల్లిదండ్రులు బాబు అవస్థను చూసి తట్టుకోలేకపోతున్నారు. అందరిలా ముక్కుతో కాకుండా గొంతులో ఏర్పాటు చేసిన కృత్రిమ నాళం ద్వారా మాత్రమే శ్వాస తీసుకోగలడు. తమ కొడుకును కాపాడుకునేందుకు ఆర్థిక చేయూత ఇవ్వాలని కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నారు. నేత కార్మికుల ఇంట కన్నీరు.. కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన పవర్లూమ్ కార్మికుడు మధు, బీడీ కార్మికురాలు సుమలకు ఎనిమిది నెలల క్రితం ఓ బాబు (వర్షిత్) పుట్టాడు. ఒకమ్మాయి తర్వాత బాబు పుట్టడంతో తమ చిన్న కుటుంబం సాఫీగా సాగిపోతుందన్న సంతోషంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు చిన్నారి జబ్బు గురించి తెలిసీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఐదు నెలల క్రితం బాబుకు జబ్బు చేయగా స్థానిక ఆసుపత్రి వైద్యులు తమకు కేసు అర్థం కావడంలేదన్నారు. దాంతో బాబుని తల్లిదండ్రులు సికింద్రాబాద్ (విక్రమ్‌పురి)లోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకొచ్చారు. మెదడులో నీరు చేరిందని డాక్టర్లు చెప్పడంతో అందినకాడికి రూ.3లక్షలు అప్పులు తెచ్చి ఆపరేషన్ చేయించారు. మెదడు నుంచి పొత్తి కడుపు వరకు స్టంట్ వేశారు. ఇంతటితో వారి సమస్య తీరలేదు. కృత్రిమ స్టంట్ కారణంగా బాబుకు మెదడులో ఫంగస్ ఏర్పడింది. శ్వాస తీసుకోవడం కష్టసాధ్యమైంది. దీంతో గత డిసెంబర్లో మళ్లీ నగరానికి తీసుకొచ్చారు. వీరి దీనగాథను చూసి చలించిన రెయిన్బో ఆసుపత్రిలోని వైద్యుడు రమేశ్ తనవంతుగా ఉచిత చికిత్సను అందించడమే కాక, తనకు తెలిసిన వారి ద్వారా వీలైనంత వరకు ఆర్థిక సాయం చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఉంచే స్తోమత లేకపోవడంతో సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాలుడికి చికిత్స చేయిస్తున్నారు. ప్రతి రోజూ బాబును రెయిన్బో ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రత్యేకమైన ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారు. రెయిన్బో డాక్టర్ల దాతృత్వంతో చికిత్స ఉచితంగానే అందుతున్నప్పటికీ మందులకు పెద్ద ఎత్తున ఖర్చవుతోంది. ప్రతీరోజూ రూ.5వేల చొప్పున ఇంజక్షన్లు, మందులకు ఖర్చవుతోంది. ఇప్పటికీ కొందరు దాతలు ఇచ్చే సొమ్ముతోనే నెట్టుకొస్తున్నారు. మరో రెండు నెలల పాటు బాబుకు ఇదే చికిత్స కొనసాగిస్తే పరిస్థితి కొలిక్కి వచ్చే అవకాశముందని డాక్టర్లు పేర్కొన్నట్లు బాబు తల్లిదండ్రులు చెబుతున్నారు. బాబు వర్షిత్‌కు సాయం చేయాలనుకునే వారు సికింద్రాబాద్‌లోని రెయిన్బో ఆసుపత్రి వైద్యుడు రమేశ్‌ను కానీ, బాబు తల్లిదండ్రులను 9247861602, 92916 91925 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
వీలైతే నివారిద్దాం... లేదంటే అధిగమిద్దాం
అంగవైకల్యం ఎవరూ కోరుకోని స్థితి. ఎవరిమీదో ఆధారపడాల్సిన పరిస్థితి. వీలైతే ఆ స్థితిని నివారించడం లేదా దాన్ని అధిగమించడం ఎవరైనా చేయాల్సిన పనులు. ఎవరిలోనైనా ఒక అంగం వైకల్యానికి లోనైతే... మిగతా అంగాలు మరింత సామర్థ్యాన్ని పుంజుకుని, దాన్ని భర్తీ చేస్తాయని ఒక నానుడి. ఆ మాటను నిజం చేసే దృష్టాంతాలెన్నో! వారిలోనే కాదు... అంగవైకల్యం లేనివారిలోనూ స్ఫూర్తి నింపే ఉదంతాలెన్నో... ప్రపంచ వైకల్య దినం సందర్భంగా... పిల్లల్లో వచ్చే వైకల్యాలు, వాటి రకాలు, కారణాలు, నివారణ వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. అంగవైకల్యాలకు ప్రధాన కారణాలు =అంటువ్యాధులు = చిన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లు =త్వరగా మాతృత్వానికి దగ్గర కావడం =పోషకాహార లోపాలు =ఆసుపత్రి సేవలు అందుబాటులో లేకపోవడం =అపరిశుభ్రత =దగ్గరి