Rajeev high way
-
ప్రజల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ (TIMS) సమీపంలో సీఎం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజీవ్ రహదారిపై 11 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. రూ. 2,232 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు. ఈ కారిడార్ పూర్తయితే.. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభం కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దీని ద్వారా మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని రేవంత్ విమర్శించారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కనబెట్టిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని చెప్పారు. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని చెప్పారు. చదవండి: 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు భైముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణశాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వమే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామని తెలిపారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికి సహకరించిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష పడిందని దుయ్యబట్టారు. ‘ఈ ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలి. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు. అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పు లేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా? ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే. కేసీఆర్ హయాంలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తప్ప ఏం రాలేదు. అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం. కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం. ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేసిండు. ట్విట్టర్లో పోస్టులు పెట్టుడా? మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటుండు.ఈ వేదికగా కేటీఆర్‌కు నేను సూచన చేస్తున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలి. ఆయన దీక్షకు దిగితే మా కార్యకకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారు.’ అని రేవంత్ పేర్కొన్నారు. -
జేసీబీని ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు
రంగారెడ్డి(శామీర్‌పేట్): కారు, జేసీబీని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పుష్కరాలకు వెళ్లిన వస్తున్న నగరవాసులు శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్ చౌరాస్తా వద్ద రాజీవ్ రహదారిపై ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఐదుగురు పుష్కరాల సందర్భంగా గురువారం తెల్లవారుజామున కారులో కరీంనగర్ జిల్లా ధర్మపురికి వెళ్లి అదేరోజు రాత్రి తిరిగి నగరానికి ప్రయాణమయ్యారు. రాజీవ్ రహదారిపై వస్తుండగా మండలంలోని మజీద్‌పూర్ చౌరాస్తా వద్దకు రాగానే ఓ జేసీబీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. -
క్యారీ ఆన్..
సంక్రాంతికి ఇటు విజయవాడ హైవే.. దసరాకి అటు రాజీవ్ రహదారి యమ బిజీ! రైళ్లు, బస్సులు నిండిపోయి.. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎడాపెడా చార్జీలు బాదేసి దండుకునే సమయం! ఇలాంటి అవస్థనే ఎదుర్కొన్నఇనుగల ప్రదీప్‌రెడ్డి తలపుల్లోంచి ఊడిపడ్డదే ‘coyatri.com’! అతని పరిచయం.. కోయాత్రి స్థాపనకు దారితీసిన ఆ అవసరం గురించి... - శరాది ప్రదీప్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నప్పుడు లాంగ్ వీకెండ్స్‌కి ఆయన స్వస్థలం వరంగల్ వెళ్లాలంటే బస్సుల్లో సీట్స్ దొరికేవి కావు. ఇక నిరుడు సంక్రాంతి పండగకి అమ్మమ్మ వాళ్ల ఊరైన ఖమ్మం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడూ అదే అవస్థ.. ఒక్క బస్సూ ఖాళీలేదు. