‘మోదీ, అమిత్ షా ఉగ్రవాదులు’
లక్నో: ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఉగ్రవాదులని ఎస్పీ నేత, యూపీ మంత్రి రాజేంద్ర చౌదరి వ్యాఖ్యానించారు. ‘వారిద్దరూ ఓట్ల కోసం యూపీలో భయాందోళనలు సృష్టించాలనుకుంటున్నారు.
మన ప్రజాస్వామ్యంలో భయాన్ని సృష్టిస్తున్నారు’ అని సోమవారమిక్కడ విలేకర్లతో అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల్లో ఎస్పీ ఆందోళనకు అద్దం పడుతున్నాయని, ప్రధానిపై అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని రాష్ట్ర ప్రజలు శిక్షిస్తారని బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి ఓమ్ మాధుర్ అన్నారు.