బంధువుల్లో పెళ్లిళ్లు అంగవైకల్యాలను పురిగొలిపే రిస్క్ ఫ్యాక్టర్లు =గర్భవతిగా ఉన్నప్పుడు జ్వరం =గర్భంతో ఉన్నప్పుడు రేడియేషన్‌కు గురికావడం =బిడ్డ కడుపులో ఉండగా తల్లి ఏ రూపంలోనైనా పొగాకును వాడటం =తల్లిగర్భంలో ఉండగా వచ్చే దుష్ర్పభావాలు / ప్రసూతి సమయంలో దుష్ర్పభావాలు = పుట్టీపుట్టగానే వచ్చే కామెర్లు తీవ్రం కావడం వల్ల మెదడుపై దుష్ర్పభావం పడటం పుట్టిన తర్వాత బిడ్డ చాలా ఆలస్యంగా ఏడ్వటం = వికాసంలో వచ్చే మార్పులు ఆలస్యం కావడం (డిలేడ్ మైల్‌స్టోన్స్) = తల్లిదండ్రుల నిరక్షరాస్యతతో అనేక ఆరోగ్య సంబంధమైన అంశాలపై అవగాహన లేకపోవడం = చిన్నప్పుడు ఫిట్స్ / తలకు గాయం. వైకల్యంలో రకాలు స్థూలంగా... పిల్లల్లో రకరకాలైన వైకల్యాలు రావచ్చు. వాటిలో అంగాలకు సంబంధించే గాక, బుద్ధికి సంబంధించి కూడా ఉండవచ్చు. వైకల్యంలోని అనేక రకాల్లో కొన్ని... ఆటిజమ్ = చెవుడు/వినికిడి శక్తి తక్కువగా ఉండటం =అంధత్వం / దృష్టికి సంబంధించిన లోపాలు = బుద్ధిమాంద్యం = అర్థం చేసుకోగల సామర్థ్యం తక్కువగా ఉండటం =ఒకటి కంటే ఎక్కువ అంగవైకల్యాలు ఉండటం =శరీర అవయవాలకు సంబంధించిన వైకల్యాలు (ఆర్థోపెడిక్ ఇంపెయిర్మెంట్) =నేర్చుకునే శక్తి తక్కువగా ఉండటం =మూగతనం =తలకు (మెదడుకు) తీవ్రమైన గాయం కావడం వల్ల వచ్చే వైకల్యాలు (అక్వైర్డ్ బ్రెయిన్ ఇంజ్యురీ-ఏబీఐ) =సెరిబ్రల్ పాల్సీ వైకల్య లోపాలను నివారించడం / అధిగమించడం ఎలా? సాధారణ నివారణ చర్యలు (జనరల్ ప్రివెన్షన్) =లోపాన్ని వీలైనంత త్వరగా కని పెట్టి అధిగమించడాన్ని త్వరగా మొదలుపెట్టడం =ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యాన్ని కాపాడే చర్యలను తీసుకోవడం =అన్ని టీకాలూ సకాలంలో అందేలా చూడటం =ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా చేయడం =వాతావరణ ప్రమాదాలను (ఎన్విరాన్మెంటల్ హజార్డ్) నివారించడం =అంగవైకల్యం, పునరావాసం వంటి అంశాలపై అవగాహనపెంచే కార్యక్రమాల నిర్వహణ. ఆరోగ్య సంబంధమైన పరీక్షలు చూపు వినికిడి దంతాలు వ్యాధినిరోధక అంశాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడం న్యూట్రిషనల్ అసెస్మెంట్ డెవలప్మెంటల్ అసెస్మెంట్ తరచూ రక్తహీనత, రక్తంలో విషపదార్థాల అంచనా, క్షయ వంటి జబ్బులకు సంబంధించిన పరీక్షలు. ఒక్కొక్క అంశంపై విడివిడి జాగ్రత్తలు చూపు కాపాడటానికి : పిల్లల్లో అంధత్వానికి ప్రధాన కారణం విటమిన్-ఏ లోపం. కాబట్టి విటమిన్ ఏ పుష్కలంగా ఉండే పదార్థాలు ఇవ్వడం ద్వారా చూపు కాపాడటమే కాకుండా, నైట్బ్లైండ్నెస్ వంటి జబ్బులను నివారించవచ్చు. పిల్లలకు తరచూ కంటి పరీక్షలు చేయిస్తుండటం వల్ల వాళ్లలో చూపునకు సంబంధించిన సమస్యలను త్వరగా గుర్తించి అవసరాన్ని బట్టి అద్దాలతో సరిచేయదగిన వాటిని సరిదిద్దడం లేదా అవసరాన్ని బట్టి చికిత్స చేయడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చు. మెల్లకన్ను వంటివి ఉన్నప్పుడు దాన్ని చక్కదిద్దడానికి అవసరమైన కంటి వ్యాయామాలను నేర్పడం చేయవచ్చు. వినికిడి శక్తిని కాపాడటానికి: తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు వచ్చే కామెర్లవ్యాధికి వీలైనంత త్వరగా చికిత్స చేయించాలి. కుటుంబంలో ఎవరికైనా వినికిడి లోపాలు ఉంటే, తరచూ పిల్లలకు వినికిడి పరీక్ష చేయించాలి. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తే అది తగ్గేవరకూ పూర్తి చికిత్స చేయించాలి. పుట్టుకతో వచ్చే వినికిడి లోపాలను ముందుగానే తెలుసుకుని, కాక్లియర్ / హియరింగ్ ఎయిడ్ అమర్చడం వంటి చికిత్సలు చేయిస్తే వారికి వినికిడి శక్తి మాత్రమే గాక... మాట్లాడే శక్తి కూడా వస్తుంది. బుద్ధిమాంద్యత: పిల్లల్లో బుద్ధిమాంద్యానికి ప్రధాన కారణం హైపోథైరాయిడిజమ్. దీన్ని ఎంత త్వరగా గుర్తించి థైరాక్సిన్ హార్మోన్‌ను ఇస్తే అంత త్వరగా బుద్ధిమాంద్యతను నివారించవచ్చు. ఇక తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ‘ఐయొడైజ్డ్ ఉప్పు’ వాడటం వల్ల పిల్లల్లో బుద్ధిమాంద్యత ను నివారించవచ్చు. పుట్టుకతో వచ్చే అంగవైకల్యాల నివారణ/చికిత్స ఇలా... న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ (స్పైనా బైఫిడా): కాబోయే తల్లికి తగినంత ఫోలిక్ యాసిడ్ అనే పోషకం అందకపోతే బిడ్డలో ఏర్పడాల్సిన వెన్నుపాము (న్యూరల్ ట్యూబ్) సరిగా రూపొందకపోవచ్చు. ఈ పరిస్థితిని స్పైనా బైఫిడా అంటారు. ఈ వైకల్యం ఏర్పడితే బిడ్డ కడుపులో ఉండగానే మృతి చెందవచ్చు. ఒకవేళ పుట్టి బతికితే శారీరకంగా, మానసికంగా వైకల్యాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని తెలుసుకోవడం కోసం అవసరమైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. డౌన్స్ సిండ్రోమ్: బిడ్డలో ఉండాల్సిన క్రోమోజోముల సంఖ్య 46. ఏదైనా కారణాల వల్ల ఒక అదనపు క్రోమోజోము ఉంటే ఆ బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ అనే కండిషన్ వస్తుంది. దీనివల్ల బిడ్డలో బుద్ధిమాంద్యం కలుగుతుంది. ముప్ఫై అయిదేళ్ల తర్వాత గర్భం ధరించే మహిళల్లో బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఎక్కువ. అందుకే ఈ వయసు లో గర్భధారణ జరిగిన మహిళలతో పాటు మిగతా గర్భవతు లూ కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం. గర్భధారణ తర్వాత 11 - 14 వారాల మధ్యన కాబోయే తల్లి ఎన్టీ స్కాన్ పరీక్ష చేయించాలి. దీన్నే ఫస్ట్ సెమిస్టర్ స్క్రీనింగ్ అంటారు. ఒకవేళ ఎవరైనా పైపరీక్ష చేయించుకోకపోతే 15వ వారం నుంచి 20 వ వారం లోపున ట్రిపుల్ సీరమ్ స్క్రీనింగ్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేయించుకోవాలి. ఇందులో కడుపులోని పిండం తల్లి గర్భంలోకి విడుదల చేసే 3 - 4 రకాల ప్రోటీన్లను పరిశీలిస్తారు. వాటి పాళ్ల నిష్పత్తిని బట్టి బిడ్డకు వైకల్యం వస్తుందో రాదో చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీనితో డౌన్స్ సిండ్రోమ్ తెలుసుకునేందుకు 60- 70 శాతం అవకాశాలున్నా ఒక్కోసారి తప్పుడు ఫలితం రావచ్చు. అందుకే దీంతో పాటు ‘టిఫా’ స్కాన్ అనే పరీక్ష చేయిస్తే తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలో పాజిటివ్ వచ్చినంత మాత్రాన బిడ్డకు తప్పక వైకల్యం వస్తుందని కాదు. అందుకే 15వ వారంలో ట్రిపుల్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేయించి, ఫాల్స్ పాజిటివ్ గనక వస్తే... అప్పుడు గర్భధారణ తర్వాత 16వ వారంలో యామ్నియోసెంటైసిస్ అనే పరీక్షను చేయించుకుని, మొదట వచ్చింది నిజమైన పాజిటివా లేక ఫాల్స్ పాజిటివా అని నిర్ధారణ చేసుకోవాలి. నిర్మాణపరమైన అవయవ లోపాల కోసం టిఫా పరీక్ష: ఎవరిలోనైనా కడుపులోని బిడ్డలో అవయవ నిర్మాణాల పరమైన లోపాలు (స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్) ఉన్నట్లు అనుమానిస్తే వారికి టిఫా స్కాన్ అనే ప్రత్యేకమైన స్కానింగ్ చేయించాలి. జెనెటిక్ సోనోగ్రామ్ పరీక్షలు: బిడ్డ నిర్మాణంలో ఏవైనా లోపాలున్నాయా అని ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. ఇందులో క్రోమోజోమల్ సమస్యలూ తెలుస్తాయి. ఈ పరీక్ష ద్వారా బిడ్డ లోపలి అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లు-చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, అబ్డామినల్ అవయవాల (కడుపు లోపలి భాగాల) గురించి తెలుసుకోవచ్చు. - నిర్వహణ: యాసీన్ దగ్గరి బంధువులను పెళ్లి చేసుకుంటే వైకల్యాలు ఎందుకు ఎక్కువ? రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహాలు జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో అంగవైకల్యాలు, ఆరోగ్యసమస్యలు ఎక్కువ. ఎందుకంటే... బిడ్డలో తల్లివి 23, తండ్రివి 23 క్రోమోజోములు తల్లిదండ్రుల నుంచి పుట్టబోయే బిడ్డలకు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాయి. కాసేపు దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాదని అనుకుందాం. అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉందనుకుంటే... తల్లి తాలూకు మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అవుతుంది. అదే తల్లిలో ఉండే లోపభూయిష్టమైన అదే తరహా జన్యువును తండ్రి తాలూకు జన్యువు డామినేట్ చేసి, బిడ్డలో లోపం రాకుండా చూస్తుంది. కానీ ఇద్దరూ ఒకే కుటుంబాలకు సంబంధించిన వారైతే, ఇద్దరిలోనూ సదరు సమాచారాన్ని తీసుకెళ్లే జన్యువులో లోపం ఉందనుకుందాం. అప్పుడు దాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్ జన్యువు ఏదీ లేకపోవడంతో బిడ్డ లో జన్యుపరమైన లోపం వచ్చేందు కు అవకాశాలు ఎక్కువ. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డలు కావాలనుకు నేవారు, బిడ్డలకు వైకల్యం లేకుండా, ఉండాలనుకునేవారు రక్తసంబంధీకుల్లో వివాహాలు చేసుకోకపోవడమే మంచిది. డా. శివ నారాయణరెడ్డి వెన్నపూస కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ రెయిన్బో హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
రెయిన్బోలో పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళలు, చిన్న పిల్లలకు చికిత్సను అందించే రెయిన్బో హాస్పిటల్స్ భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే నాలుగేళ్ళలో రూ. 215 కోట్ల పెట్టుబడితో కొత్తగా నాలుగు హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రెయిన్బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో 450 పడకలు అందుబాటులో ఉన్నాయని, ఈ విస్తరణ తర్వాత 2017 నాటికి కొత్తగా 775 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. కర్నూలు, చెన్నై, పుణే, బెంగళూరు, విశాఖల్లో ఈ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఇక్కడ రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ విస్తరణ కావల్సిన నిధులను వ్యూహాత్మక భాగస్వాములు, రుణాలు, అంతర్గత నిధుల ద్వారా సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్‌కు చెందిన సీడీసీ, అబ్రాజ్లు సంయుక్తంగా పెట్టుబడి పెట్టిన రూ.100 కోట్లకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నాయి. ఈ పెట్టుబడికి సంబంధించి ఎంత వాటాను విక్రయించిందీ చెప్పడానికి కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు. ఏటా 25 శాతం వృద్ధితో రూ.100 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నట్లు రమేష్ వెల్లడించారు. ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి ఉపాధికి అధిక అవకాశం ఉండే వైద్యం, వ్యవసాయం, రెన్యువబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సీడీసీ రీజనల్ డెరైక్టర్ (దక్షిణాసియా) ఎన్.శ్రీనివాసన్ తెలిపారు. ఇప్పటికే ఇండియాలో ఫండ్ ఆఫ్ ఫండ్ రూపంలో బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టామని, నేరుగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రధమం అన్నారు. వచ్చే ఐదేళ్ళలో మరో బిలియన్ డాలర్లు పెట్టుబడికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా అబ్రాజ్ ప్రతినిధి రిషి మహేశ్వరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 200 కంపెనీల్లో 7.5 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.