'10 రోజుల్లో పదవి చేపడతారు'
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా ఎంపికైన ప్రఖ్యాత భారతీయ బ్యాంకర్ కేవీ కామత్ 10 రోజుల్లో పదవి చేపట్టనున్నారని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి వెల్లడించారు. కొన్ని కంపెనీల బోర్డుల్లో విధులు నిర్వహిస్తున్న ఆయన వాటికి రాజీనామా చేశారని తెలిపారు. వచ్చే వారం లేదా 10 రోజుల్లో బ్రిక్స్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారని చెప్పారు.
ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. 67 ఏళ్ల కామత్ దేశీ ప్రైవేటు బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కామత్ వ్యవహరిస్తున్నారు.