Rajiv home Corporation
-
బిల్లు రూ.300 కోట్లు.. ‘టిప్పు’ రూ.43 కోట్లు..?
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో మరో దోపిడీ పర్వం ఈసారి జవహర్‌నగర్ ప్రాజె క్టు వంతు నిర్మాణ సంస్థకు బకాయిలు చెల్లించే పేరిట అవినీతి దందా హైదరాబాద్: అసలే దివాలా తీసిన ప్రాజెక్టు.. ఆపై అంతంత మాత్రంగా మారిన ప్రభుత్వ పర్యవేక్షణ.. ఇదే అదనుగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో మరో దోపిడీ పర్వానికి తెర లేచింది. తెల్ల ఏనుగులా మారిన జవహర్‌నగర్‌లోని ప్రాజెక్టును ఎలా అమ్మాలనే విషయంలో కసరత్తు కూడా కనిపించని తరుణంలో.. దాని బిల్లుల చెల్లింపులో హస్తలాఘవం ప్రదర్శించేందుకు తెరవెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బడా నిర్మాణ సంస్థ ఈ భవనాలను నిర్మించింది. అయితే ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో ప్రాజెక్టు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో రెండేళ్లుగా ఇక్కడ పనులు జరగటం లేదు. 14 అంతస్తులతో కూడిన బ్లాకుల్లో 2,858 ఫ్లాట్లను నిర్మించారు. నిర్మాణ సంస్థకు రూ.300 కోట్లకుపైగా ప్రభుత్వం బకాయిపడింది. ఈ బిల్లుల కోసం ఆ సంస్థ ప్రతినిధులు కొన్ని నె లలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా.. నిధులు లేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని చెల్లించటం లేదు. ఈ తరుణంలో రంగంలోకి దిగిన కొందరు నేతలు.. ఆ సంస్థకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఇక్కడే రాష్ట్ర విభజనకు పూర్వం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో బండ్లగూడ ప్రాజెక్టులో జరిగిన ఓ దందాను వీరు కాపీ కొట్టేశారు. ఎస్కలేషన్ పేరిట అప్పట్లో నేతలు, కొందరు అధికారులు వంద కోట్ల వరకు కొల్లగొట్టేశారు. టీఆర్ఎస్ సర్కారు కొలువుదీరిన తర్వాత అప్పటి గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తెచ్చి.. రెండో విడతలో ఇదే తరహాలో లూటీ చేసేందుకు సిద్ధమైన కుట్రను భగ్నం చేశారు. అయితే ఇప్పుడు కొందరు నేతలు అదే విధానాన్ని జవహర్‌నగర్ ప్రాజెక్టుకు అన్వయించి రూ.43 కోట్లను స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ జీవో.. ఓ దోపిడీ: నిర్మాణ సామగ్రి ధరలు పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్ చేసే విధానాన్ని సిమెంటు, స్టీలుతోపాటు ఇసుక, ఇటుకలు తదితరాలకు వర్తించేలా ఐదేళ్ల క్రితం నాటి ప్రభుత్వం ఉత్తర్వు నం.35ను జారీ చేసింది. కానీ ఇది స్వగృహకు వర్తించదు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో దీనిని స్వగృహకు వర్తించేలా కొందరు ఉత్తర్వు ఇప్పించారు. బండ్లగూడ ప్రాజెక్టుకు దీన్ని వర్తింపజేసి రూ.100 కోట్లు స్వాహా చేశారు. ఇప్పుడు అదే ఉత్తర్వును జవహర్‌నగర్ ప్రాజెక్టుకు వర్తింపచేసి.. ఎస్కలేషన్ రూపంలో రూ.43 కోట్లు కొల్లగొట్టాలని కొందరు నేతలు చూస్తున్నారు. నిర్మాణ సంస్థకు రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉన్నందున.. రూ.43 కోట్లు అందులో చేర్చి విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా రు. నిర్మాణ సంస్థ ఫైనల్ బిల్లులను దాఖలు చేస్తేనే బకాయిలు వచ్చే అవకాశం ఉండటంతో స్వగృహలో పనిచేస్తున్న కొందరు విశ్రాంత అధికారులు, ఓ ముఖ్య అధికారి ఈ తంతును పూర్తి చేయిస్తున్నట్టు తెలుస్తోంది. -
అమ్మకానికి హౌసింగ్ భూములు!
స్థలాల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం భూములు విక్రయిస్తారనే ప్రచారం.. గృహ నిర్మాణ మండలి అధీనంలో ఉన్న స్థలాల విలువ రూ. 10 వేల కోట్లు ఇప్పటికే హైదరాబాద్‌లోని 1,800 ఎకరాల లెక్కలు సీసీఎల్ ఏకు.. ‘దిల్’కు చెందిన రూ. 6 వేల కోట్ల భూముల వివరాలు సేకరణ సాక్షి, హైదరాబాద్: ఆ సంస్థ చేతిలో ఉన్న భూముల విలువ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. పదివేల కోట్లు... ఒక్క హైదరాబాద్ పరిధిలో ఉన్న స్థలాల విలువే రూ. రెండు వేల కోట్లకు పైమాటే.. ఇంకేం ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి బంగారు బాతులా మారింది.. ఆ భూములన్నీ అమ్మేసి, నిధులన్నీ ఖజానాలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.. ఇంతకూ ఆ సంస్థ ఏదో తెలుసా..‘రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు)’ దీని పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల వివరాలను ప్రభుత్వం శరవేగంగా సేకరిస్తోంది. రాజధాని చుట్టుపక్కల ఉన్న దాదాపు 1,800 ఎకరాల భూముల వివరాలు ఇప్పటికే సీసీఎల్ఏకు అందాయి. హౌసింగ్ బోర్డుకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.10వేల కోట్ల విలువైన భూములు ఉండగా... దీనికి అనుబంధంగా ఉన్న ‘దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్)’కు దాదాపు రూ. 6 వేల కోట్ల విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ మొత్తం వివరాలను ఇప్పుడు ప్రభుత్వం సేకరిస్తోంది. వీటిలో ఇప్పటికిప్పుడు గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ప్రభుత్వ మదిలో లేదు. సంక్షేమ పథకాలకు భారీగా నిధులు అవసరం ఉండటం, అందుకు సరి పడా ఆదాయ మార్గాలు లేకపోవటంతో ఈ భూముల అమ్మకం తథ్యమనే భావన వ్యక్తమవుతోంది. బోర్డు విభజన తర్వాతే.. తెలంగాణ, ఏపీల మధ్య ఇప్పటివరకు గృహనిర్మాణ మండలిని విభజించలేదు. దీంతో తొలుత దాని విభజనపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కూడా ఇదే విషయంపై చర్చించారు. వీలైనంత త్వరగా విభజన తంతు పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డులను వేరే విభాగంలో విలీనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అర్బన్ హౌసింగ్‌ను పురపాలకశాఖలో విలీనం చేయాలన్న ఓ ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉండటంతో దాన్ని కొలిక్కి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల్లో ఆందోళన.. ప్రభుత్వం భూముల వివరాలను సేకరిస్తుండడంపై గృహనిర్మాణ మండలి సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో, శివార్లలోని స్థలాల వివరాలను 3రోజులుగా ఉన్నతాధికారులు వెంటపడి మరీ తెప్పించుకున్నారని..వాటిని అమ్మే ఆలోచనలో ఉంటే తమ భవితవ్యమేమిటో ముందుగా చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సంస్థ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బుధవారం గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దానకిషోర్తో భేటీ అయ్యారు. గృహ నిర్మాణ మండలిని కొనసాగించని పక్షంలో తమనేం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయంలో తనకూ స్పష్టత లేదని, విభజన తర్వాతే తెలుస్తుందని, ఇప్పటికిప్పుడు చెప్పటం సాధ్యం కాదని దానకిషోర్ పేర్కొనటంతో ఉద్యోగులు మరింత ఆందోళన చెందారు. తమది పెన్షనబుల్ ఉద్యోగమైనందున పింఛన్ భద్రత ఉండే నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
‘స్వగృహ’లో ఎస్కలేషన్ మాయ రూ.100 కోట్లపైనే?
ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది రూ.70 కోట్లు ప్రభుత్వానికి నివేదించిన అధికారులు.. స్పందన కరువు సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లో ఎస్కలేషన్ పేరుతో కాంట్రాక్టర్లకు అప్పనం గా చెల్లించిన రూ.100 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొందరు నేతలు, అధికారులు కుమ్మక్కై స్వగృహకు వర్తించని జీఓను అడ్డుపెట్టుకుని ఈ చెల్లింపులు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ బాగోతం వెలుగు చూసింది. తొలుత దీంతో రూ.70 కోట్లు దారిమళ్లాయని గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రాథమికంగా తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. కానీ దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో అసలు గల్లంతైన మొత్తం ఎంతో పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చేపనిని పక్కనపెట్టేశారు. ‘ఉత్త’ర్వుతో హస్తలాఘవం..: నిర్మాణ సామగ్రి ధర పెరిగితే అదనపు చెల్లింపులకు అవకాశం ఉంటుంది. సిమెంట్, స్టీలుతోపాటు ఇసుక, ఇ టుక, విద్యుత్ ఉపకరణాలు, ఫ్లోరింగ్, శానిటరీ సామగ్రి, కూలీ రేట్లు... ఇలా అన్నిరకాల అంశాలకు సంబంధించి ధరల్లో పెరుగుదల నమోదైతే కాంట్రాక్టర్లకు అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు వీలుగా ఐదేళ్లక్రితం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. అయితే ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంతో నిర్మాణాలు జరుపుతున్నందున దాన్ని స్వగృహకు వర్తింపచేయాల్సిన అవసరం లేదని అప్పట్లో నిర్ణయించారు. వెరసి ఆ ఉత్తర్వు స్వగృహకు వర్తించదని స్వగృహ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. కానీ ఎన్నికలు సమీపించేవేళ కొందరు ఉన్నతాధికారులు, నేతలు కలసి దాన్ని స్వగృహకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. అప్పటికే పూర్తయిన పనులకు కూ డా దాన్ని వర్తింపచేయటం విశేషం. ప్రభుత్వం అప్పట్లో స్వగృహకు రూ.240 కోట్ల రుణం అందజేసింది. అందులోంచి ఈ ఉత్తర్వు ప్రకారం కాం ట్రాక్టర్లకు అదనంగా చెల్లింపులు జరిపారు. ఆ తర్వాత మరికొన్ని నిధులు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. వాటిల్లోంచి ఇలాగే చెల్లింపు లు జరిపినట్టు తెలిసింది. విభజన సమయంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ఇలాంటి ఓ ప్రతి పాదన గవర్నర్‌కు చేరింది. దాన్ని ఆయన పెం డింగ్‌లో పెట్టి... విభజనానంతరం తెలంగాణ ప్రభుత్వానికి పంపారు. ఆ ఫైలును పరిశీలించిన ప్రస్తుత అధికారులకు అసలు విషయం తెలిసి విచారణ జరపటంతో గుట్టురట్టయింది.