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణానికి సిద్ధమైతే... డబుల్, త్రిబుల్ చార్జెస్ వసూలు చేశారు. తిరిగి వచ్చేటప్పుడూ అదే పరిస్థితి. హైదరాబాద్ చేరగానే ఆఫీస్ పనిలో పడిపోయినా ఆయన మెదడు మాత్రం ఈ విషయం సీరియస్‌గానే తీసుకుంది. కార్‌పూలింగ్ ప్రేరణ.. హైదరాబాద్ సిటీలో జోరు అందుకున్న కార్‌పూలింగ్‌ని అవుట్స్కట్స్ దాటిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు ప్రదీప్. ఆలోచనను తన కొలీగ్ కృష్ణ వేదులతో షేర్ చేసుకున్నాడు. ఆయనకు నచ్చి ప్రొసీడ్ అనడంతో రీసెర్చ్ మొదలుపెట్టాడు. ఐటీ ప్రొషెషనల్స్, ప్రైవేట్ సెక్టార్‌లోని ఇతర ఉద్యోగులు ఎంతమంది వీకెండ్స్‌కి సొంతూళ్లకు వెళ్తారు, పండగలప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్కున్న డిమాండ్ అన్నిటినీ అంచనా వేశాడు. కార్‌పూలింగ్‌ని హైదరాబాద్ సరిహద్దులు దాటిస్తే బాగానే వర్కవుట్ అవుతుందనే భరోసానిచ్చింది ఆ అధ్యయనం. వెంటనే ఓ వెబ్‌పోర్టల్ డిజైన్‌కి కంప్యూటర్ స్క్రీన్ మీద శ్రీకారం చుట్టాడు. అదే ‘కో యాత్రీ డాట్ కామ్’!. పోర్టల్‌గానే కాదు, ఆన్‌డ్రాయిడ్ యాప్‌గానూ డౌన్లోడ్ అయింది. ఈ ప్రయత్నంలో వెన్నంటి ఉండి కో ఫౌండర్‌గా నిలిచాడు కృష్ణ వేదుల. ఎలా పనిచేస్తుంది? సొంత కార్లుండి.. వీకెండ్స్‌కి అవుటింగ్స్ వెళ్తున్న వాళ్లు ఈ పోర్టల్‌లో తమ పేరు, కార్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో రిజిస్టర్ కావాలి. వీటితోపాటు ఫేస్బుక్ ఐడీ, ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఐడీని జతపర్చాలి. ఆ ఆధారాలను కోయాత్రి సరిచూసుకుంటుంది. అన్నీ సరిగ్గా ఉన్నాయని తేలితేనే రిజిస్టర్ చేసుకుంటుంది. ఇక కార్ రైడ్‌ను షేర్ చేసుకోవాలనుకునే ప్యాసింజర్లు కూడా వాళ్ల ఫేస్బుక్ ఐడీతోపాటు ప్రభుత్వామోదం ఉన్న ఐడీని జతచేయాలి. ఇలా సిటీదాటి బయటి ఊళ్లకు అంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మంలాంటి పట్టణాలకు వెళ్లాలనుకునే వాళ్లకు కారు ప్రయాణాన్ని అమర్చిపెడుతున్నారు ప్రదీప్ అండ్ టీమ్. కోయాత్రి యాప్‌ని డౌన్లోడ్ చేసుకుని ఏవారం ఎటు వెళ్లాలన్నా ఏఏ వెహికిల్స్‌లో ఎవరెవరు ఎటు వైపు వెళ్తున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి.. లాంటివన్నీ చూసుకొని నచ్చిన వెహికిల్‌లో రీజనబుల్ రేట్‌తో సౌకర్యంగా గమ్యం చేరవచ్చు. అయితే ఈ రైడ్‌షేరింగ్ ఇటు కారు ఓనర్, అటు ప్యాసింజర్ ఇష్టాయిష్టాలమీదే ఆధారపడి ఉంటుంది. ఇంధన్ బచావో.. ‘కోయాత్రి స్టార్ట్ చేసి ఏడాదే అయినా రెస్పాన్స్ మాత్రం అమేజింగ్. మూడువేల మంది యూజర్స్ ఉన్నారు. ఇప్పటివరకు నాలుగు వందల రైడ్స్ పోస్ట్ అయ్యాయి. లాస్ట్ సంక్రాంతి సీజన్లో 30 మంది కార్ ఓనర్లు తమ రైడ్‌ని షేర్ చేసుకొని మొత్తం 750 లీటర్ల పెట్రోలును ఆదా చేశారు. మా కోయాత్రి లక్ష్యం కూడా అదే.. ఇంధన్ బచావో.. జన్‌ధన్ బఢావో! పడవలాంటి కార్లలో ఒక్కరే వెళ్తుంటారు. దీనివల్ల ట్రాఫిక్‌లో వాహనాల సంఖ్యతోపాటు పెట్రోల్ ఖర్చూ పెరుగుతుంది. డబ్బులు వృధా, కాలుష్యం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అరికట్టడానికే కోయాత్రి డాట్ కామ్’ అనివివరిస్తాడు ప్రదీప్‌రెడ్డి. వీటితోపాటు ఈ షేరింగ్ ఆఫ్ రైడ్ మనుషుల మధ్య స్నేహభావాన్ని నింపుతుంది. నగరాల్లో కరువైన పర్సనల్ కమ్యూనికేషన్స్‌ని మెరుగుపరుస్తుంది! ఇన్ని ప్లస్ పాయింట్స్‌తో పరుగులు పెడుతున్న కోయాత్రికి హ్యాపీ జర్నీ! మహిళల కోసం కార్ పూలింగ్.. కోయాత్రి డాట్ కామ్ అనేది కార్‌పూలింగ్‌ని ఫెసిలిటేట్ చేస్తుంది అంతే! ఈ ఐడియా రైడ్‌గా మారి ఏడాది అవుతోంది. వీళ్ల మొదటి ప్రయాణం 2014 సంక్రాంతి అప్పుడు. మంచి డిమాండే వచ్చింది. అయినా ఇంకా చాలామందికి తెలియాలని ఓ మార్కెటింగ్ టీమ్‌నీ పెట్టుకున్నారు. కోయాత్రి పనితీరు నచ్చిన సుధీర్ గడ్డం అనే ఎన్ఆర్ఐ (యూఎస్ బేస్డ్ ఐటీ కంపెనీ యజమాని) నుంచి రూ.60 లక్షల ఇన్వెస్ట్మెంటూ వచ్చింది. దీన్ని ఇప్పుడు చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మెట్రోసిటీలకు విస్తరించాలనుకుంటున్నాడు ప్రదీప్‌రెడ్డి. అంతేకాదు కేవలం మహిళల కోసం మహిళల కార్పూలింగ్నీ ఫెసిలిటేట్ చేసే పనిలో ఉన్నాడు. -
సెలవుల సంబరం ముగియకనే..
