ram narayana reddy
-
చంద్రబాబుకు అమ్ముడుబోయి.. చరిత్రహీనులుగా మిగిలి..
సాక్షి, అమరావతి: YSRCPతరపున 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి.. ఇవ్వాళ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసి సస్పెన్షన్‌కు గురయిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి.. ఇప్పుడు ముసుగు తీసి టిడిపిలో చేరబోతున్నారు. చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్న వైసిపి ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీ ఢీలా పడడం, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధోపాతాళానికి పడిపోవడంతో చంద్రబాబు పక్కచూపులు చూస్తున్నారు. 52 రోజులు జైల్లో గడిపిన సమయంలో పార్టీ యావత్తు నిద్రావస్థలోకి వెళ్లిపోవడంతో.. అప్పటికప్పుడు పవన్‌తో జైలు నుంచే పొత్తు ప్రకటించారు. అయినా పార్టీ కోసం ముందుకొచ్చే వాళ్లు లేకపోవడం పక్కచూపులు చూస్తున్నారు. YSRCP నుంచి సస్పెన్షన్‌కు గురయిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి.. ఇద్దరిని ఇవ్వాళ పార్టీలో చేర్చుకోబోతున్నాడు చంద్రబాబు. వీరిద్దరికి టికెట్లు ఇస్తారా? లేక వెన్నుపోటేనా అన్నది త్వరలోనే తేలనుంది. ఉండవల్లి, ఆనం.. దొందు దొందే అధికారం ఇచ్చిన పార్టీకే అనాయ్యం చేయాలని చూసి.. స్వప్రయోజనాల కోసం దిగజారిపోయి.. చంద్రబాబుకు అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ. తిన్నింటి వాసాలు లెక్కపెట్టాలని చూశారు.. నమ్మించి వెన్నుపోటు పొడవాలని చూశారు. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్ ఉల్లంఘించినందుకు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డితో పాటు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వైఎస్సార్సీపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. రహస్యంగా టీడీపీకి ఓటు వేసి దొరికిపోయిన వీరిని, వైఎస్సార్సీపీ నాయకత్వం సమర్దంగా కోడింగ్ ను అమలు చేసి వారిని ఇట్టే పట్టేసింది. వారిని అంతకుముందే పిలిచి వచ్చే శాసనసభ ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పదవులు ఇస్తామని చెప్పారు. అయినా వారు సంతృప్తి చెందలేదు. తెలుగుదేశం ఆశపెట్టడంతో వాటికి లొంగి పోయారు. -
‘రేవంత్, కిరణ్ కుమార్‌రెడ్డి కోవర్టులు’
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి 25 స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పే చంద్రబాబు.. ఇప్పడు 20 మంది ఎంపీలు ఉంటే ఏం సాధించారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు కేంద్రంలో కొనసాగి సాధించలేని విభజన హామీలను 25 మంది ఎంపీలు ఉంటే సాధిస్తాననటం హాస్యాస్పదమన్నారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో నారాయణరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. కడప ఉక్కు కర్మాగారంను తామే సొంతంగా నిర్మించుకుంటామని చంద్రబాబు ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. స్థానిక టీడీపీ ఎంపీలకు చెందిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే సొంతంగా నిర్మిస్తామని అంటున్నారని ఆరోపించారు. రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కడప ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో మరోసారి రాయలసీమ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రమే ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని ఇదివరకే తెలిపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కొత్తకుట్ర చేస్తున్నారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని చంద్రబాబు అంటున్నారు. మరి మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలపై ఆయన ఎందుకు మాట్లాడంలేదు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని ఆయనకు తెలుసు. ఓటమి భయంతోనే బాబు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రతీ మీటింగ్‌లో అమరావతిని షాంగై, సింగపూర్ చేస్తామని చెప్తున్నారు. కానీ నాలుగున్నరేళ్ల కాలంలో ఏమీ చేయలేకపోయారు’’ అని అన్నారు. ‘‘తిరుపతిని సిలికాన్ సిటీగా పేరు మార్చాలనే ప్రతిపాదన విరమించుకోవాలి. లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. గతంలో వెయ్యికాళ్ల మండపంను నిర్మూలించిన తరువాత ఏం జరిగిందో చంద్రబాబుకు బాగా తెలుసు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో కిరణ్ కుమార్‌లు చంద్రబాబుకు కోవర్టులుగా మారారు. చివరి బంతి అన్న కిరణ్ ఇప్పటివరకు ఎక్కడున్నారు. జగన్‌ను విమర్శించే స్థాయి కిరణ్‌కు లేదు. కోవర్టులను వాడుకుని రాహుల్ గాంధీని దెబ్బతీయాలనేది చంద్రబాబు ప్రయత్నం.’’ అని పేర్కొన్నారు. -
రచ్చబండ రసాభాస
కోవూరు, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన రచ్చబండ సోమవారం కోవూరులో రచ్చరచ్చగా ముగిసింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య తూతూ మంత్రంగా జరిగింది. కోవూరులోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో రచ్చబండ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి రామనారాయణరెడ్డి ప్రసంగం ప్రారంభించగానే సీపీఎం నాయకులు నిరసన తెలిపి అడ్డుకున్నారు. మండలంలో ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతుంటే వాటిని పరిష్కరించలేని రచ్చబండ ఎందుకని నిలదీశారు. కోవూరు చక్కెర కర్మాగారానికి చెరకు రవాణా చేసిన రైతులకు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయని, ఆ కర్మాగారంపై ఆధారపడి పది వేల రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని, తొలుత ఆ సమస్యను పరిష్కారించాలని మంత్రిని ఘెరావ్ చేశారు. ఈ కర్మాగారం మీద దాదాపు 500 మంది కార్మిక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. గతంలో జాతీయ అవార్డు పొందిన కోవూరు చక్కెర కర్మాగారం తుప్పు పట్టి పైసాకు కూడా పనికి రాకుండా పోతోందన్నారు. దీనికి ప్రభుత్వం, యాజమాన్యమే కారణమన్నారు. చక్కెర కర్మాగారం నుంచి కోట్లాది రూపాయలు కార్మికులకు, ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయన్నారు. కర్మాగారం ఓవరాలింగ్ పనులకు నిధులు లేక క్రషింగ్ ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. 2013-14 సీజన్‌కు కర్మాగార పరిధిలో సుమారు 2.5 లక్షల టన్నులు చెరకు సాగుచేసి గానుగ ఆడుటకు సిద్ధంగా ఉందన్నారు. కాని వీటి అన్నింటిని పర్యవేక్షించేందుకు ఎండీ కాని, సమాన క్యాడర్ కలిగిన ఏ ఒక్కరు లేకపోవడం దారుణమన్నారు. ఇన్ని సమస్యలతో కర్మాగారాన్ని ఎలా నిర్వహించాలో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల స్థలాలు ఇస్తామని కోట్లాది రూపాయలు వెచ్చించి 13 ఎకరాలు కొనుగోలు చేసి నిరుపయోగంగా వదలివేశారని మండిపడ్డారు. తాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే విలాసవంతమైన జీవితాలతో కాలం వెళ్లదీస్తున్నారంటూ దుయ్యబట్టారు. సీపీఎం నాయకుల రచ్చరచ్చతో సభాప్రాంగణంలో కొంత అలజడి చోటు చేసుకుంది. మంత్రి ఆదేశంతో పోలీసులు సీపీఎం కార్యకర్తలను ఈడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రజా సమస్యలపై అడిగితే అరెస్ట్ చేస్తారా అంటూ సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు.