Rajiv Mehrishi
-
కీలక నియామకాలు చేపట్టిన కేంద్రం
-
కీలక నియామకాలు చేపట్టిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), ఎలక్షన్ కమిషనర్ పదవులకు కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. కాగ్ గా హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహర్షిని, ఎలక్షన్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ అరోరాను, సీబీఎస్ఈ బోర్డు ఛైర్మన్‌గా అనితా కార్వాల్‌ను నియమించింది. హోంశాఖ కార్యదర్శిగా రెండేళ్లపాటు సేవలు అందించిన రాజీవ్ మెహర్షీ నేడు ఆ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయనకు కాగ్ గా సరికొత్త బాధ్యతలు అప్పగించారు. 1978 రాజస్థాన్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మెహర్షీ 2015 ఆగస్ట్ 31 నుంచి హోంశాఖ కార్యదర్శిగా సేవలిందిస్తున్నారు. ఆయన గతంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా, రాజస్థాన్ సీఎస్‌గా విధులు నిర్వహించారు. సెప్టెంబర్ 24న కాగ్‌గా పదవీ విరమణ చేయనున్న శశికాంత్ శర్మ అనంతరం మెహర్షీ బాధ్యతలు స్వీకరిస్తారు. 1980 బ్యాచ్, రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ రిటైర్డ్ కార్యదర్శి సునీల్ అరోరా(61)ను ఎలక్షన్ కమిషనర్‌గా నియమించారు. ప్రసార భారతికి సలహాదారుడిగా, మినిస్ట్రి ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్కి కార్యదర్శిగా సేవలందించిన ఆరోరా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాజీవ్ మహర్షి సోమవారం రిటైర్డ్ కావాల్సి ఉండగా, రెండేళ్లపాటు పదవీకాలం పొడిగించి హెంశాఖ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నఎల్సీ గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. -
'10 రోజుల్లో పదవి చేపడతారు'
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా ఎంపికైన ప్రఖ్యాత భారతీయ బ్యాంకర్ కేవీ కామత్ 10 రోజుల్లో పదవి చేపట్టనున్నారని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి వెల్లడించారు. కొన్ని కంపెనీల బోర్డుల్లో విధులు నిర్వహిస్తున్న ఆయన వాటికి రాజీనామా చేశారని తెలిపారు. వచ్చే వారం లేదా 10 రోజుల్లో బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారని చెప్పారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. 67 ఏళ్ల కామత్ దేశీ ప్రైవేటు బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కామత్ వ్యవహరిస్తున్నారు.