సంక్రాంతి సెలవుల్లో బంధువుల ఇంట్లో ఉన్న తమ పిల్లలను స్వగ్రామానికి తీసుకువస్తున్నామన్న సంతోషం ఆ కుటుంబాలకు రోడ్డు ప్రమాదం మృత్యురూపంలో దూరం చేసింది. గాఢ నిద్రలో ఉన్న ఆ కుటుంబీకుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి. వారు ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాలయ్యారు. ఈ విషాదకర సంఘటన కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. * కల్వర్టును ఢీకొన్న ఓమ్ని వ్యాన్ * నలుగురి మృతి,ఐదుగురికి తీవ్రగాయాలు * మృతులంతా ఒకే కుటుంబీకులు * సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ కరీంనగర్ జిల్లా గోదావరిఖని అడ్డకట్టపల్లికి చెందిన ముజీబుద్దీన్ (46), రజీయొద్దీన్ (40) అన్నదమ్ములు. వీరు గోదావరిఖనిలో స్వీట్ హోంను నిర్వహిస్తున్నారు. కాగా ముజీబుద్దీన్‌కు కుమారుడు తాలీబుద్దీన్ (18), కుమార్తెలు ముస్కాన్ (13), రాంసా, సఫోరా ఉన్నారు. రజీయొద్దీన్కు ఇద్దరు కుమార్తెలు సన, సుమయలు ఉన్నారు. అయితే పాఠశాల, కళాశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో పిల్లలను అందరినీ కలిపి అన్నదమ్ములు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి చేర్చారు. అయితే సెలవులు పూర్తి కావడంతో సోమవారం ముజీబుద్దీన్, రజియొద్దీన్లు ఓమ్నిలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి దాటిన తరువాత పిల్లలతో సహా గోదావరిఖనికి బయలుదేరారు. ఈ క్రమంలో కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులో మంగళవారం తెల్లవారు జామున మూడున్నర ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును వేగంగా ఢీ కొంది. అనంతరం పక్కనే ఉన్న గోతిలో వ్యాన్ పడింది. ఈ సంఘటనలో వాహనాన్ని నడుపుతున్న రజీయొద్దీన్, అతడి అన్న ముజీబుద్దీన్, అన్న కుమార్తె ముస్కాన్, కుమారుడు తాలిబుద్దీన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న సఫోరా, రాంసా, సుమయ, మొయినుద్దీన్, సనలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుకునూరుపల్లి ఎస్ఐ కృష్ణ నేతృత్వంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే సుమయ, మొయినుద్దీన్‌ల పరిస్థితి విషమంగా మారడంతో క్షతగాత్రులందరినీ హైదరాబాద్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌గౌడ్ సందర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. అదే విధంగా ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టంలో ఉన్న మృతదేహాలను డీఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట తొగుట సీఐ వెంకటయ్య, కుకునూర్‌పల్లి ఎస్ఐ కృష్ణలున్నారు. ఈ ప్రమాదంపై కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అతివేగమే కారణమని డీఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు. కాగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ఇంటి విషాదం నెలకొంది. కుటుంబ యజమానులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. -
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు మృతి